పేరు (ఆంగ్లం) | S.V Satyanarayana |
పేరు (తెలుగు) | ఎస్.వి సత్యనారాయణ |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 1954 ఆగస్టు 16 |
మరణం | – |
పుట్టిన ఊరు | పాత బస్తీ, హైదరాబాదు |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | సరిగమ పదనిసలు |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | సరిగమ పదనిసలు |
సంగ్రహ నమూనా రచన | సంగీతానికీ, జీవితానికీ చాలా సారూప్యతలున్నాయి. సంగీతంలోని ప్రతిరాగమూ విశిష్టమైనది, విలక్షణమైనది. జీవితంలోని ప్రతి అనుభవమూ విశిష్టమైనదే. మానవుడి ఒక్కో అనుభూతినీ ఉద్వేగాన్నీ ఒక్కోరాగం ప్రతిధ్వనిస్తుంది. అలాగే జీవిత ప్రస్తానంలోని ఒక్కో సంఘటన, ఒక్కో మేలిమలుపు ఒక వినూత్న రాగంతో సమానమైనది. ప్రేమ, విరహం, నిరాశ, సరసం మొదలైన భావాల సమాహారంగా ‘సరిగమలు’ రూపొందాయి. జీవితంలో ఇవి కూడా ఉంటాయి. అయితే ఇదే జీవితంకాదు. కుటుంబం, సమాజం, దేశం, ఉద్యోగం, ప్రపంచం కూడా జీవితంలో అంతర్భాగమే. |
ఎస్.వి సత్యనారాయణ
సంగీతానికీ, జీవితానికీ చాలా సారూప్యతలున్నాయి. సంగీతంలోని ప్రతిరాగమూ విశిష్టమైనది, విలక్షణమైనది. జీవితంలోని ప్రతి అనుభవమూ విశిష్టమైనదే. మానవుడి ఒక్కో అనుభూతినీ ఉద్వేగాన్నీ ఒక్కోరాగం ప్రతిధ్వనిస్తుంది. అలాగే జీవిత ప్రస్తానంలోని ఒక్కో సంఘటన, ఒక్కో మేలిమలుపు ఒక వినూత్న రాగంతో సమానమైనది. ప్రేమ, విరహం, నిరాశ, సరసం మొదలైన భావాల సమాహారంగా ‘సరిగమలు’ రూపొందాయి. జీవితంలో ఇవి కూడా ఉంటాయి. అయితే ఇదే జీవితంకాదు. కుటుంబం, సమాజం, దేశం, ఉద్యోగం, ప్రపంచం కూడా జీవితంలో అంతర్భాగమే.
వీటి ప్రభావాలూ కవిపై ఉంటాయి. ప్రేరణలూ ఉంటాయి. విద్యార్థులకు, సాహితీ మిత్రులకు నేనిచ్చే నిరంతర సందేశం: జీవితం పై ప్రేమ, భవిష్యత్తు పట్ల విశ్వాసం, కుటుంబంపై గౌరవం, సమాజం పట్ల బాధ్యత, దేశంపై భక్తీ, ప్రపంచం పట్ల అవగాహన మన జీవన నాదాలు కావాలి. ఈ సంపుటిలోని ప్రధాన శీర్షికలు – లలిత గీతాలు, విరహ తాపాలు, నైరాశ్య భావాలు, జానపద బాణీలు – ఇంకా ఉపశీర్షికలెన్నో! ప్రాచీన కవి, రొమాంటిక్ యుగంనాటి భావకవి, జానపదకవి, అభ్యుదయకవి – అందరి ఆదర్శాలను ఈ యువకవి అనుసరించటానికి ప్రయత్నించినాడు – అయినా తన వ్యక్తిత్వాన్ని ఎదో ఒక రూపంలో దర్శింపజేయాలని తహతహ. అది ముక్తకాల్లో తొంగిచూస్తున్నది. ప్రణయం – అనురాగం – వియోగం – మొదలగు భావాల ధోరణి ఒకవైపు, సోదరీ సోదర స్నేహమార్గం ఇంకొకవైపు.
———–