| పేరు (ఆంగ్లం) | Rajitha Anisetti | 
| పేరు (తెలుగు) | అనిసెట్టి రజిత | 
| కలం పేరు | – | 
| తల్లిపేరు | – | 
| తండ్రి పేరు | – | 
| జీవిత భాగస్వామి పేరు | – | 
| పుట్టినతేదీ | 04/15/1958 | 
| మరణం | 2025-08-12 | 
| పుట్టిన ఊరు | వరంగల్లు | 
| విద్యార్హతలు | – | 
| వృత్తి | రచయిత్రి | 
| తెలిసిన ఇతర భాషలు | – | 
| చిరునామా | – | 
| ఈ-మెయిల్ | – | 
| ఫోను | – | 
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – | 
| స్వీయ రచనలు | గులాబీలు జ్వలిస్తున్నాయి (కవిత్వం 1994) నేనొక నల్లమబ్బునవుతా (కవిత్వం 1997) చెమటచెట్టు (కవిత్వం 1999) ఓ లచ్చవ్వ (దీర్ఘకవిత 2005) ఉసురు (కవిత్వం 2002) గోరంతదీపాలు (నానీలు 2005) దస్తఖత్ (హైకూలు2005) అనగనగా కాలం (కవిత్వం 2005) మట్టిబంధం (కథా సంపుటి 2006) నన్హే ఓ నన్హే మార్కెట్ స్మార్ట్ శ్రీమతి | 
| ఇతర రచనలు | – | 
| ఈ-పుస్తకాల వివరాలు | https://www.logili.com/home/search?q=Anisetty%20Rajitha, https://kinige.com/tag/Anisetti+Rajitha, https://www.telugubooks.in/collections/telugubooks-new-releases/anisetty-rajitha | 
| పొందిన బిరుదులు / అవార్డులు | 1984 :జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ ట్రస్ట్, న్యూఢిల్లీ వారి అవార్డు వరంగల్ జిల్లా ఆల్ఫ్రెండ్స్ అసోసియేషన్ – పంచరత్న సాహిత్య అవార్డు 2001: డాక్టర్ మలయశ్రీ ప్రగతిశీల సాహిత్య పురస్కారం 2001: భారతీయ దళిత సాహిత్య అకాడమీ వారి వీరాంగన సావిత్రీబాయి పూలే ఫెలోషిప్ అవార్డు 2003: జైమినీ అకాడమీ, ఉత్తర్ ప్రదేశ్ వారి ఆధ్వర్యంలో సుభద్ర కుమారి చౌహాన్ సమాన్న్ పురస్కార్ 2005: హైదరాబాద్లోని యువకళా వాహిని వారిచే గురుప్రసాద్ సాహిత్య ఎక్స్లెన్సీ పురస్కారం 2005: సుశీలా నారాయణరెడ్డి కవిత్వ గ్రంథ రచన పురస్కారం 2006: ఎస్ఆర్ఎల్జి కళా సమితీ, రాజోలు, తూర్పుగోదావరి జిల్లా వారి బోయి భీమన్న పురస్కారం 2015: తేజా సాహిత్య పురస్కారం, హోమంత్రి నాయిని నర్సింహారెడ్డి చేతుల మీదుగా 2015: తెలుగు విశ్వవిద్యాలయం వారి ప్రతిభా పురస్కారం 2016: తెలంగాణ రచయితల వేదిక వారి అలిశెట్టి ప్రభాకర్ పురస్కారం | 
| ఇతర వివరాలు | – | 
| స్ఫూర్తి | – | 
| నమూనా రచన శీర్షిక | జిగర్ | 
| సంగ్రహ నమూనా రచన | జిగర్ తెలంగాణ విశిష్ట కవిత్వ సంకలనం దశాబ్ద కాలంగా తెలంగాణ అస్తిత్వ కాంక్షతో వచ్చిన కవితల సంకలనం. | 
అనిసెట్టి రజిత
జిగర్ 
తెలంగాణ విశిష్ట కవిత్వ సంకలనం 
దశాబ్ద కాలంగా తెలంగాణ అస్తిత్వ కాంక్షతో వచ్చిన కవితల సంకలనం. 
‘‘గతంలోంచి వర్తమానానికి
ప్రయాణించే వాడే అమరుడు
అమరుని ధీరత్వాన్ని
జనం మెచ్చుకోవడమే
అతని మహోన్నత జ్ఞాపకం
వీళ్లు అమరులనడానికి
పండగలైన పల్లెలే ప్రభల సాక్షం
…..
కాలం మారినా జీవితాలు వాడినా
బతుకులు దుర్భరంగా శుష్కించినా
మీ ఆత్మార్పణని కథలుగా, గాథలుగా
చెప్పుకుంటూనే ఉంటారు
మీ అమరత్వాన్ని పీరీల జెండాలుగా
ఎగిరేస్తూనే ఉంటారు” అని
———–
 
					 
																								 
																								