శివలెంక రాజేశ్వరీ దేవి (Sivalenka Rajeswari Devi)

Share
పేరు (ఆంగ్లం)Sivalenka Rajeswari Devi
పేరు (తెలుగు)శివలెంక రాజేశ్వరీ దేవి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ16/1/1954
మరణం25/4/2015
పుట్టిన ఊరుకృష్ణా జిల్లా జగ్గయ్యపేట
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు“సత్యం వద్దు, స్వప్నమే కావాలి”
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలుhttp://www.logili.com/padhya-kavyamulu/satyam-vaddu-swapname-kavali-rajeswari-devi-sivalenka/p-7488847-22992145109-cat.html#variant_id=7488847-22992145109,http://jsnbooks.com/book/satyam-vaddu-swapanamae-kavali-telugu-book-by-sivalenka-rajeswari-devi-poetry/
పొందిన బిరుదులు / అవార్డులుఇస్మాయిల్ కవిత్వ పురస్కారం
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికసత్యం వద్దు స్వప్నమే కావాలి
సంగ్రహ నమూనా రచనపగిలిన అద్దంలో… అద్దం పగిలిపోతుంది ప్రతిబింబం పగుళ్ళలో జీవనస్పర్శని కోల్పోతావు అనుభూతి సిగ్గెరుగదన్న సొగసైన మాట ఆకలి సిగ్గెరుగదన్న నిజాయితీగా నీలో నిర్వచనమవుతుంది

రాజేశ్వరి దేవి శివలెంక

పగిలిన అద్దంలో…

అద్దం పగిలిపోతుంది

ప్రతిబింబం పగుళ్ళలో

జీవనస్పర్శని కోల్పోతావు

అనుభూతి సిగ్గెరుగదన్న సొగసైన మాట

ఆకలి సిగ్గెరుగదన్న నిజాయితీగా

నీలో నిర్వచనమవుతుంది

కవితాత్మ చిట్లి భావమయేంతలో

ఒకానొక రాస్తాలో

వెన్నెల నీడలతో కొలుస్తూ వెళ్ళే జీవితంమీద

ఊడలమర్రి వికృతంగా చీకటిపరుస్తుంది 

సమయం మనదికాని వేళ

అందమైన సాయంకాలం

అమృతా షేర్ గిల్ బొమ్మలా కనిపించదు

ఆత్మని ఊయలులూపే మురళీగానం సైతం

అగాధాల్లోంచి పైకిలేపదు

వెదురు వేణువూ కాదు ఎంత ఊపిరిపోసినా

మాట సరే అదో అర్థంకాని ప్రహసనం

స్పర్శ చచ్చుబడిపోతుంది

పరిస్థితి పరాకాష్టకు చేరుతుంది

ఎడదలో ఎడారిమొక్కలు ఏపుగా పెరుగుతున్న

ఈ వేళగాని వేళ

నేనంటే నేను మాత్రమే కాదురా నాన్నా!

నేను నేనుగా ఇమడలేక

మరో పాత్రగా రూపం చెందిన ప్రతిబింబాన్ని!

———–

You may also like...