ఎస్. అదృష్ట దీపక్ (S.Adrusta Deepak)

Share
పేరు (ఆంగ్లం)S.Adrusta Deepak
పేరు (తెలుగు)ఎస్. అదృష్ట దీపక్
కలం పేరు
తల్లిపేరుసత్తి సూరమ్మ
తండ్రి పేరుబంగారయ్య
జీవిత భాగస్వామి పేరుస్వరాజ్యం
పుట్టినతేదీ1950 జనవరి 18
మరణం2021 మే 16
పుట్టిన ఊరు
విద్యార్హతలుఎమ్.ఎ.
వృత్తిచరిత్ర అధ్యాపనం
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుకోకిలమ్మ పదాలు (1972)
అగ్ని (1974)
సమరశంఖం (1977)
ప్రాణం (1978)
అడవి (2008) (1978-2008 మధ్యలో అచ్చయినవి, ప్రసారమైనవీ)
సంపాదకత్వం : చేతన (అరసం కవితా సంకలనం)
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుఉత్తమ గేయ రచయిత
ఉత్తమ అధ్యాపక
ఉగాది పురస్కారం (2004)
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షిక
సంగ్రహ నమూనా రచన

అదృష్టదీపక్

సామాజిక సమస్యలకు ప్రతిస్పందించే హృదయ సౌకుమార్యంవుంది అదృష్టదీపక్ కు. తన అనుభూతులకు కవితారూపం యిచ్చే నేర్పుకూడావుంది యితనికి.. -రాచమల్లు రామచంద్రారెడ్డి

అదృష్టదీపక్ కు తన లక్ష్యం యేమిటో, దాన్ని యెలా సాధించాలో తెలుసు. వర్తమాన సమాజం పట్ల తీవ్ర అసంతృప్తి అంతరంగంలో ప్రజ్వలిస్తున్నా దాన్ని వ్యక్తీకరించడంలో ఎంతో నిగ్రహాన్ని ప్రదర్శిస్తాడు. “అక్షరాల రెక్కలు విప్పుకుని ” “కన్నీళ్ళు కవిత్వంగా” మారుతాయంటాడు.”కొడిగట్టిన ఆశను కొత్తకోరికలతో తిరిగి రగిలించు” అంటూ భవిష్యత్తు పట్ల అనంతమైన ఆశను ప్రకటిస్తాడు అదృష్టదీపక్.- గజ్జెల మల్లారెడ్డి

అదృష్టదీపక్ సముద్రాన్ని కమండలంలో ఇమిడ్చిన ఋషిలాగ…పైకి కనపడడు! ఆయనో చల్లని అగ్నిపర్వతం! వెచ్చని హిమాలయం! గులాబీలా కనిపించే విచ్చుకత్తి! మొగలిరేకులా అనిపించే మల్లెపువ్వు! ఆయన తక్కువే రాస్తాడు…ఎక్కువగా గుర్తుండి పోయేలాగ! ఆయనెప్పుడూ వీరబాహుడిలాగ – భుజాన కుండొకటి పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఎవరన్నా అభిప్రాయం అడిగితే – నిర్మొహమాటంగా ఆ కుండని మొహాన్న భళ్ళున కొడతాడు! నిజం చెప్పటం ఆయనకిష్టం. దానివల్ల ఆయన చాలా దెబ్బలు తినిఉండొచ్చు కానీ- ప్రతిదెబ్బా ఆయన పాలిట ఓ గోల్డ్ మెడల్ కదా! ఎంచేతంటే వీరుణ్ణి ఎప్పుడైనా గాయాలతోనేగదా గుర్తించాలి! – తనికెళ్ళ భరణి.

ఇంతమంది శత్రువుల్ని సంపాదించుకున్న అదృష్టదీపక్ ను ఇలాగే ఉండమని అభినందిస్తున్నాను…- బ్నిం

అదృష్టదీపక్ మంచి కవిమాత్రమే కాదు. నిజాయితీగల విమర్శకుడు కూడా అని అర్ధమవుతోంది.నిబద్ధత ముసుగులో ఉన్న కవులూ, రచయితలూ చాలామంది ఉన్నారు. కాని అదృష్టదీపక్ లోపలా, బయటా కూడా నూటికి నూరుపాళ్ళూ నిబద్ధుడైన రచయిత! – ద్వా.నా.శాస్త్రి

రసికుం డదృష్ట దీపకు డసమానమ్మైన కవిగ నాంధ్రావనిలో కుసుమించిన చెంగలువగ వసియించుచునుండు సతము ప్రజల మనములన్ – డాక్టర్ రాధశ్రీ

———–

You may also like...