పేరు (ఆంగ్లం) | Balantrapu Rajanikanta Rao |
పేరు (తెలుగు) | బాలాంత్రపు రజనీకాంతరావు |
కలం పేరు | – |
తల్లిపేరు | వెంకటరమణమ్మ |
తండ్రి పేరు | కవిరాజహంస బాలాంత్రపు వేంకటరావు |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 01/29/1920 |
మరణం | 04/22/2018 |
పుట్టిన ఊరు | నిడదవోలు |
విద్యార్హతలు | ఎం.ఏ. తెలుగు |
వృత్తి | కవి, పండితుడు, సాహితీ వేత్త |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | పత్ర సుందరి గీత సంపుటి. 200పైగా గీతాలున్నాయి. (దీనికి 1953లో తెలుగు భాషా సమితి పురస్కారం లభించింది) విశ్వవీణ రేడియో నాటకాల సంకలనం. 1964లో ప్రచురణ ఆంధ్ర వాగ్గేయకారుల చరిత్ర ఉత్తమ పరిశోధనా గ్రంథం. (దీనికి 1958లో తెలుగు భాషా సమితి పోటీ బహుమతి లభించింది)క్షేత్రయ్య, రామదాసు జీవిత చరిత్రలు (కేంద్ర సాహిత్య అకాడమీవారికి) ‘రజనీ భావతరంగాలు’ – ఆంధ్రప్రభలో శీర్షిక క్షేత్రయ్య పదాలు, గాంధారగ్రామ రాగాలు, గీతగోవిందం, భారతీయ సంగీతంలో ప్రాచీన రాగాలు మొదలైనవాటి మీద పరిశోధనావ్యాసాలు. (మద్రాసు మ్యూజిక్ అకాడమీలో) జేజిమామయ్య పాటలు మువ్వగోపాల పదావళి త్యాగరాజు, శ్యామశాస్త్రి జీవితచరిత్రలు ఏటికి ఎదురీత (కవితలు) చతుర్భాణీ (4 సంస్కృత నాటకాలకి తెలుగు అనువాదం) ఆన్నమాచార్య కీర్తనలకి ఆంగ్లానువాదం |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | రజని భావతరంగాలు |
సంగ్రహ నమూనా రచన | ఆధునిక వాగ్గేయ కారుని ఏడు దశాబ్దాల జ్ఞాపకాల పందిరి. సినిమా, రేడియో రంగాలపై మనసు పులకించే ముచ్చట్లు… |
బాలాంత్రపు రజనీకాంతరావు
బాలాంత్రపు రజనీకాంతరావు (1920 జనవరి 29 – 2018 ఏప్రిల్ 22) బహుముఖ ప్రఙ్ఞాశాలి. వాగ్గేయకారుడు, రచయిత, స్వరకర్త. తొలితరం సంగీత దర్శకుల్లో ఒకడు. ఆకాశవాణి కేంద్రంలో స్వరకర్తగా, గీత రచయితగా, సంచాలకునిగా పలు బాధ్యతలు నిర్వర్తించి రేడియో శ్రోతలను అలరించాడు. ఆకాశవాణిని జనరంజకం చేసిన పలువురు కళాకారుల్లో రజనీకాంతరావు ముఖ్యుడు. లలిత సంగీతాన్ని అభివృద్ధి చేసి జనరంజకం చేసి, లలిత సంగీతానికి ఆద్యుల్లో ఒకడిగా పేరొందాడు.
———–