మాదిరెడ్డి సులోచన (Madireddy Sulochana)

Share
పేరు (ఆంగ్లం)Madireddy Sulochana
పేరు (తెలుగు)మాదిరెడ్డి సులోచన
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1935
మరణం1984
పుట్టిన ఊరుశంషాబాద్ గ్రామం
విద్యార్హతలుఎం.ఎ., ఎం.యిడి.
వృత్తిఉపాధ్యాయిని
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఅంతము చూసిన అసూయ
అందని పిలుపు
అగ్నిపరీక్ష
అధికారులు – ఆశ్రిత జనులు
అపురూప
ఋతుచక్రం
కాంతిరేఖలు
గాజుబొమ్మలు
జీవనయాత్ర
తరంగాలు
తరం మారింది
దేవుడిచ్చిన వరాలు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుగృహలక్ష్మి స్వర్ణకంకణము – 1978
ఇతర వివరాలుఈమె 1965 లో ‘జీవయాత్ర’ పేరుతో మొదటి నవల వ్రాసింది. ఈమె దాదాపు 150 కథలు, 72 నవలలు, 2 నాటికలు, 10 ఏకాంకికలు రచించింది. వీనిలో 10 నవలలు సినిమాలుగా రూపొందాయి. తెలుగునాట నవలల్ని విశేషంగా చదివింపచేసే ఆలవాటు చేసిన రచయితల్లో మాదిరెడ్డి సులోచన ఒకరు. ఆనాడు కాల్పనిక ప్రభావంతో రచనలు చేసిన వారిలో ఈమె ఒకరు. ఊహజనిత చిత్రణ కంటే వాస్తవిక జీవిత చిత్రణకు ప్రయత్నించింది. ప్రేమలు, పెళ్ళిళ్ళు కంటే కుటుంబ జీవితానికి ప్రాధాన్యం ఇచ్చింది. ఉత్తమ ఉపాధ్యాయిని, ఉత్తమ కథా రచయిత్రి అవార్డులు పొందింది.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఅభినేత్రి
సంగ్రహ నమూనా రచనఎన్ని మార్పులు వచ్చినా మానవనైజాలు, ప్రవృత్తులు ఎన్నటికీ మారవు. ప్రేమ, ద్వేషం, స్వార్థం లాంటి ముడి దినుసుకు యెన్ని తరాలు గడిచినా చలనం వుండదు. అందుకే మాదిరెడ్డి సులోచన కాల్పనిక సాహిత్యంలో మౌలిక అంశాలు నేటికీ నూతనంగానే వుంటాయి.

మాదిరెడ్డి సులోచన

ఎన్ని మార్పులు వచ్చినా మానవనైజాలు, ప్రవృత్తులు ఎన్నటికీ మారవు. ప్రేమ, ద్వేషం, స్వార్థం లాంటి ముడి దినుసుకు యెన్ని తరాలు గడిచినా చలనం వుండదు. అందుకే మాదిరెడ్డి సులోచన కాల్పనిక సాహిత్యంలో మౌలిక అంశాలు నేటికీ నూతనంగానే వుంటాయి.

అభినేత్రి

”రాజేశ్వరీ ఆర్ట్స్‌” నాట్యమండలి వారు నిర్వహించే నాటకం చూడటానికి జనం తండోప తండాలుగా రాకపోయినా నాట్యమండలి నడవడానికి డబ్బు వస్తుంది.

దాని మేనేజర్‌ సభాపతి బయటికి వచ్చి ఒకసారి ఆదుర్దాగా జనాన్ని చూసి వెళ్ళబోయాడు. పరుగెత్తుకుంటూ వచ్చే తబలిస్టు సాయినాథ్‌ కనిపించాడు.

”రాణి బస్సుస్టాండులో లేదు గురూ!” ఒగరుస్తూ చెప్పాడు.

సభాపతికి ముచ్చెమటలు పోశాయి. ”కనకతార” ఆడతామని టిక్కట్లు అమ్మారు. మధ్యాహ్నం కథానాయికగా వేసే అమ్మాయి రాణి సభాపతితో పోట్లాడింది. అంతమాత్రానికే చెప్పకుండా పోతుందనుకోలేదు.

”ఇప్పుడెలా?”

”పోనీ, దమయంతిని వేషం వెయ్యమనండి.”

”నీకు బుర్రుందా సాయీ! ”కనకతార” కథ కోసం వస్తారటోయ్‌ జనం. ఆ రాణిది పిటపిటలాడే వయసు, మత్తెకించే అందం, దానికోసం వస్తారు.”

”పోనీ, అనివార్యకారణాల వల్ల నాటకం వెయ్యటం లేదని ప్రకటిద్దాం.”

”ఈ నాటకాల కోసం బంగారం లాంటి పొలం, మేడ అమ్మాను.  ఇక కాళ్ళు చేతులే మిగిలాయి. అవి విరగకొట్టుకోమంటావా?”

”మరేం చేద్దాం? అరగంటే వుంది సమయం.”

ఇద్దరూ ఆలోచనలో పడిపోయారు. సభాపతి ఓ నిర్ణయానికి వచ్చినట్లు తలపంకించాడు….

———–

You may also like...