పేరు (ఆంగ్లం) | Yarlagadda Lakshmi Prasad |
పేరు (తెలుగు) | యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 11/24/1953 |
మరణం | – |
పుట్టిన ఊరు | కృష్ణా జిల్లా |
విద్యార్హతలు | పి.హెచ్.డి. |
వృత్తి | హిందీ ఆచార్యుడు |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | ద్రౌపది,పాకిస్తాన్లో పది రోజులు,కథనాల వెనుక కథలు,సత్యభామ |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | https://www.amazon.in/Books-Yarlagadda-Lakshmi-Prasad/s? |
పొందిన బిరుదులు / అవార్డులు | పద్మశ్రీ – 2003. కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారము – 1992. తానా Human Exellency Award – 2008 జాతీయ హిందీ అకాడెమి – విశిష్ట హిందీ సేవా సమ్మాన్ – 2009. అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ హిందీ అకాడమీ అధ్యక్షుడు,లోక్ నాయక్ ఫౌండేషన్ కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతి – ద్రౌపది నవల – 2009. గురజాడ విశిష్ట పురస్కారం – 2015. పద్మభూషణ్ – 2016 జనవరి. |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | ద్రౌపది |
సంగ్రహ నమూనా రచన | 1972 ఆంధ్రోద్యమంలోనూ, 1975 అత్యవసర పరిస్థితి కాలంలోనూ విద్యార్థి నాయకుడుగా అంతరంగిక భద్రతా చట్టం కింద నిర్బంధానికి గురైన డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మూడు దశాబ్దాలుగా విద్యార్థుల విశేష ఆదరాభిమానాలను చూరగొన్న అధ్యాపకుడు. |
యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
1972 ఆంధ్రోద్యమంలోనూ, 1975 అత్యవసర పరిస్థితి కాలంలోనూ విద్యార్థి నాయకుడుగా అంతరంగిక భద్రతా చట్టం కింద నిర్బంధానికి గురైన డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మూడు దశాబ్దాలుగా విద్యార్థుల విశేష ఆదరాభిమానాలను చూరగొన్న అధ్యాపకుడు.
★ హిందీ, తెలుగు భాషలు రెండింటిలోనూ డాక్టరేట్లు పొందిన నిత్య పరిశోధకుడు. మూడు పదులకి పైగా ప్రసిద్ధ గ్రంథాలను రచించి పిన్న వయసులోనే కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కారాన్ని పొందిన రచయిత.
★ అమెరికా, బ్రిటన్, జపాన్, హాంకాంగ్, బెల్జియం, మారిషస్, మలేషియా, థాయ్లాండ్, కెనడ, స్పెయిన్, రష్యా, ఉక్రెయిన్, ఈజిప్ట్, అరబ్, ఎమిరేట్స్ మొదలైన దేశాల్లో పర్యటించి వందలాది సమావేశాల్లో సభారంజకంగా ప్రసంగించి విద్వజ్జనుల మన్ననలందుకున్న వక్త.
★ రాజ్యసభ సభ్యునిగా ఉన్నా, రచనా వ్యాసంగం మాననివాడు. రాజ్యసభ పదవీ విరమణ అనంతరం కూడ అధ్యాపక వృత్తిని ఎంచుకున్న బోధనారంగ ప్రేమికుడు.
★ పార్లమెంటరీ అధికార భాషా సంఘ ఉపాధ్యక్షుడుగా, కేంద్రీయ హిందీ సమితి సభ్యుడుగా, ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీ ఛైర్మన్గా , విశ్వహిందీ సదస్సు నిర్వాహకుడుగా, హిందీ భాష అమలుకు కంకణం కట్టుకుని హిందీ ప్రాంతీయులకు అబ్బురపాటు కలిగించిన జాతీయవాది.
★ తెలుగుకు ప్రాచీన భాష హోదా కోసం కృషి చేసేందుకు ప్రభుత్వం నియమించిన టాస్క్ఫోర్స్ సభ్యుడుగా, ప్రథమ, ద్వితీయ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల నిర్వాహక సంఘ అధ్యక్షుడుగా, పలువురు ప్రసిద్ధుల రచనలు తెలుగులో అనువదించిన రచయితగా తెలుగు భాషను ప్రేమించే తెలుగు బిడ్డ.
https://kinige.com/book/Draupadi
———–