పేరు (ఆంగ్లం) | Ramakrishna Perugu |
పేరు (తెలుగు) | రామకృష్ణ పెరుగు |
కలం పేరు | – |
తల్లిపేరు | కమలమ్మ |
తండ్రి పేరు | పెరుగు వెంకటేశ్వర్లు |
జీవిత భాగస్వామి పేరు | సుజనారామం |
పుట్టినతేదీ | 05/27/1960 |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | సహాయ వాణిజ్యపన్నుల శాఖాధికారి |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | వెన్నెల జలపాతం (కవిత) (1996) శ్వేత సంతకాలు (1999) (ఆరుగురు రచయిత ల కవితా సంకలనం) నువ్వెల్లిపోయాక (దీర్ఘ కవిత) (2003) కథాకళి పేరుతో నెల్లూరు కథలకు సంపాదీయకత్వం. (2004) ప్లెమింగో (దీర్ఘ కవిత): (2006):సూళ్లూరుపేట ప్రాంతంలో వలస వచ్చి విడిదిచేసే సైబీరియా, నైజీరియా పక్షులను కవితావస్తువుగా తీసుకుకొని పక్షలను వలచి, మలచి వ్రాసిన ఆ కవితా హృదయాలను వోలాలడించింది. ప్లెమింగో (2007), ఆంగ్లం,హిందీ,మలయాళం,కన్నడం.. భాషల్లో అనువాదం. నానీల మినీ కవిత్వం. (2007) పరావర్తనం (ఆడియో పోయిట్రీ బుక్) ముంజలు (బిలింగుల్ మిని పోయిట్రీ కలక్షన్) |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | http://www.saarangabooks.com/telugu/tag/%E |
పొందిన బిరుదులు / అవార్డులు | UWA అవుట్ స్టాండింగ్ ఇంతలెక్చుయల్ ఆఫ్ 21 సెంచరీ అవార్డు, చెన్నై. 2000లో మిలీనియం ఎక్స్‌రే ప్రధాన అవార్డును ప్రముఖ కవి జ్వాలముఖి చేతుల మీదగా అందుకున్నారు. 2003లో రంజనీ కుందుర్తి జాతీయ ప్రధాన అవార్డును జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి. నారాయణరెడ్డి చేతులమీదుగా అందుకున్నారు. 2007లో అవుట్‌స్టాడింగ్ ఇంటలె క్చువల్ ఆఫ్ ట్వంటీపస్ట్ సెంచరీ అవార్డును యుజిసి చైర్మన్ సుఖ్‌దేవ్ థొరాటే చేతులు మీదుగా అందుకున్నారు. 2007లో అటా వేడుకల పురస్కారాన్ని మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. 2007 లో నెల్లూరు జిల్లా కలెక్టర్ ద్వారా ప్రశంసా పత్రాన్ని పొందారు. |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | జీవ దృశ్యాలు … ! |
సంగ్రహ నమూనా రచన | నాగరికతతెల్సినవాణ్నికనుక నడిచే వెళ్తుంటాను … |
రామకృష్ణ పెరుగు
నాగరికత తెల్సినవాణ్ని కనుక
నడిచే వెళ్తుంటాను …
ద్వేషంమీదనిర్మలత్వపుజెండానాటి
మనిషినిప్రేమించేదేవుడికినమస్కరించికదులుతుంటాను
విశ్వమానవనైతికబలాన్నివమనిప్రార్దిస్తూవుంటాను
సామ్రాజ్యవాదరాక్షసత్వానికిరాజకీయంతోముడిపడ్డాక
ఆధిపత్యపుయుద్దాలకోసంమనుష్యదేశాలన్నీకలసి
ఇనుపపాదాలకిందదరిద్రనారాయణుల్ని
నలియాలనేవ్యూహంతోవున్నపుడు
శవ సమూహాల మధ్య పడుతూ లేస్తూ నడుస్తుంటాను ..
కలతనిద్ర నుంచికన్నునుపెగలించి
కడగడానికిపరిశుద్దజలంకోసంవెతుక్కుంటూవుంటాను
గాయపడినబతుకులు
దగాపడిపోయినజీవితాలుఎదురైనప్పుడు
మట్టిమనుషులచరిత్రకుండలుపగిలిపోయాక
మనిషిస్వేదంతోనిండినవోయాస్సిసులముందునిల్చుని
వెన్నెముకవిరిగినవీరుడినై
ఈదుర్మార్గవ్యవస్థచుట్టూకాస్తంతప్రేమవిత్తనాలుచల్లుతాను
యోధులకుమరణంలేదని
రాజకీయప్రపంచపుగోడమీదనినాదమై
శిధిలాలనుంచేపునర్నిర్మానాన్నికలగంటాను
నాగరికతతెల్సినవాణ్ణికనుకనే
తరతరాలమానసికసంఘర్షణల్నిఅక్షరంచేసుకుని
నామానవజాతినిరక్షించమని
మరోకొత్తప్రవక్తనుఆహ్వానించడానికి
మానవ సుగంధపు వృక్షాన్ని కన్నీళ్ళతో బతికించు కుంటాను ..
పాడైపోయినప్రపంచాన్ని
ఇకనడిచిమార్చలేననితెలిసాక
ఈ ఆకృత్య ,అరాచక, అమానవీయ రాజకీయమే లేని నేలని
రహస్యంగా అన్వేషిస్తుంటాను ..
నాకుకలంపట్టడం
పిడికిలిబిగించడంతప్ప
పేదలపొట్టకొట్టడంనేర్పనేలేదుమాఅమ్మ
మనిషికోసంపిడికిలిబిగించి
బతికినంతకాలంఈవ్యవస్థమీదపోరాడుతూనేవుంటాను
నాగరికతతెల్సినవాణ్నికనుకనే
నటించడం చేతకాక ..
చైతన్యపుజెండానికాలంచేతికిచ్చి
మనిషినినిర్భయంగానడవమంటాను
పోరాడమంటాను …
దారితప్పినఈదౌర్భాగ్యపువ్యవస్థమీద
గెలుపుతీరంచేరేదాకా
వరుస బాణాలు వదులుతూనే వుంటాను …!!
-పెరుగు రామకృష్ణ
———–