పాపినేని శివశంకర్ (Papineni Shiva Shankar)

Share
పేరు (ఆంగ్లం)Papineni Shiva Shankar
పేరు (తెలుగు)పాపినేని శివశంకర్
కలం పేరు
తల్లిపేరుశాంతమ్మ
తండ్రి పేరుపాపినేని వెంకటకృష్ణారావు
జీవిత భాగస్వామి పేరుగృహలక్ష్మి
పుట్టినతేదీ11/06/1953
మరణం
పుట్టిన ఊరుతుళ్ళూరు
విద్యార్హతలు
వృత్తితెలుగు అధ్యాపకులు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుస్తబ్దత – చలనం (1984)
ఒక సారాంశం కోసం (1990)
ఆకుపచ్చని లోకంలో (1998)
ఒక ఖడ్గం – ఒక పుష్పం (2004)
రజనీగంధ (2013)
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు

https://www.logili.com/home/search?q=Dr%20Papineni%20Sivasankar,

http://www.anandbooks.com/Papineni-Siva-Shankar-Kathalu-Telugu-Book-By-Papineni-Siva-Shankar

పొందిన బిరుదులు / అవార్డులుఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు, హైదరాబాదు – 1985
డా. గరికపాటి కవితా పురస్కారం, రాజమండ్రి- 1991
జ్యేష్ట సాహితీ అవార్డు, విశాఖపట్నం – 1993
ఉమ్మిడిశెట్టి సాహితీ అవార్డు, తాడిపత్రి – 1993
డా. సి.నా.రె.కవితాపురస్కారం, కరీంనగర్ – 2000
తెలుగు విశ్వవిద్యాలయం వచనకవిత్వ పురస్కారం – 2000
నూతలపాటి సాహితీపురస్కారం – 2000
నాగభైరవ కళాపీఠం అవార్డు, ఒంగోలు – 2002
ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం పురస్కారం, తిరుపతి – 2003
రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డు, హైదరాబాదు – 2003
విశాలాంధ్ర- సుంకర సాహితీ సత్కారం, ఒంగోలు – 2006
విశ్వకళా పీఠం స్నేహనిధి పురస్కారం, హైదరాబాదు – 2006
డా. కేతు విశ్వనాథరెడ్డి కథా పురస్కారం, నందలూరు – 2008
డా. ఆవంత్స సోమసుందర్ కవితా పురస్కారం, పిఠాపురం – 2010
ఆంధ్ర నాటక కళా పరిషత్ పురస్కారం, బెజవాడ – 2012
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికపాపినేని శివశంకర్
సంగ్రహ నమూనా రచనపాపినేని శివశంకర్ పుట్టింది నెక్కల్లు. చదివింది గుంటూరు. ఉద్యోగం చేసింది తెలుగు అధ్యాపకుడుగా, ప్రధానాచార్యుడుగా తాడికొండ కళాశాలలో. ఊపిరి పీల్చేది సాహిత్యంలో. వెలువరించింది స్తబ్ధత చలనం, సారాంశం కోసం, ఆకుపచ్చని లోకంలో, ఒక ఖడ్గం ఒక పుష్పం కవితా సంపుటులు, సాహిత్యం మౌలిక భావనలు, నిశాంత విమర్శగ్రంథాలు, తల్లీ! నిన్ను దలంచి ప్రాచీన కవిత్వ విశ్లేషణ. ప్రపంచాన్ని దర్శించేది బహుళ తాత్విక దృక్పథంతో.

పాపినేని శివశంకర్

పాపినేని శివశంకర్ పుట్టింది నెక్కల్లు. చదివింది గుంటూరు. ఉద్యోగం చేసింది తెలుగు అధ్యాపకుడుగా, ప్రధానాచార్యుడుగా తాడికొండ కళాశాలలో. ఊపిరి పీల్చేది సాహిత్యంలో. వెలువరించింది స్తబ్ధత చలనం, సారాంశం కోసం, ఆకుపచ్చని లోకంలో, ఒక ఖడ్గం ఒక పుష్పం కవితా సంపుటులు, సాహిత్యం మౌలిక భావనలు, నిశాంత విమర్శగ్రంథాలు, తల్లీ! నిన్ను దలంచి ప్రాచీన కవిత్వ విశ్లేషణ. ప్రపంచాన్ని దర్శించేది బహుళ తాత్విక దృక్పథంతో.

మనుషులంతా ఒక్కటేనా

ఎవరి రంగు రుచి వాసన వారివే గదా

ఎవరి ఊహల తీపి, కన్నీటి ఉప్పన వారివే గదా

పెద్దల ఆకాంక్షలన్నీ పిల్లలు తీర్చగలరా

ఎవరూ మరొకరి ఆశయాన్ని అనువదించలేరు.

– ధిక్కరించకపోతే దిక్కులు దద్దరిల్లేటట్టు పొలికేక పెట్టకపోతే అది కవిత్వమెట్లా అవుతుంది?

– ఎప్పుడూ ఏదీ పోగొట్టుకోనివాడి కోసం కనీసం ఎప్పుడైనా ఏదన్నా దొరికినవాడి కోసం వెతుకుతున్నా.

– పెద్దగా నేర్పిందేమీ లేదు పలకమీద ‘దయ’ అనే రెండక్షరాలు రాసి దిద్దించాను.

– జీవితం ఒక అద్భుత పుష్పం వికసించే ప్రక్రియ.

– ఈ సగం చెవిటి ప్రపంచంలో ఎవడు ఎక్కువమందిని తనివిదీరా పిలవగలడో పిలిపించుకోగలడో వాడికి నా వందనాలు.

– ప్రతి మనిషీ బతుకంతా కోర్కెల బరువులతో ఒక కొండనెక్కుతూనే ఉన్నాడు.

– స్త్రీలు భూదేవతలు సూర్యచంద్రులు రెండు స్తనాలైనవాళ్ళు.              



———–

You may also like...