ఐనంపూడి శ్రీ లక్ష్మి (Inampudi Sri Lakshmi)

Share
పేరు (ఆంగ్లం)Inampudi Sri Lakshmi
పేరు (తెలుగు)ఐనంపూడి శ్రీ లక్ష్మి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ08/15/1965
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలునిజామాబాదు జిల్లా
వృత్తిరచయిత్రి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఅలల వాన,లైఫ్ @ చార్మినార్,మోనోలాగ్ ఆఫ్ ఏ వూండెడ్ హార్ట్
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలుhttps://kinige.com/author/Inampudi+Srilaxmi
పొందిన బిరుదులు / అవార్డులుకీర్తి పురస్కారం,తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఅలల వాన
సంగ్రహ నమూనా రచననువ్వు పరశురాముడివై తలనరికినాడు
తండ్రికి తగ్గ తనయుడవని తలొంచాను
రాముడిగా నువ్వు
నిండు చూలాలిగా ఉన్న నన్ను
అరణ్యాల పాలు చేసినప్పుడు

ఐనంపూడి శ్రీ లక్ష్మి

నువ్వు పరశురాముడివై తలనరికినాడు

తండ్రికి తగ్గ తనయుడవని తలొంచాను

రాముడిగా నువ్వు

నిండు చూలాలిగా ఉన్న నన్ను

అరణ్యాల పాలు చేసినప్పుడు

రాజుగా ప్రవర్తించావని మెచ్చుకున్నాను

హరిశ్చంద్రుడిలా యిచ్చిన మాట కోసం

ఆలినే అమ్ముకున్నప్పుడు

సత్యసంధుడవని సంబరపడ్డాను

ధర్మరాజుగా జూదంలో ఫణంగా పెట్టి ఓడినప్పుడు

కష్టాల్లో పాలుపంచుకున్నానని ఆనందించాను.

కృష్ణుడిగా పదహారువేలమంది భార్యల్ని భరించిననాడు

భర్తవి కదా అని సరిపెట్టుకున్నాను

అన్ని కాలాల్లోను

నిన్ను నేను నమ్ముకుని వరించానే కానీ యెదిరించలేదు

ఇప్పుడు మాత్రం

అమ్మకాని కున్న నిన్ను వెలకట్టి కొనుక్కోలేను

ఇక నిన్నెవ్వరూ కొనుక్కోకుండా చూడడమే నా పని!

https://kinige.com/book/Alala+Vaana

———–

You may also like...