ఎండ్లూరి సుధాకర్ (Andulluri Sudhakar)

Share
పేరు (ఆంగ్లం)Andulluri Sudhakar
పేరు (తెలుగు)ఎండ్లూరి సుధాకర్
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ01/21/1959
మరణం28 జనవరి 2022
పుట్టిన ఊరునిజామాబాద్
విద్యార్హతలుఎం.ఏ, ఎం.ఫిల్, పిహెచ్‌డి
వృత్తిపీఠాధిపతిగా పదవీ బాధ్యతల నిర్వహణ
తెలిసిన ఇతర భాషలుహిందీ, ఉర్దూ
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకెhttp://sudhakaryendluri.blogspot.com/
స్వీయ రచనలువర్తమానం,కొత్త గబ్బిలం,నా అక్షరమే నా ఆయుధం
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలుhttp://kinige.com/book/Gosangi,http://kinige.com/author/Yendluri+Sudhakar
పొందిన బిరుదులు / అవార్డులులలిత కళా పరిషత్ పురస్కారం, నల్గొండ -1980
స్లిష్టల వెంకటల్లు దీక్షితులు స్మారక సాంస్కృతిక సాహితీ కళా సమితి, యలమంచిలి- 1990
ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు -1992
ఉదయభారతి జాతీయ అవార్డు, భువనేశ్వర్-1993
కవికోకిల జోషువ పురస్కారం
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికకలల అక్షరం
సంగ్రహ నమూనా రచననన్నొక మొక్కను చేయండి
మీ ఇంటిముందు పువ్వునవుతాను
నన్ను ఊయలలూపి చూడండి
మీ కంటి ముందు పసిపాప నవ్వునవుతాను
నన్ను దేవుణ్ణి మాత్రం చేయకండి

ఎండ్లూరి సుధాకర్

నన్నొక మొక్కను చేయండి
మీ ఇంటిముందు పువ్వునవుతాను
నన్ను ఊయలలూపి చూడండి
మీ కంటి ముందు పసిపాప నవ్వునవుతాను
నన్ను దేవుణ్ణి మాత్రం చేయకండి
ముక్కోటి దేవతలతో
విసిగిపోయాను
వెలివేయబడ్డాను
నన్నొక గోడను చేయండి
ఒక వాక్యమై నిలదీస్తాను
నన్నొక పిడికిలి చేయండి
నలుగురి కోసం నినదిస్తాను
నన్ను మతాల మంత్రనగరికి పంపకండి
నన్ను తీవ్రవాదిని చేసి చంపకండి
నా చుట్టూ గిరి గీయకండి
నేనెవరి గూట్లో ఇమడలేను
నన్నొక అడవిలో వదిలేయండి
అగ్నిపూల వనమవుతాను
సీతాకోక చిలుకల రెక్కలు విరిచి
స్వేచ్చ గురించి మాట్లాడకండి
నన్ను కొత్త కోకిలను చేయండి
చైతన్య చైత్ర గీతమవుతాను
నా హక్కుల గొంతు కోయకండి
నా పాటల పురిటి నొప్పులు వినండి
నన్ను జైల్లో బంధించకండి
నేనీ దేశపు ఆత్మగౌరవాన్ని !
నా కలాన్ని విరిచేయకండి
నేనొక కలలుగనే అక్షరాన్ని
నన్ను హిమాలయాల మీద చూడండి
నేనొక జెండానై రెప రెపలాడతాను

———–

You may also like...