| పేరు (ఆంగ్లం) | Prasen | 
| పేరు (తెలుగు) | ప్రసేన్ | 
| కలం పేరు | – | 
| తల్లిపేరు | – | 
| తండ్రి పేరు | – | 
| జీవిత భాగస్వామి పేరు | ఇంద్రాణి | 
| పుట్టినతేదీ | 1960, ఏప్రిల్ 23 | 
| మరణం | – | 
| పుట్టిన ఊరు | ఖమ్మం, తెలంగాణ | 
| విద్యార్హతలు | – | 
| వృత్తి | కవి, పాత్రికేయుడు, సినీ విశ్లేషకుడు | 
| తెలిసిన ఇతర భాషలు | – | 
| చిరునామా | – | 
| ఈ-మెయిల్ | – | 
| ఫోను | – | 
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – | 
| స్వీయ రచనలు | 1983: రక్తస్పర్శ (కవితా సంకలనం) 1995: ఇంకావుంది (కవిత్వ సంపుటి) 2001: ఏదీకాదు (కవిత్వ సంపుటి) 1991: క్రితం తర్వాత (దీర్ఘకవిత) 1991: గద్దరు రాజ్యము మనము (దీర్ఘ కవిత) 2006: ప్రసేన్ సర్వస్వం (సమగ్ర రచనల సంపుటి) 2009: ప్రసేన్ సర్వస్వం (పునర్ముద్రణ) | 
| ఇతర రచనలు | – | 
| ఈ-పుస్తకాల వివరాలు | https://kinige.com/author/Prasen | 
| పొందిన బిరుదులు / అవార్డులు | 2015: తెలంగాణ ప్రభుత్వ ఉత్తమ సాహితీవేత్త అవార్డు (ఖమ్మం జిల్లా) 2010: సాహితీ మాణిక్యం అవార్డు 2016: తానా పురస్కారం[4] 2016: అరుణ్ సాగర్ అవార్డు | 
| ఇతర వివరాలు | – | 
| స్ఫూర్తి | – | 
| నమూనా రచన శీర్షిక | ప్రసేన్ సర్వస్వం | 
| సంగ్రహ నమూనా రచన | ఎప్పటికప్పుడు వ్యవస్థీకృతమవుతున్న అజ్ఞానాన్ని బద్ధలు కొట్టడానికి ప్రసేన్ నిత్యం ప్రయత్నిస్తున్నట్టు అతని కవిత్వం స్పష్టంగా చెపుతుంటుంది. ఈ ప్రయత్నం కవిత్వంలోనే కాక మరింత స్పష్టంగా వ్యాసాలలో కూడా చేసి చూపించాడు. | 
ప్రసేన్
ఎప్పటికప్పుడు వ్యవస్థీకృతమవుతున్న అజ్ఞానాన్ని బద్ధలు కొట్టడానికి ప్రసేన్ నిత్యం ప్రయత్నిస్తున్నట్టు అతని కవిత్వం స్పష్టంగా చెపుతుంటుంది. ఈ ప్రయత్నం కవిత్వంలోనే కాక మరింత స్పష్టంగా వ్యాసాలలో కూడా చేసి చూపించాడు. దళిత కవిత్వంలో సెల్ఫ్ ఇంటరాస్పెక్షన్ కరువైనప్పుడు మాల బ్రాహ్మల దళిత ధాష్టీకం, ఆ విమర్శకుడి రెండో కన్నుగుడ్డిది వంటి వ్యాసాలు అందుకు ఉదాహరణ. కవిత్వం నిర్దిష్టత దిశ నుంచి వర్గ నిర్దిష్టతవైపు సాగిపోతున్నదన్న వాస్తవాన్ని గుర్తించినవాడు కనుకనే ఇది బి.సి. సూర్యోదయం అంటూ జూలూరి గౌరీశంకర్ పుస్తకానికి ముందుమాట రాయగలిగాడు. ఇతడు బీయింగ్‌కి నథింగ్‌నెస్‌కి మధ్య సంచరించకుండా రాజకీయ అస్థిత్వవాదంవైపు అడుగేస్తున్నాడు అని ఒక విమర్శక మిత్రుడు ఏదీ కాదు పుస్తకం వెనుక రాసిన మాటల్లో నిజం ఉన్నప్పటికీ ప్రసేన్ పొలిటికల్ ఎగ్జిస్టెన్షియలిజం నుంచి మెటాఫిజికల్ ఎంప్టీనెస్‌లోకి అడుగేస్తున్నాడన్నది కూడా వాస్తవం.
https://kinige.com/book/Prasen+Sarvaswam
———–
 
					 
																								 
																								