| పేరు (ఆంగ్లం) | Lakshmi Narayana Sabbani | 
| పేరు (తెలుగు) | లక్ష్మి నారాయణ సబ్బాని | 
| కలం పేరు | – | 
| తల్లిపేరు | నాగమ్మ | 
| తండ్రి పేరు | మల్లేశం | 
| జీవిత భాగస్వామి పేరు | శారదా | 
| పుట్టినతేదీ | 1960 ఏప్రిల్ 1న | 
| మరణం | – | 
| పుట్టిన ఊరు | కరీంనగర్ జిల్లా, బొమ్మకల్ గ్రామం | 
| విద్యార్హతలు | ఎం. ఎ. ( ఆంగ్లం), ఎం. ఎ. ( హింది), ఎం. ఎ. ( ఆస్ట్రాలజీ), ఎం.ఎస్సీ. ( సైకాలజీ), ఏం.ఎడ్. , పి.జి. డిప్లొమా ఇన్ టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్. | 
| వృత్తి | రచయిత, కవి, సాహిత్యవేత్త. | 
| తెలిసిన ఇతర భాషలు | – | 
| చిరునామా | – | 
| ఈ-మెయిల్ | – | 
| ఫోను | – | 
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – | 
| స్వీయ రచనలు | మౌనసముద్రం ( వచన కవిత) – 1999. 2. మన ప్రస్థానం ( పేరడీలు ) -2001. 3. బతుకు పదాలు- 2003 . 4. నది నా పుట్టుక ( వచన కవిత) – 2005. 5. మనిషి ( దీర్ఘ కవిత ) -2007. 6.శేషేంద్ర స్మృతిలో -2007. | 
| ఇతర రచనలు | – | 
| ఈ-పుస్తకాల వివరాలు | https://kinige.com/tag/Sabbani+Lakshmi+Narayana | 
| పొందిన బిరుదులు / అవార్డులు | 1. తెలుగు విశ్వ విద్యాలయ కీర్తి పురస్కారం 2018. 2. రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్ ఆం.ప్ర. ప్రభుత్హ్వం. -201౩. 3.సాహిత్య భూషణ్ అవార్డ్, సారస్వత జ్యోతి మిత్ర మండలి, కరీంనగర్.- 20౦5. 4. బెస్ట్ ఎన్ ఎన్ యస్. ప్రోగ్రాం కోర్డినేటర్ అవార్డు కరీంనగర్ జిల్లా. -2011. 5.మహా కవి శేషేంద్ర అవార్డ్ – 2015, హైదరాబాద్. 6. ఉమ్మడి శెట్టి సాహిత్య ప్రతిభా పురస్కారము -2015, అనంతపురము. ఆం.ప్ర. 7.మళ్ళా జగన్నాధం స్మారక ఉత్తమ కవి పురస్కారము- 2015, అనకాపల్లి . ఆం.ప్ర. | 
| ఇతర వివరాలు | – | 
| స్ఫూర్తి | – | 
| నమూనా రచన శీర్షిక | తెలంగాణ – కొన్ని వాస్తవాలు | 
| సంగ్రహ నమూనా రచన | తెలంగాణ – కొన్ని వాస్తవాలు .( వ్యాస సంకలనం ) . సబ్బని లక్ష్మీనారాయణ కలం నుండి తెలంగాణా నేపథ్యంగా వెలువడిన వ్యాసాల సంకలనం ఇది. | 
లక్ష్మి నారాయణ సబ్బాని
తెలంగాణ – కొన్ని వాస్తవాలు .( వ్యాస సంకలనం ) . సబ్బని లక్ష్మీనారాయణ కలం నుండి తెలంగాణా నేపథ్యంగా వెలువడిన వ్యాసాల సంకలనం ఇది. మలి దశ తెలంగాణ ఉద్యమ కాలములో 2001 నుండి 2014 వరకు సబ్బని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను కోరి వివిధ సందర్భములలో పత్రికలలో వ్యాసాలూ రాసిండు, పాటల సిడీలు వేసిండు, 10 వరకు పాటలు , కవిత్వపు పుస్తకాలు రాసిండు. ప్రజల ఉద్యమమై తెలంగాణా గెలిచి నిలిచి స్వరాష్ట్రమై వెలసినది. తెలంగాణ కల సాకారమైన తరువాత సబ్బని తన ఉద్యోగ విరమణ జులై 2015 తరువాత ఈ వ్యాసాల సంకలనాన్ని తెలంగాణా ఉద్యమ సిద్ధాంత కర్త కీ. శే . ప్రొ. జయ శంకర్ గారికి అంకితమిస్తూ విడుదల చేసిండు. ఇందులో తెలంగాణ చరిత్ర , సంస్కృతి, భాష , తెలంగాణా ఉద్యమ ఆవశ్యకత గురించి 16 వ్యాసాలు ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరముపై రెండు విశేషమైన వ్యాసా లు ఉన్నాయి. 7 వ నిజాం పాలనపై , ఆయన పాలనలో హైదరాబాద్ నగర అభివృద్ధిపై రెండు వ్యాసాలూ ఉన్నాయి. ఉద్యమ కాలములో పత్రికల్లో నానిన భద్రాచలం గురించి ఒక వ్యాసము ఉంది . తెలంగాణ కల సాకారమైన విజయోత్సవ వేళ సబ్బని రాసిన వ్యాసం ఉంది. తెలంగాణ పై అధ్యయనం చేయ గోరే వారికి కొంత విలువైన సమాచారం లభ్యమవుతుంది ఈ పుస్తకము ద్వారా.
https://kinige.com/book/Telangana+Konni+Vastavalu
———–
 
					 
																								 
																								