కాసల నాగభూషణం (Kasala Nagabhushanam)

Share
పేరు (ఆంగ్లం)Kasala Nagabhushanam
పేరు (తెలుగు)కాసల నాగభూషణం
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తిడి.జి.వైష్ణవ కళాశాల తెలుగు శాఖలో విశ్రాంత అధ్యాపకులు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఆముక్తమాల్యద – విక్టరీ పబ్లిషర్స్
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలుhttp://kinige.com/author/Dr.+Kasala+Nagabhushanam
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఆముక్తమాల్యద – విక్టరీ పబ్లిషర్స్
సంగ్రహ నమూనా రచనతానే స్వయంగా కట్టిన చెంగల్వ పూదండలను, చెట్టులోనే పండిపోయిన పెద్ద అరటి గెలను తన చెలికత్తెలు తీసుకొస్తూ వుంటే వాళ్లతో పాటు గుడికి వెళ్లేది. నంబి అక్కడున్న జనాన్ని దూరంగా వెళ్లమని ఖాళీ చేయిస్తే ఈమె గుడిలోకి వెళ్లి స్వామికి నమస్కరించి విగ్రహం ముందున్న వేదిక మీద రకరకాలుగా రంగవల్లులు తీర్చేది.

కాసల నాగభూషణం

తానే స్వయంగా కట్టిన చెంగల్వ పూదండలను, చెట్టులోనే పండిపోయిన పెద్ద అరటి గెలను తన చెలికత్తెలు తీసుకొస్తూ వుంటే వాళ్లతో పాటు గుడికి వెళ్లేది. నంబి అక్కడున్న జనాన్ని దూరంగా వెళ్లమని ఖాళీ చేయిస్తే ఈమె గుడిలోకి వెళ్లి స్వామికి నమస్కరించి విగ్రహం ముందున్న వేదిక మీద రకరకాలుగా రంగవల్లులు తీర్చేది. మంచి ఆవునేతితో దీపం వెలిగించేది. ”నారాయణాబ్జ చరణౌ శరణ మహంప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః” అన్న ద్వయమంత్రాన్ని పఠిస్తూ స్వామి వక్ష స్థలాన్ని చెంగల్వ పూదండతో అలంకరించి అగరు ధూపం వేసి చక్కెర, నెయ్యి, అరటిపండు ఇత్యాది హృద్యమైన పదార్ధాలతో నైవేద్యం సమర్పించేది. వక్క పలుకులు, శొంఠి ముక్కలు, పచ్చకర్పూరం కలగలిసిన తాంబూలాన్ని భక్తిపూర్వకంగా నివేదించి చెలులతో కలిసి గర్భ గుడికి ప్రదక్షిణం చేసివచ్చి స్వామి ఎదుట నిలిచి తలవంచి శఠకోపం పెట్టించుకునేది. తీర్థం సేవించేది. స్వామివారి ప్రసాదంగా లభించిన పూమాలను సిగలో తురుముకుని చెలికత్తెలతో కలిసి ఇంటికి తిరిగి వచ్చేది.

ఇలా ప్రతిరోజు గుడికి వెళ్లి మహావిష్ణువును పూజించివచ్చిన తరువాత గోదాదేవి విరహవేదన ఎక్కువై ధైర్యం సన్నగిల్లిపోగా ఆ యదుకులేశ్వరుని గుణగణాలను ద్రావిడ భాషలో మధురాతి మధురంగా గానం చేసేది. మార్గశీర్ష మాసంలో అలా రోజుకొక్క పాశురం చొప్పున ఆమె గానం చేసిన పాశురాలే ‘తిరుప్పావై’! ఆవిడ పాడిన విరహగీతాల సంకలనమే ‘నాచ్చియార్‌ తిరుమొళి’!

———–

You may also like...