పేరు (ఆంగ్లం) | Gutti Chandrasekharareddy |
పేరు (తెలుగు) | గుత్తి చంద్రశేఖర రెడ్డి |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | శ్రీ కృష్ణరాయము,చారువసంతం,తిరుపతి తిమ్మప్ప |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | http://kinige.com/book/Sri+Krishnarayamu,http://jsnbooks.com/book/charu-vasntam/,http://jsnbooks.com/book/tirupati-timmappa-telugu-book-by-gutti-joladarasi-chandrasekhara-reddy/ |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | శ్రీ కృష్ణరాయము |
సంగ్రహ నమూనా రచన | శ్రీకృష్ణదేవరాయలు పేరు సాహితీ ప్రియంభావుకత్వానికే మారుపేరు. గత చరిత్రలోకి వెళితే భోజరాజు, శర్వనృపతుంగుడూ మున్నగువారు కూడ సాహిత్య ప్రేమలో ఒకరికొకరు ఏమాత్రం తీసిపోని వారే. కాకపోతే “బోయివై నిజముగా బోయివై” అనిపించిన ఒక కవిని అందల మెక్కించడంతో సరిపుచ్చుకోక ఆ అందలం మోశాడే ఈయన, అదే సాహిత్యాభిమానానికి ముఖ్యంగా తెలుగు సాహిత్యాభిమానానికీ పరాకాష్ఠ. |
గుత్తి చంద్రశేఖర రెడ్డి
శ్రీకృష్ణదేవరాయలు పేరు సాహితీ ప్రియంభావుకత్వానికే మారుపేరు. గత చరిత్రలోకి వెళితే భోజరాజు, శర్వనృపతుంగుడూ మున్నగువారు కూడ సాహిత్య ప్రేమలో ఒకరికొకరు ఏమాత్రం తీసిపోని వారే. కాకపోతే “బోయివై నిజముగా బోయివై” అనిపించిన ఒక కవిని అందల మెక్కించడంతో సరిపుచ్చుకోక ఆ అందలం మోశాడే ఈయన, అదే సాహిత్యాభిమానానికి ముఖ్యంగా తెలుగు సాహిత్యాభిమానానికీ పరాకాష్ఠ.
కటకం నుండి కన్యాకుమారి దాకా, రాయల తరువాత గద్దెనెక్కిన ఏ చిన్నరాజో అతడు సామంతుడో, పాళెగాడో, జమీందారో ప్రతివారు అంతోయింతో సాహిత్యాన్ని పోషిస్తూ రావడం, అది ఆయన వేసిన బాటయేననేది సుస్పష్టం. అందులో తెలుగు సాహిత్యానికి కాస్త పెద్ద పీట లభించడం ఆయన పుణ్యమే.
నిన్నమొన్నటిదాకా భాషావారు రాష్ట్రాలు ఏర్పడిన తరువాత కూడ ఇంచుమించు దక్షిణ భారతంలో ఎక్కడికెళ్ళినా తెలుగు మాటకు మన్నన, సాత్వికమైన మర్యాదా అమితంగా ఉండేది. అది ఆయన పెట్టిన భిక్షయే.
ముఖ్యంగా అంతపెద్ద సామ్రాజ్యానికి ప్రభువైవుండి ఆయన వర్తన ఇంచుమించు నభూతో నభవిష్యతి. ఇటు వ్యవసాయాన్నీ, అటు పరిశ్రమల్నీ, వ్యాపారాన్నీ, సాంస్కృతిక రంగాన్నీ నడిపించిన తీరులో ఆయన కచ్చితంగా అద్వితీయుడే.
అలాంటి రాయల్ని మళ్ళీ మళ్ళీ స్మరించుకోవటం, స్ఫూర్తి పొందటం ఎప్పటికైనా సరే ఒక చారిత్రిక అవసరం. ఆ పనిని మా ఆర్ట్స్ & లెటర్స్ ద్వారా చేయగలందులకు సంతోషిస్తున్నాను.
———–