డి.దేవదానం రాజు (D.Devadanam Raju)

Share
పేరు (ఆంగ్లం)D.Devadanam Raju
పేరు (తెలుగు)డి.దేవదానం రాజు
కలం పేరు
తల్లిపేరుసూర్యనారాయణమ్మ
తండ్రి పేరువెంకటపతిరాజు
జీవిత భాగస్వామి పేరుఉదయభాస్కరమ్మ
పుట్టినతేదీ20/03/1954
మరణం
పుట్టిన ఊరుతూర్పుగోదావరి జిల్లా లోని కోలంక
విద్యార్హతలుఎం.ఎ.,ఎంఇ.డి
వృత్తిరచయిత , అభ్యుదయవాది
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకెhttp://datlaraju.blogspot.com/
స్వీయ రచనలువానరాని కాలం (1997) కవితా సంపుటి
గుండె తెరచాప (1999) కవితా సంపుటి
మట్టికాళ్ళు (2002) కవితా సంపుటి
దాట్ల దేవదానం రాజు కధలు(2002) కధా సంపుటి
ముద్రబల్ల (2004) దీర్ఘకవిత
లోపలి దీపం (2005) కవితా సంపుటి
సరదాగా కాసేపు (2006) రాజకీయ వ్యంగ్య కధనాలు
యానాం చరిత్ర (2007)
నదిచుట్టూ నేను (2007) కవితా సంపుటి
నాలుగో పాదం (2010) దీర్ఘ కవిత
నాన్ గామ్ పాదమ్ (2010) (తమిళ అనువాదం)
కవితా సంపుటి- యానాం కథలు (2012)
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులువానరాని కాలం – ‘సరసం అవార్డు’ 1997
‘జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు; 1999
‘రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు’ 2000
‘మట్టికాళ్ళు-ఆంధ్ర సారస్వత సమితి అవార్డు’ 2003
‘కళైమామణి’అవార్డు (పుదుచ్చేరి ప్రభుత్వం) 2003
‘రీజెన్సీ కళావాణి పురస్కారం’2004
‘ఉగాది ఉత్తమ కవి పురస్కారం’ YOHVO (2008)
‘తెలుగు రత్న’ అవార్డు (పుదుచ్చేరి ప్రభుత్వం) 2009
సర్ ఆర్థర్ కాటన్ జలనిధి పుర్స్కారం (2010)
కొ.కు సాహిత్య మనిహార్ పురస్కరం (2013)
రాష్ట్రస్థాయి ఉత్తమ కథా పురస్కారం (2013, గుంటూరు జిల్లా రచయితల సంఘం.
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షిక
సంగ్రహ నమూనా రచన

దాట్ల దేవదానం రాజు

దాట్ల దేవదానం రాజు ప్రముఖ కథకుడు, ఉత్తమ ఉపాధ్యాయుడు, ఆదర్శ-అభ్యుదయవాది. ఈయన అనేక కథలు, కవితా సంపుటాలు వ్రాసారు. ఈ కథా, కవితా సంపుటాలే కాకుండా ‘యానాం చరిత్ర’ వంటి గ్రంథాలను వెలువరించారు. శిల్పంలోని మెళకువల్ని ఆకళింపుచేసుకుని, వస్తువును హృద్యమైన కథగా మలచడంలో ప్రత్యేక శైలిని స్వంతం చేసుకున్నారు. కుందుర్తి ఆంజనేయులు గారి శతజయంతి సందర్భంగా ఫ్రీవెర్స్ ఫ్రంట్ పురస్కారాన్ని 2022లో అందుకున్నారు.

చిన్నతనంలో వారి ఇంటికి గురుతుల్యులైన వ్యక్తి వచ్చి వివిధ కథలను వినిపిస్తూ ఉండేవారు. అప్పటినుండి ఆయనకు కథల పట్ల ఆసక్తి పెరిగింది. తర్వాత పదవ తరగతిలో “టామ్‌ సాయర్”, “హకిల్ బెరిఫిన్” వంటి కథలను చదివేవారు. యానాం కాలేజీ లోని తెలుగు అధ్యాపకులు శ్రీమతి కందర్ప వెంకటలక్ష్మీ నరసమ్మ గారి ప్రోత్సాహంతో చిన్న చిన్న కథలను వ్రాయడం మొదలుపెట్టారు. ఆయన మొదటి కథ “పేకాట బాగోతం” ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురించారు. పిల్లల చదువుల నిమిత్తం ఆయన కోలంక నుండి యానాంకు మకాం మార్చారు. అచట శిఖామణితో పరిచయం ఆయనను కవిని చేసింది. అచట నెలనెలా జరిగే మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి స్మారక సభల్లో కవి సమ్మేళనం జరిగేది. దాని కోసం ప్రతినెలా ఒక కవిత వ్రాసేవారు. ఆ కవితలకు పత్రికలు ప్రోత్సాహమివ్వడంతో ఆయన పూర్తిస్థాయి కవిగా మారిపోయారు.2002 లో “దాట్ల దేవదానం రాజు కథలు” ప్రచురించారు. 2006 లో “సరదాగా కాసేపు” అనే రాజకీయ వ్యంగ్య కథను ప్రచురించారు.

రచయిత్రి రంగనాయకమ్మ గారి “రామాయణ విషవృక్షం” చదివాక ఆయన ఆలోచనా దృక్పథంలో మార్పువచ్చింది. హేతువాద దృష్టి, ప్రశ్నించే తత్వం, సమాజ పరిణామాన్ని పరిశీలించడం అలవాటయ్యాయి.

2012 నవంబరు 10 తేదీన”కథాయానాం” పేరిట 100 మంది కథకుల్ని యానాం ఆహ్వానించి ఏ.సి. బోట్లో వర్థమాన కథ గురించి చర్చాగోష్ఠి నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుండి లబ్దప్రతిష్తులైన కథకులు హాజరయ్యరు.ఈ సంవత్సరం నుండి ప్రతి ఏటా ఒక కవినీ,ఒక కథకుడ్ని దాట్ల దేవదానం రాజు పేరిట 10వేలు తో సత్కరిస్తున్నారు.

———–

You may also like...