పేరు (ఆంగ్లం) | Jayaprabha |
పేరు (తెలుగు) | జయప్రభ |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 1957, జూలై 29 |
మరణం | – |
పుట్టిన ఊరు | మహారాష్ట్ర |
విద్యార్హతలు | ఎం.ఏ.పి.హెచ్.డి. |
వృత్తి | స్త్రీవాద కవయిత్రి, కథా రచయిత్రి |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | https://www.lyrikline.org/en/poems/12276 |
స్వీయ రచనలు | ది పబ్ ఆఫ్ వైజాగపట్నం యశోధరా వగపెందుకే చింతల నెమలి యుద్ధోన్ముఖంగా… క్షణ క్షణ ప్రయాణం ఇక్కడ కురిసిన వర్షం ఎక్కడి మేఘానిది? భావకవిత్వంలో స్త్రీ వలపారగించవమ్మ వనిత నీ-యలుక చిత్తమున కాకలివేసినది వామనుడి మూడోపాదం నాలుగో గోడ |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | https://www.amazon.in/Books-A-Jayaprabha/s?rh=n%3A976389031%2Cp_27%3AA.+Jayaprabha |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | ప్రకృతి పర్యంతమూ |
సంగ్రహ నమూనా రచన | ఆకులన్నీ రాలాకా వచ్చే తొలి చిగురు నీ ఉద్రేకం లాంటిది ! ముద్దు తర్వాత చర్మం మీద కమిలిన ముద్ర లాగానే మెత్తగా ఎర్రబడుతుంది ! … |
జయప్రభ
ఆకులన్నీ రాలాకా వచ్చే తొలి చిగురు
నీ ఉద్రేకం లాంటిది !
ముద్దు తర్వాత
చర్మం మీద కమిలిన ముద్ర లాగానే
మెత్తగా ఎర్రబడుతుంది !
నిన్ను గుర్తు చేస్తూ
సీమచింత చెట్టు మీద పంచవన్నె పక్షులు
వసంతాన్ని తెస్తాయి !
నాలో పాత జ్ఞాపకాలు
నారింజవాసనలతో వీస్తాయి !!
నీరెండ పడిన తడి ఆకుల్లో
నీ నవ్వు తళతళలను చూసి ఎగిసి
కాసిన్ని కిరణాలను వడిసి పడతాను !
ఉన్మత్తంగా చల్లగాలి వెంట పరుగు పెడతాను
స్వర్ణసముద్రంలోకి
సూర్యుడినావ మీద బయలుదేరి
ద్వీప ద్వీపాల నించి
స్వప్న సుగంధాలెన్నో సేకరిస్తాను !
ఏదీ ?
ఎంత వెతికినా ఎన్ని ఉదయాలు గడిచినా
నువ్వెక్కడా కనిపించవేం ?
అనేక మలుపులతో
జానపదగాధకు మల్లే
నా ముందుకొస్తావు కాబోలు !
సంచారజీవనం లాంటి నీ సాహచర్యంలో
నాకు స్థిమితమూ ఉండదు
స్థిరత్వమూ ఉండదు
అయినా సరే !
మృదువుగా ఒకసారి
మహోధృతంగా ఒకసారి
నేను జీవనదిగా కొనసాగుతాను !
ప్రకృతి పర్యంతమూ…
నీ జాడ కోసం !
———–