Share
పేరు (ఆంగ్లం)K.B.Lakshmi
పేరు (తెలుగు)కె.బి.లక్ష్మి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ08/15/1953
మరణం7/29/2019
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తిఅధ్యక్షురాలు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు“మనసున మనసై”, “జూకామల్లి”,”వీక్షణం”, “గమనం”
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలుhttps://www.logili.com/short-stories/k-b-lakshmi/p-7488847-48993226148-cat.html
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికమనసున మనసై
సంగ్రహ నమూనా రచనఆధునిక నాగరికతను, మధ్యతరగతి జీవన విధానాన్ని ఆకళించుకున్న కె.బి.లక్ష్మీ గారు సామజిక స్పృహతో అప్పుడప్పుడు రాసిన కథలను కె.బి.లక్ష్మీ కథలు పేరుతో సంపుటిగా రూపొందించి పాఠకులకు అందిస్తున్నారు. వివిధ పత్రికల్లో వెలువడిన ఈ కథలు ఇదివరకే అశేష పాఠకాధరణ పొంది ప్రజల్లో ఆలోచనలను రేకెత్తించాయి.

కె.బి.లక్ష్మి

 ఆధునిక నాగరికతను, మధ్యతరగతి జీవన విధానాన్ని ఆకళించుకున్న కె.బి.లక్ష్మీ గారు సామజిక స్పృహతో అప్పుడప్పుడు రాసిన కథలను  కె.బి.లక్ష్మీ కథలు పేరుతో సంపుటిగా రూపొందించి పాఠకులకు అందిస్తున్నారు. వివిధ పత్రికల్లో వెలువడిన ఈ కథలు ఇదివరకే అశేష పాఠకాధరణ పొంది ప్రజల్లో ఆలోచనలను రేకెత్తించాయి.

       ఈ కథల్లోని 23 కథలు మధ్యతరగతి మందహాసాలను తెలియజేసేవిగా ఉన్నాయి. నగరజీవనం భారమైపోతున్న ఈ రోజుల్లో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేయాల్సిన తప్పనిసరి పరిస్థితులు ఏర్పడ్డాయి. స్నేహితులు, ప్రేమికులు, భార్యాభర్తలు కలిసి కాసేపు ఆహ్లాదంగా, ఆనందంగా గడిపే వాతావరణం నేడు పట్టణాలలో కనిపించడం లేదు. పార్కుల్లోనూ, ఇంట్లోనూ ప్రైవసీ కోల్పోతున్న నగరజీవుల ఆవేదన ఈ ‘మనసున మనసై’ పుస్తకం. మనోభావనాసుడిగుండంలోంచి సగటు మనిషిని దర్శించి ఎగుడుదిగుడు పరిస్తితుల్లో కూడా మానవతను పండించారు.

       ఈ కథలో మధ్య వయస్కులైన స్త్రీ పురుషుల మధ్య ఉండే సంబంధాలు, భార్యాభర్తలు ప్రతి విషయాన్ని చర్చించుకుని అవగాహనతో మేలగాలనే సందేశం, నేటి యువతలో వస్తున్న స్వతంత్ర భావాలూ, తరాల అంతరాలు, అధికారం, అహంకారం, ధనబలంతో వ్యసనమైన భర్తను, తన సహనం, మంచితనంతో తనదారిలోకి తెచ్చుకుని అతనిలోని మృగత్వాన్ని పారదోలి, తన సంసారంలో మల్లెలు విరబూయించుకోవాలన్న మహిళ తపస్సు, జీవితాంతం కష్టసుఖాల్లో పాలు పంచుకొని భరించాల్సిన భర్తే  భార్యజీవితంలో చలగాటమాడితే, అలాంటి నరరూప రాక్షసుడి నీడ పడనీయకుండా కూతుర్ని సంస్కారవంతురాలిగా, ఉన్నత విద్యావంతురాలిగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా తన ఔన్నత్యాన్ని నిలుపుకున్న ఆదర్శమహిళ, టీ.వీ మాయాజాలంలో మరుగుతున్న మానవ సంబంధాలు, సంపద కంటే వ్యక్తిత్వానికీ, స్వతంత్ర మనోభావలకూ విలువనివ్వాలనుకునే నేటి యువతలోని వ్యక్తిత్వవికాసం, తల్లిదండ్రులను, మాతృదేశాన్ని, మమతానురాగాలను మరచిపోతున్న నేటి యువతలో పేరుకుపోతున్న పాశ్చాత్య వ్యామోహం, వారి తల్లిదండ్రుల మానసికావేదనలు, స్త్రీ వ్యామోహం కారణంగా ఆహ్లాదంగా సాగే వైవాహిక జీవితం విచ్చిన్నం కావడం లాంటి ఇతివ్రుత్తాలెన్నో ఈ పుస్తకంలో కనిపిస్తాయి.

                                                                                                            – ఆచార్య ఎన్.గోపి  

https://www.logili.com/short-stories/k-b-lakshmi/p-7488847-48993226148-cat.html

———–

You may also like...