Share
పేరు (ఆంగ్లం)K.B Gopalam
పేరు (తెలుగు)కె.బి.గోపాలం
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరుకె.వి.నరసింహాచార్యులు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ6/16/1953
మరణం
పుట్టిన ఊరుమహబూబ్ నగర్ జిల్లా, యేనుగొండ గ్రామం
విద్యార్హతలుజంతుశాస్త్రంలో ఎం.ఎస్సీ
వృత్తిడిగ్రీ కళాశాలలో అధ్యాపకుడు
తెలిసిన ఇతర భాషలుఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, సంస్కృతం, తమిళ, కన్నడ, జర్మన్
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుసైన్స్ సంగతులు
మరికొన్ని సైన్స్ సంగతులు
ఇంకొన్ని సైన్స్ సంగతులు
విజ్ఞానప్రపంచం
మనం – మన ఆరోగ్యం
మీ ఆరోగ్యం
జంతువుల కథలు
సైన్స్ కబుర్లు
నిత్య జీవితంలో భౌతిక శాస్త్రం (2 భాగాలు)
పిల్లలకు ఫిజిక్స్
ఛార్లీ చాప్లిన్
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు1993లో విశాలాంధ్ర ప్రచురణాలయం వారి 40వ వార్షికోత్సవాల సందర్భంగా ఉత్తమ సైన్స్ రచయిత పురస్కారం.
2007లో జమ్మి శకుంతల స్మారక పురస్కారం.
2012లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే దూరదర్శన్ శాస్త్ర కార్యక్రమానికి ఉత్తమ ప్రయోక్తగా నంది పురస్కారం.
2012లో సంగీతప్రియ అవార్డు.
2014లో తెలంగాణ అవతరణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంచే సత్కారం.
ఇతర వివరాలుఇతడు ఆకాశవాణిలో విజ్ఞానపద్ధతి, మానవ వికాసం, ధ్వని, నిశ్శబ్దంలో ప్రేమనాదాలు, చొప్పదంటుప్రశ్నలు మొదలైన అనేక కార్యక్రమాలను రూపొందించాడు. దూరదర్శన్‌, జెమిని టీవి, ఈటీవి మొదలైన వాటికి ఎన్నో డాక్యుమెంటరీలను, కార్టూన్ ఫిల్ములను తెలుగులోనికి అనువదించాడు. ఆంధ్రకళావైభవం, ఆంధ్రనాట్యరీతులు మొదలైన టెలీ సీరియల్స్ వ్రాశాడు. ఈటీవి, ఈటీవి2 ఛానళ్లకు వేయికి పైగా ఎపిసోడులకు స్క్రిప్ట్ అందించాడు. హైదరాబాద్‌లోని బి.ఎం.బిర్లా ప్లానెటోరియం స్కై షోలకు స్క్రిప్ట్ వ్రాశాడు. కేవలం స్క్రిప్ట్ మాత్రమే అందించకుండా ఈటీవీ, జెమిని టీవీలలో కొన్ని కార్యక్రమాలకు నిర్మాతగా కూడా ఉన్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి బ్రహ్మోత్సవాలను ఈటీవీ ద్వారా ప్రసారం చేశాడు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికమెదడు – మనము
సంగ్రహ నమూనా రచనశరీరాన్ని జీవంతో కొనసాగించేది మెదడు. అందులోని వంద బిలియన్‌ కణాలు రకరకాల పనులు అన్నింటినీ నడిపిస్తాయి. ఊపిరితీయడం, గుండె కొట్టుకోవడం, రక్తంపోటు నుంచి మొదలు ఆకలి, దపిప్క, లైంగికత, చివరికి నిద్రదాకా అన్నీ మెదడు కారణంగానే జరుగుతాయి. అనుభవాలు, భావాలు, అవగాహనలు, ఆలోచనలు… అన్నీ మెదడు కారణంగానే పుడతాయి. అనీన& కలిసి మనకు ఒక నడవడిని ఏర్పాటు చేస్తాయి. చేసే పనులన్నింటికీ ఆదేశాలు మెదడునుంచే వస్తాయి. మనం ఉన్నామని, మనకు ఒక మెదడు ఉందని అర్థమయిందంటే, అది కూడా మెదడు కారణంగానే.

కె.బి.గోపాలం

మెదడు – మనము

 

శరీరాన్ని జీవంతో కొనసాగించేది మెదడు. అందులోని వంద బిలియన్‌ కణాలు రకరకాల పనులు అన్నింటినీ నడిపిస్తాయి. ఊపిరితీయడం, గుండె కొట్టుకోవడం, రక్తంపోటు నుంచి మొదలు ఆకలి, దపిప్క, లైంగికత, చివరికి నిద్రదాకా అన్నీ మెదడు కారణంగానే జరుగుతాయి. అనుభవాలు, భావాలు, అవగాహనలు, ఆలోచనలు… అన్నీ మెదడు కారణంగానే పుడతాయి. అనీన& కలిసి మనకు ఒక నడవడిని ఏర్పాటు చేస్తాయి. చేసే పనులన్నింటికీ ఆదేశాలు మెదడునుంచే వస్తాయి. మనం ఉన్నామని, మనకు ఒక మెదడు ఉందని అర్థమయిందంటే, అది కూడా మెదడు కారణంగానే.

మొత్తానికి మెదడు మిగతా శరీర భాగాల వంటిది కాదని, చాలా ప్రత్యేక మయినదని అర్థమయింది. ఈనాటికీ మెదడు గురించిన పరిశోధనలు మొత్తం రహస్యాలను విప్పి చెప్పలేకపోయాయి. అయినా మెదడు గురించి, అందులో జరగుతున్న మార్పుల ప్రభావాల గురిచి, ఆ రకంగా మనుషులలో కనిపిస్తున్న తీరు గురించి చాలానే తెలిసింది.

ప్రపంచమంతటా జీవశాస్త్రం, వైద్యం పరిశోధనలలో మెదడుగురించిన పరిశోధనలు చాలా విస్తృతంగా ఉంటున్నాయి. మెదడులో జరుగుతున్న మెరుపువేగం కరెంటు ప్రసారాల గురించి అర్థం చేసుకున్నారు. మెదడులోని కణాలు, వాటి మధ్య సంబంధాల గురించి కూడా తెలుసుకున్నారు. శరీరమంతా ఈ రకం కణాలు విస్తరించి ఉండి ఎప్పటికప్పుడు సమాచారాన్ని మెదడుకు పంపించే తీరను అర్థం చేసుకున్నారు. ఈ సమాచారం వెళ్లే దారులగురించి ఎంతో తెలిసింది. ఈ తతంగమంతా మన శరీరంలో నడుస్తున్నదని, కనుకనే మనం మనముగా ఉండ గలుగుతున్నామని అర్థం చేసుకుంటే గొప్ప ఆనందం కలుగుతుంది.

గోపాలం కె.బి.

———–

You may also like...