పేరు (ఆంగ్లం) | Ichapurapu Ramachandram |
పేరు (తెలుగు) | ఇచ్ఛాపురపు రామచంద్రం |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 06/11/1940 |
మరణం | 05/08/2016 |
పుట్టిన ఊరు | విశాఖపట్టణం |
విద్యార్హతలు | బి.ఎ. (ఎకనామిక్స్) |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | ఆకులురాలేకాలం,ఎదురద్దాలు,చేదుకూడా ఒక రుచే,ప్రేమించిన మనిషి,వానజల్లు,జంతువుల కథలు,అపూర్వ చింతామణి |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | అపూర్వ చింతామణి |
సంగ్రహ నమూనా రచన | ఇచ్ఛాపురపు రామచంద్రం 500లకు పైగా కథలు, కథానికలు, రేడియో నాటికలు రాసి ప్రజాదరణ పొందాడు. కాశీమజిలీ కథలను అనువాదం చేశాడు. బాలసాహిత్యంలో 40నుంచి 50 వరకూ పుస్తకాలు రాసిన ఆయన ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, ఆంధ్రపత్రిక పత్రికల్లో ఆయన కథలు వందకుపైగా ప్రచురితమయ్యాయి. |
ఇచ్ఛాపురపు రామచంద్రం
పరమేశ్వరుడి సాక్షిగా, గురువుల పాదాల సాక్షిగా, నాకు ప్రాణభిక్ష పెట్టి విద్యలు బోధించిన గురువుల ఆజ్ఞను – ఏ సందర్భంలోను మీరను. ఎన్ని కష్టాలు కలిగినా, ఎలాంటి ఆటంకాలు వచ్చినా- గురువులు నిర్ణయించిన క్రతువును విధిగా పూర్తి చేస్తానని ప్రమాణం గావిస్తున్నాను. అంతటితో బాలమహర్షి పూర్తిగా తృప్తి చెందాడు.
‘చింతామణీ! నిన్ను వివాహం చేసుకునే వాడికి కొన్ని అర్హతలు కావాలి. అతను మహామేధావీ, అధిక ప్రజ్ఞావంతుడూ, పరార్రకమోపేతుడూ అయి ఉండాలి. నేను నీకు కొన్ని ప్రశ్నలు చెబుతాను. నిన్ను పెళ్ళి చేసుకోవాలని వచ్చే రాజకుమారులని నువ్వు ఆ ప్రశ్నలడగాలి. వాటికి సరైన జవాబులు చెప్పగలిగిన వాడిని మాత్రమే నువ్వు వివాహం చేసుకోవాలి. చెబుతానని వచ్చి చెప్పలేకపోయిన రాజకుమారుడి శిరస్సును ఖండించి కోటద్వారానికి వేలాడదియ్యాలి. ఈ నీ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పగలిగిన రాజకుమారుడు వచ్చి నిన్ను పరిణయం ఆడేవరకూ నువ్వీ శాంతిభవనం నుంచి బయటకు అడుగు పెట్టకూడదు. నీ చెలి శోభ నీతో ఉండొచ్చు. ఈ సమాచారాన్ని దేశదేశాలూ చాటించి రాజకుమారులందరికీ తెలిసేటట్లు చెయ్యాలి”. చింతామణి గురువులు పలికిన ప్రతి అక్షరాన్ని మెదడుకి పట్టించుకుని ఆలోచించసాగింది.
‘రాజకుమారీ! ఇదీ నీ వ్రతవిధానం. నీ ప్రశ్నలకు జవాబు చెప్పగలనని వచ్చి, యజ్ఞవేదికపై నిలబడి, జవాబులు చెప్పలేక అపజయం పొందిన రాజకుమారుడు నీకు బంధువు కానీ, స్నేహితుడు కానీ, నిస్సంకోచంగా నీ కరవాలంతో అతని శిరస్సును ఖండించి తీరవలసిందే” అన్నాడు బాలమహర్షి- చింతామణి తనను వివాహం చేసుకోగోరి వచ్చిన రాకుమారులని అడిగి ప్రశ్నలేమిటి? వాటికి సమాధానం చెప్పలేక శిరస్సులు ఖండింపబడ్డ వారెండరు? సరియైన సమాధానాలు చెప్పిన రాకుమారుడెవరు? ఈ వివరాలన్నీ శ్రీ ఇచ్ఛాపురపు రామచంద్రంగారు రాసిన సహస్రశిరచ్ఛేద అపూర్వ చింతామణి చదివి తెలుసుకుందాం.
———–