వెంకటేశ్వర ప్రసాదరాజు రాళ్లబండి (Venkateswara Prasadraju Rallabandi)

Share
పేరు (ఆంగ్లం)Venkateswara Prasadraju Rallabandi
పేరు (తెలుగు)వెంకటేశ్వర ప్రసాదరాజు రాళ్లబండి
కలం పేరుకవితాప్రసాద్‌
తల్లిపేరురత్నవర్ధనమ్మ
తండ్రి పేరుకోటేశ్వర రాజు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1961, మే 21
మరణం2015, మార్చి 15
పుట్టిన ఊరుకృష్ణా జిల్లా, గంపలగూడెం మండలం, నెమలి గ్రామం
విద్యార్హతలుపి.హెచ్.డి.
వృత్తిఅవధాని, కవి
గ్రూప్-1 అధికారిగా సాంఘిక సంక్షేమ శాఖ
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఅగ్నిహంస
ఒంటరి పూలబుట్ట
దోసిట్లో భూమండలం
కాదంబిని
సప్తగిరిధామ శతకం
పద్యమండపం
ఇది కవిసమయం
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు2015లో తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షిక
సంగ్రహ నమూనా రచన

 వెంకటేశ్వర ప్రసాదరాజు రాళ్లబండి

అవధానాలలో పూరణలు
ఇతడు చేసిన అవధానాలలో కొన్ని పూరణలు మచ్చుకు –

1. సమస్య: గీతను నమ్మరాదనియె కృష్ణుడు పార్థునితోడ మిత్రమా!

పూరణ:

జాతికి దారిచూపి, దృఢసత్త్వము నిచ్చి, మనస్సు నందునన్
భీతిని పారద్రోలి పలువేదనలన్ పరిమార్చు గీత,దు
ర్నీతులబద్ధమిద్దియని నిందలతో పరిహాసమాడినన్
గీతను, నమ్మరాదనియె కృష్ణుడు పార్థునితోడ మిత్రమా!

2. సమస్య: కోతిని పెండ్లియాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగా!

పూరణ:

భీతమృగాక్షి యొక్కతె వివేచన కోల్పడె చర్మబాధచే,
నాతికి పెండ్లికాదని, వినాశనమౌనని నేస్తులెంచుచున్
జాతకముల్ గుణింపగ, భిషక్కుని సాయము పొంది మందొ, మా
కో, తిని పెండ్లియాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగా!

3. సమస్య: గురువుకు పంగనామములు గుట్టుగ పెట్టనివాడు శిష్యుడే!

పూరణ:

గురువుల చిత్రమొక్కటి అకుంఠిత రీతిని వ్రాసి దానిలో
మరచెను పంగనామములు, మానితమైన ప్రదర్శనంబునం
దరసినవారు దోషము తామయి చూపకముందె, తానుగా
గురువుకు పంగనామములు గుట్టుగ పెట్టనివాడు శిష్యుడే!

———–

You may also like...