రామా చంద్రమౌళి (Rama Chandra Mouli)

Share
పేరు (ఆంగ్లం)Rama Chandra Mouli
పేరు (తెలుగు)రామా చంద్రమౌళి
కలం పేరు
తల్లిపేరురాజ్యలక్ష్
తండ్రి పేరురామా కనకయ్య
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ7/8/1950
మరణం
పుట్టిన ఊరుఆంధ్ర ప్రదేశ్
విద్యార్హతలుపిజిడిసిఎ
వృత్తివైస్‌ ప్రిన్సిపాల్‌
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుశాపగ్రస్తులు
చారునీళ్లు
ప్రవాహం
శాంతివనం
తెలిసిచేసిన తప్పు
అమృతం తాగిన రాక్షసులు
వక్రరేఖలు చదరంగంలోని మనుషులు
పిచ్చిగీతలు
రాగధార
నిన్ను నువ్వు తెలుసుకో
పొగమంచు
మజిలీ
దారితప్పిన మనుషులు
ఎడారిలో చంద్రుడు
ఎక్కడనుండి ఎక్కడికి?
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుభాగ్య అవార్డు (2005), ఆంధ్రసారస్వత సమితి పురస్కారం (2006)
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికసూర్యుని నీడ
సంగ్రహ నమూనా రచనకాకతీయుల పరిపాలన తర్వాత అనేకానేక కారణాలవల్ల తెలంగాణా ఒక దుఖభూమిగా మిగిలిపోయింది. హైదరాబాద్ దేశంగా తన స్వంత సైన్యం, స్వంత కరెన్సీ, స్వంత రైల్వే, తపాలా, జెండా గలిగి నిజాం రాజుల నిరంకుశపాలనలో మ్రగ్గిపోతూ శతాబ్దాలుగా బానిస బ్రతుకులనీడుస్తూన్న జనానికి ఇక తిరుగబడం…ఆయుధాన్ని పట్టి యుద్ధంచేయడం అనివార్యమై.. పోరాటమే ఇక తమ జీవన విధానమని నిర్ధారించుకొని నిజాం పాలకులకూ, ఆయన తొత్తులైన జాగీర్దార్లు, దేశ్ ముఖ్ లు వంటి స్థానిక దోపిడీదార్ల అణచివేతకూ వ్యతిరేకంగా అక్కడక్కడ వ్యక్తులుగా.. మరికొన్ని చోట్ల సంఘటిత శక్తులుగా తిరుగుబాటును సుదీర్ఘకాలం కొనసాగించి భూమికోసం భుక్తికోసం తరతరాల విముక్తికోసం వందలు వేలుగా తమ త్యాగాలను చేసి మట్టిని నెత్తురుతో తడిపి పునీతం చేసిన పవిత్ర భూమి తెలంగాణా.

రామా చంద్రమౌళి

కాకతీయుల పరిపాలన తర్వాత అనేకానేక కారణాలవల్ల తెలంగాణా ఒక దుఖభూమిగా మిగిలిపోయింది. హైదరాబాద్ దేశంగా తన స్వంత సైన్యం, స్వంత కరెన్సీ, స్వంత రైల్వే, తపాలా, జెండా గలిగి నిజాం రాజుల నిరంకుశపాలనలో మ్రగ్గిపోతూ శతాబ్దాలుగా బానిస బ్రతుకులనీడుస్తూన్న జనానికి ఇక తిరుగబడం…ఆయుధాన్ని పట్టి యుద్ధంచేయడం అనివార్యమై.. పోరాటమే ఇక తమ జీవన విధానమని నిర్ధారించుకొని నిజాం పాలకులకూ, ఆయన తొత్తులైన జాగీర్దార్లు, దేశ్ ముఖ్ లు వంటి స్థానిక దోపిడీదార్ల అణచివేతకూ వ్యతిరేకంగా అక్కడక్కడ వ్యక్తులుగా.. మరికొన్ని చోట్ల సంఘటిత శక్తులుగా తిరుగుబాటును సుదీర్ఘకాలం కొనసాగించి భూమికోసం భుక్తికోసం తరతరాల విముక్తికోసం వందలు వేలుగా తమ త్యాగాలను చేసి మట్టిని నెత్తురుతో తడిపి పునీతం చేసిన పవిత్ర భూమి తెలంగాణా.
ఐతే…స్వతంత్ర భారతదేశ ప్రజలకన్నా దాదాపు ఒక ఏడాది తర్వాత స్వతంత్రులైన తెలంగాణా ప్రజలు నిజానికి నిజమైన స్వాతంత్ర్యాన్ని పొందనేలేదు. ఆహార్యాన్ని మార్చుకొని అదే భూస్వాములు, జమిందార్లు కాంగ్రెస్ తీర్థాన్ని పుచ్చుకొని.. మళ్ళీ ప్రజాస్వామ్య ముసుగులో దశాబ్దాల దోపిడిని కొనసాగించారు. మళ్ళీ అణచివేత.. వెట్టి చాకిరి.. వీటితో దేశ్శం ఒక చెత్తకుండై..కుళ్ళిపోయింది.
ఈ పుణ్యభూమిని పరిశుభ్ర ప్రజాక్షేత్రంగా ఎలా పునర్నిర్మించాలి. అనే చింతనతో నిజాయితీ నిండిన పిడికెడుమంది నిజమైన మనుషులు ఈ దేశంలో ఇంకా తెర వెనుక ఉన్నారు. కొద్దిమందైనా ఈ సమాజ స్వరూప స్వభావాల్ని తప్పనిసరిగా మార్చగలమనే బలమైన సంకల్పంతో వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు సంధిస్తే., తప్పక ఈ సమాజం.. ఈ రాష్ట్రం.. ఈ దేశం.. ఒక కొత్త శకంలోకి పయనిస్తుందని విశ్వసిస్తూ..వర్తమాన సంక్లిష్టతలకు ఒక పరిష్కారాన్ని ప్రతిపాదిస్తున్న నవల ఇది.
– రామా చంద్రమౌళి

———–

You may also like...