| పేరు (ఆంగ్లం) | Acharya Kasireddy Venkatareddy |
| పేరు (తెలుగు) | ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి |
| కలం పేరు | – |
| తల్లిపేరు | ద్రౌపదమ్మ |
| తండ్రి పేరు | కసిరెడ్డి మేఘారెడ్డి |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 1946 |
| మరణం | – |
| పుట్టిన ఊరు | మహబూబ్ నగర్ జిల్లా ఆమనగల్ మండలం పోలేపల్లి గ్రామం |
| విద్యార్హతలు | ఎం.ఎ |
| వృత్తి | అధ్యాపకుడు |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | http://andhrapatrika.in/te/article.php?id=10366 |
| స్వీయ రచనలు | చైతన్యశ్రీ సుభాషిత గీత త్రిశతి లేతమబ్బులు అలక కస్తూరి కథలు కల్పిత కథలు అమాసపున్నాలు దయా నీ పేరు దయ్యమా? |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | తుమ్మల పద్యకవితా పురస్కారం తుమ్మల సంప్రదాయ సాహితీ పురస్కారం వానమామలై స్మారక పురస్కారం గరిశకుర్తి సాహిత్య పురస్కారం నోరి నరసింహశాస్త్రి స్మారక పురస్కారం దాశరథి పురస్కారం మొదలైనవి. |
| ఇతర వివరాలు | ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి.. 1946లో మహబూబ్ నగర్ జిల్లా ఆమనగల్ మండలం పోలేపల్లి గ్రామంలో జన్మించిన వెంకటరెడ్డి గారు.. తెలుగు, సంస్కృత భాషల్లో ఎం.ఎ.పూర్తి చేసి, ‘తెలుగు పొడుపుకథలు’ అనే అంశంపై పిహెచ్.డి చేశారు. కవిగా, రచయితగా, జానపద పరిశోధకుడిగా, సామాజిక-ధార్మిక విషయాల ఉపన్యాసకుడిగా ఆయన ఎంతోమందికి సుపరిచితులు. ఆయన ఎన్నో పద్య, గేయ, వచన కవితా సంపుటాలను వెలువరించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సుదీర్ఘకాలం ప్రొఫెసర్ గా పనిచేసిన ఈ ‘జాతీయవాద కవి’ జాతీయ సాహిత్య పరిషత్తు సంస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వెంకటరెడ్డి గారు రాసిన ‘చైతన్యశ్రీ’ గ్రంథానికి రాష్ట్రస్థాయి పురస్కారంతో పాటు, ఆయన చేసిన సాహిత్యసేవకు గుర్తింపుగా అసంఖ్యాకంగా అవార్డులు లభించాయి. |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | అమ్రితసూక్తం |
| సంగ్రహ నమూనా రచన | – |