Share
పేరు (ఆంగ్లం)D.kameshwari
పేరు (తెలుగు)డి. కామేశ్వరి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరుడి.వి.నరసింహం
పుట్టినతేదీ8/22/1935
మరణం
పుట్టిన ఊరుకాకినాడ
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుకొత్తనీరు
కొత్తమలుపు
కోరికలే గుర్రాలైతే
ఎండమావులు
మనసున మనసై
జీవితం చేజారనీయకు
కార్యేషు మంత్రీ
అరుణ
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుగృహలక్ష్మి స్వర్ణకంకణము -1971
మద్రాస్ తెలుగు అకాడమీ అవార్డు -1991
మాదిరెడ్డి సులోచన అభినందన అవార్ఢు – 1994
తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ రచయిత్రి అవార్డు – 1990, 1994, 1999
నంది పురస్కారం – టీవీ చిత్రాల విభాగంలో ఉత్తమ కథారచయిత – 2009
ఉత్తమ సినీ కథారచయిత్రిగా న్యాయం కావాలి సినిమాకు సితార, ఆంధ్రభూమి, వంశీ-బర్కిలీ, సినీహెరాల్డ్, కళాసాగర్ సంస్థల నుండి 5 అవార్డులు -1981
ఎండమావులు నవలకు గోపీచంద్ అవార్డు – 2006
సుశీలా నారాయణరెడ్డి అవార్డు – 1998
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షిక
సంగ్రహ నమూనా రచన

డి. కామేశ్వరి

రచయిత పరిచయం

పుట్టింది అమలాపురం, కోనసీమలో, పెరిగింది గుంటూరులో, నివాసం హైద్రాబాద్ లో.

 

జీవననేస్తం– మంథా రామారావు బి.టెక్. విద్యుత్ శాఖలో సూపరెండెంట్ ఇంజనీర్ గా పదవీ విరమణ చేశారు.

 

చదువు –ఉస్మానియా యూనివర్సిటీ యమ్. యస్సీ, యూనివర్సిటీ ఆఫ్ డెన్వర్, యు.యస్. ఏ నుండి రసాయన శాస్త్రంలో యమ్.యస్, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి,

 

వృత్తి- విశ్రాంత ప్రభుత్వ రసాయన శాస్త్ర అధ్యాపకురాలు.

 

ప్రవృత్తి- సంగీతం (పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలం నుంచి కర్నాటక సంగీతంలో డిప్లమా)

 

సాహిత్యం- పఠనం, రచన, యోగా.

 

రచనలు- ఇరవై మూడు నవలలు, ఎనభై పైగా కథలు వివిధ పత్రికలలో ప్రచురింప బడ్డాయి. మూడు కథా సంకలనాలు, మూడు నవలలు పబ్లిష్ చేశాము.

మూడు శతకాలు కొన్ని ఖండికలు రచించారు.

జ్ఞాపకాలసందడి -1

-డి.కామేశ్వరి

జ్ఞాపకాలసందడి ….2012 ..వంగూరి ఫౌండేషన్ లైఫ్ టైం అవార్డు  అందుకోడానికి  హ్యూస్టన్ వెళ్లినప్పటి మాట .1986  లో అమెరికా  యూరోప్  టూర్  వెళ్ళినపుడు  ఒక నెలరోజులు ఉండి చూడాల్సినవి చూసా  కాబట్టి  ఈసారి  అవార్డు ఫంక్షన్  హ్యూస్టన్ లో,డల్లాస్ లో సన్మానం అయ్యాక  నా ముఖ్య బంధువుల. ఇళ్లలో తలో రెండుమూడు రోజులు ఉండేట్టు  ప్లాన్చేసుకున్న ,వాషింగ్టన్ లో మనవడు నిర్మల్ ,చెల్లెలుకుతురు కల్పనా వున్నారు .నాకు మునిమనవడు  మూడు నెలల క్రితం పుట్టాడు .వాడిని ముందుచూడాలిగదా అక్కడికి వెళ్ళినపుడు చిన్న సరదా జ్ఞాపకం. వెళ్ళగానే  అమ్ముమ్మకి  మర్యాదగా ,అభిమానంగా వాళ్ళ బెడఁరూం ఇచ్చి సామాను పెట్టారు .వన్ బెడఁరూం అపార్ట్మెంట్  ,పెద్ద హాల్ , ఒక bedroom ,కిచెన్  స్టూడియో అపార్ట్మెంట్ అంటారు పెళ్లిఅయి కొత్తలో ఉండేవారు .హల్లో పడుకుంటానన్న వినకుండా  గది ఇచ్చారు . గదిలోకి తీసికెళ్ళి. క్రిస్టీన్ ( మనవడి  జర్మన్ భార్య ) కప్బోర్డు తలుపు తీసి ఏదోఅంది .అమెరికన్ యాక్సెంట్ ఏ  సరిగా అర్ధంకాదు అందులో  జర్మన్ యాక్సెంట్  బట్టలు పెట్టుకోమంటుందేమో అని బుర్ర ఉపా .అంతలో చటుక్కున  రెండో అరలో మెరుస్తూ  నాలుగు కళ్ళలాటివి కనిపించి ఓ కేకపెట్టి  వెనక్కి  తగ్గ .అక్కడ అరలో రెండు పిల్లులు మ్యావు  అని అరిచి కిందకి గెంతి పారిపోయాయి .నిర్మల్ వచ్చి విషయం చెప్పాడు .అవి పెంపుడు పిల్లులు రోజంతా  కప్బోర్డు లో చలికి పడుకుని రాత్రి ఇంట్లో తిరుగుతాయి ,నీవు భయపడతావని క్రిస్టీన్ చూపించి చెప్పింది అనిచెప్పాడు .ఇంట్లో పెద్ద కుక్కకూడా ఉంది. సరే  రాత్రి హల్లోపెద్ద ఎయిర్ బెడ్ వేసుకుని వాళ్ళు పడుకున్నారు .అర్ధరాత్రి  బాత్ రూమ్  వెళ్ళడానికి  లేస్తే  హల్లో కనిపించిన దృశ్యం ..భార్య భర్త ,మధ్యన  చంటివాడు ,కాళ్లదగ్గర కుక్క  తలల దగ్గర చేరివైపు రెండుపిల్లులు , వాళ్ళ ఫుల్ ఫామిలీ  అన్నమాట  హ్యాపీగా  పడుకున్నారు ఓరి వీళ్ళ దుంపతెగా ఆలా పక్కలమీద ఎక్కించుకోడం ఏమిటో అర్ధం కాలేదు,చంటివాడిని కుక్క,పిల్లులు నాకేస్తున్నాయి  ఒరేయి. రోగాలు పట్టుకుంటాయిరా అని కేకలేస్తే. ఏమిరావు  పైగా  ఇమ్మ్యూనిటి  పెరుగుతుంది అని వాదించాడు .మేము కుక్కని పెంచంకని  పక్కలు ,సోఫాలు ,నాకడాలుh  అలౌ  చేయలేదు .ఫారెనర్స్ అందరు చంటిపిల్లల దగ్గర ఆలా వదిలేస్తారు .ఆరాత్రి దృశ్యం ఫోటో  తీయడానికి అపుడు మాములు  సెల్ తప్ప స్మార్ట్ఫోన్లు ఇంకా రాలేదు నాకు.అలమరాలో మాత్రం ఊహించని ఆకళ్ళు చూసి నిజంగానే  భయపడ్డ .అపుడు తీసిన ఫోటోలు కొన్ని మీ  కోసం .



 1952 .పెళ్లయింది . ఒరిస్సాలో కటక్ లో మా అయన ఇంజనీరింగ్ స్కూల్ లో పనిచేసేవారు .ఆరోజుల్లో మద్రాస్ హౌరా మెయిల్ ఒకటే రైల్ మధ్యలో అర్ధరాత్రి కటక్ లోఆగేది.మానాన్నగారు విశాఖపట్నంలో డివిజినల్ ఇంజినీర్ హైవేస్ లో పనిచేసేవారు. అయన ముందువెళ్ళి అన్ని ఏర్పాట్లుచేసుకున్నాక పంపమని చెప్పివెళ్ళారు. వైజాగ్ లో మెడిసిన్ చదివే మరిదిని తోడిచ్చిపంపారు .ఆర్ద్రాత్రి కటక్ లో స్టేషన్ కొచ్చి రిసీవ్ చేసుకున్నారు అయన.ఆరోజుల్లో మనిషిలాగే రిక్షాలు ,టాంగాలూ (గుఱ్ఱంబండి తలుపులుండేవి ) మొదటిసారి చూడ్డం ఎక్కడం సామాను పైనపెడతారు.కొత్తగా వుంది అనుభవం ,సరే గిరిధర్ సాహు కొలని కొత్త ఏరియాలో ఇల్లు .అది ఎలావుందంటే పెద్ద పొడవాటి సందు ఇటు అటు పది ఇల్లు వరసగా రైల్ పెట్టాలమాదిరి వుంది లోపల లోపల, నాలుగువైపులా గదులు మధ్య ఖాళీస్థలం స్క్వేర్ గ .వంటగది భోజనం గది ఒకవైపు ,బాత్రూం టాయిలెట్,నుయ్యి వెనకవైపు, ముందువైపు డ్రాయింగ్ రూమ్ ఒకపక్క రెండుబెడ్రూం లు ఒక వైపు మొత్తం ఆరుగదులు అద్దె 40 రూపాయలు . ఏమిటో ఒరిస్సా బాక్వర్డ్ అనేవారు , ఊరు ,ఇల్లు ఎలాఉంటాయో అని అందరు అంటే గుబులుగా ఉండేది .ఊరు ఒరిస్సాలో పెద్ద ఊరు అయినాపాతకాలం పట్టణం .ఇల్లు బాగుంది ఉన్నంతలో., కొత్తభార్య కోసం నీట్ గసర్దేసారు అయన సరే ఇంక అముచ్చట్లు పక్కన పెట్టి అసలు విషయం,భాష . ఒరియా రాదు ,అక్కడ ఇంగ్లీష్ కూడా అంతంతమాత్రమే ,హిందీ కూడా పెద్దగా రాదువాళ్ళకి.రిక్షా వళ్ళంతాతెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు.పెళ్ళికుదిరాక ఆదివారం ఆదివారం మా నాన్నకి అభ్యంగ స్నానం అంటే చక్కగా నూనెలురాసి మలిష్చేసితలంటాడం .మానాన్నగారి దర్జాఅలావుండేది . మంగలివచ్చేవాడు ఆరోజుల్లో వైజాగ్ ఆంధ్రాలో ఒరిస్సానించి మంగళివారు పొట్టకూటి వచ్చిపనిచేసేవారు ,అమ్మ దీనికి నాలుగు ఒరియా ముక్కలు నేర్పు అంది .వచ్చాను,వెళ్ళాను.కూరలు,పళ్ళు ,పనిమనిషితో పనికి కావలసిన మాటలు ,రోజువారీ మాటలు కొన్ని నేర్పించాడు .కొన్నాళ్ళు అవస్థపడి క్రమంగా నేర్చుకున్న .అప్పుడు వెళ్లిన నెలతర్వాత ఒక రోజు ఆయ్నలేనపుడు ,పక్కింటాయన వచ్చాడు .ఎదో ఆఫీసులో క్లర్క్ అనుకుంట. తలుపు తీసా . ఐ వాంట్ యువర్ staircase అన్నాడు ఉపాధ్ఘాతం ఏమిలేకుండా ,డైరెక్ట్ గ ,ముందు న కర్ధం కాలేదు .staircase అంటే మెట్లుకదా అవికావాలంటాడేమిటి ఆరోజుల్లో నాకొచ్చిన ఇంగ్లిష్ అంతంతమాత్రమే గదా ,అయినా మా ఇంట్లో staircase లేదు అన్న .డాబాల వుండేదికాని మెట్లు లేవు ఇంటికి .నన్ను అనుమానంగా చూస్తూ వుంది నేను చూసా అన్నాడు ఒరియాఇంగ్లీష్ లో నో అన్న నేను ..డాబామీదకి చూపిస్తూ నిన్న మీ హస్బెండ్ మీదకి వెళ్లడం చూసా అంటూ నా పక్కనించి దారి చేసుకుని లోపలికి వచ్చేసి 

ఓపెన్ స్పేస్ లో గోడకి నిలబెట్టిన నిచ్చెన చూపిస్తూ దేర్ ఇట్ఈజ్ దొంగని పట్టినంత.. సంబరంగా అన్నాడు ఓరి నీ దుంపతెగా ladder ని staircase అంటూ నేను అబధం చెప్పినట్టు చూసాడు దాన్ని ladder అంటారు starcase అంటే మెట్లు అన్న అపుడు వాడన్నమాట వింటే ఏమంటారో మీరు …ఓ తెలుగు లో ladder అంటారా ఐ don’t know తెలుగు అని నిచ్చెన చంకన పెట్టుకుని పోయాడు . ఆ రోజుల్లో sslc చదివితే గుమస్తా ఉద్యోగాలు వచ్చేవి .ఒరియామీడియం లో చదివినవాడు .మా వారు వచ్చాక. చెపితే ముందు నవ్వి నవ్వి తరువాత తిట్టారు ఆ వెధవకి ఎందుకిచ్చావ్ అని.ఇంతసోది ఎందుకు ఈ నాలుగు ముక్కలు చెప్పడానికి అనచ్చు మీరు ఆరోజులు బాక్గ్రౌండ్ తెలియలిగదా ఈ తరానికి 

———–

You may also like...