పేరు (ఆంగ్లం) | Koduri Leelavati |
పేరు (తెలుగు) | కోడూరి లీలావతి |
కలం పేరు | – |
తల్లిపేరు | లక్ష్మీదేవమ్మ |
తండ్రి పేరు | దేవత శ్రీరామమూర్తి |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 1919 సెప్టెంబరు 19 |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | కుంకుమరేఖ రవికవి (రవీంద్రనాథ్ టాగూర్ జీవిత చరిత్ర) (కోడూరి శ్రీరామమూర్తి సహరచయిత) |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | కుంకుమరేఖ రవికవి (రవీంద్రనాథ్ టాగూర్ జీవిత చరిత్ర) (కోడూరి శ్రీరామమూర్తి సహరచయిత)\ |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ జీవిత చరిత్ర |
సంగ్రహ నమూనా రచన | శ్రీ రవీంద్రనాథ్ టాగూర్ భారతదేశపు గొప్పకవి, కళాకారుడు, యాభైఏళ్ళు, అంతకు పైగా ఆయన గొప్ప అధ్యాపకుడుగా, గురుదేవుడుగా పేరుకాంచారు. ఆయన వెళ్ళిపోయారు కాని భారతావనికి, ప్రపంచానికి శాశ్వతమైన ఖ్యాతిని మాత్రం మిగిల్చి పోయారు. ప్రపంచ రాజకీయాలు క్లిష్టమౌతున్న ఈ రోజు గురుదేవుని వంటి మహామహుడు ఎంతైనా అవసరం” – శ్రీ బాబూ రాజేంద్రప్రసాద్ |
కోడూరి లీలావతి
‘శ్రీ రవీంద్రనాథ్ టాగూర్ భారతదేశపు గొప్పకవి, కళాకారుడు, యాభైఏళ్ళు, అంతకు పైగా ఆయన గొప్ప అధ్యాపకుడుగా, గురుదేవుడుగా పేరుకాంచారు. ఆయన వెళ్ళిపోయారు కాని భారతావనికి, ప్రపంచానికి శాశ్వతమైన ఖ్యాతిని మాత్రం మిగిల్చి పోయారు. ప్రపంచ రాజకీయాలు క్లిష్టమౌతున్న ఈ రోజు గురుదేవుని వంటి మహామహుడు ఎంతైనా అవసరం” – శ్రీ బాబూ రాజేంద్రప్రసాద్
”భారత పునర్వికాశ విప్లవానికి టాగూర్ నాయకుడు. అటువంటి అపురూపమైన లక్షణాలు గల మహాకవిని కొన్ని తరాలుగా మనం పొందలేదు. అతడు గొప్ప ప్రవక్త. మన భావి ఆశయ సిద్ధికోసం ఆయన ఎన్నో సలహాలు ఇస్తూవుండేవాడు. కోట్ల కొద్ది విదేశీయులకు మన భారతదేశంపైనా, సంస్కృతిమీదా సదాభిప్రాయం, గౌరవభావం ఉన్నాయంటే కారణం ఆయన రచనలే. ఆయన ఆశయాల సిద్ధికోసం మనం కృషి చేయడమే యిక మనం ఆయనకు చూపించగల గౌరవం” అన్నారు : కాశీ విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్
”కవి ఎల్లకాలం జీవిస్తాడు. రేపటి” తరాల హృదయాల్లో మెలగుతాడు. ఇక టాగూర్ వంటి మహాకవుల సంగతి వేరే చెప్పాలా? ఆయన తన దేశాన్ని ఎంతగా ప్రేమించాడో అంతగా, తన శరీరంలోని ప్రతి నాడిలోనూ, తన ప్రతీ రక్తపు చుక్కలోనూ ప్రపంచ ప్రజలను అనంతంగా ప్రేమించాడు. అంతర్జాతీయ తత్వం ఆయన ముఖ్య సిద్ధాంతాలలో ఒకటి. ఆయన ప్రకృతిని ప్రేమించాడు, ఆ అందం ఏ దేశానిదైనా, ఏ ఖండానిదైనా విశాల హృదయంతో ఆయన ఆరాధించాడు. : శ్రీమతి సరోజనీ నాయుడు
———–