| పేరు (ఆంగ్లం) | Kuppa Venkata Krishnamurthi | 
| పేరు (తెలుగు) | కుప్పా వేంకట కృష్ణమూర్తి | 
| కలం పేరు | – | 
| తల్లిపేరు | – | 
| తండ్రి పేరు | – | 
| జీవిత భాగస్వామి పేరు | – | 
| పుట్టినతేదీ | – | 
| మరణం | – | 
| పుట్టిన ఊరు | – | 
| విద్యార్హతలు | మాస్టర్ డిగ్రీ | 
| వృత్తి | బ్యాంకు ఉద్యోగం | 
| తెలిసిన ఇతర భాషలు | – | 
| చిరునామా | – | 
| ఈ-మెయిల్ | – | 
| ఫోను | – | 
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – | 
| స్వీయ రచనలు | జైమిని భారతం ప్రవచనం,వేదాలలో వైజ్ఞానిక విశేషాలు | 
| ఇతర రచనలు | – | 
| ఈ-పుస్తకాల వివరాలు | http://www.anandbooks.com/Vedalalo-Vaignanika-ViseshaluKuppa-Venkata-Krishnamurthy | 
| పొందిన బిరుదులు / అవార్డులు | వేద పరిరక్షణతో పాటు ఆధ్యాత్మిక రంగానికి చేస్తున్న సేవలకు గాను 2002లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనను ఉగాది పురస్కారంతో సత్కరించింది. జ్ఞాన సరస్వతి పురస్కారం, కల్యాణ భారతి ప్రతిభా పురస్కారం, మహర్షి విజ్ఞాన పీఠం నుంచి జ్ఞాన కులపతి పురస్కారం, డాక్టర్ పైడి లక్ష్మయ్య ప్రతిభా పురస్కారం, తెలుగు విశ్వ విద్యాలయం నుంచి ధర్మనిధి పురస్కారంతో పాటు ఎన్నో పురస్కారాలు, సత్కారాలు అందుకున్నారు కుప్పా వేంకట కృష్ణమూర్తి. గురుదేవుల ఆదేశం మేరుకు ఐసర్వ్ సంస్థను ఏర్పాటు చేసి, వేదాల్లో ఉన్న అనంతమైన విజ్ఞానాన్ని ముందు తరాలకు అందించేందుకు వీరు చేస్తున్న కృషి అన్ని వర్గాల నుంచి అభినందనలు అందుకుంటోంది. | 
| ఇతర వివరాలు | భారతీయ వేదాలలో అన్నీవున్నాయి. అని అందరు అంటుంటారు. కాని వెలికి తీసి సామాన్య ప్రజలకు తెలియ జేయడాని కొందరు కృషి చేస్తుంటారు. వారిలో కుప్పా వేంకట కృష్ణమూర్తి గారు ఒకరు | 
| స్ఫూర్తి | – | 
| నమూనా రచన శీర్షిక | జైమిని భారతం ప్రవచనం | 
| సంగ్రహ నమూనా రచన | భారతదేశ ప్రజలకు జైమిని భారతం సుప్రసిద్ధమే అయినా, దీనిలో వున్న చిత్ర విచిత్ర కథా ప్రసంగాలకు ఉన్నంత ప్రసిద్ధి, దీనిలో వున్న భక్తి మార్గ – తత్త్వమార్గాల సమన్వయాలకు ఉన్నట్లు కనిపించదు. నేను చూసినంతలో దీనికి గల అనువాదాలు కూడా కథాతత్పరాలుగానే సాగాయి. | 
కుప్పా వేంకట కృష్ణమూర్తి
భారతదేశ ప్రజలకు జైమిని భారతం సుప్రసిద్ధమే అయినా, దీనిలో వున్న చిత్ర విచిత్ర కథా ప్రసంగాలకు ఉన్నంత ప్రసిద్ధి, దీనిలో వున్న భక్తి మార్గ – తత్త్వమార్గాల సమన్వయాలకు ఉన్నట్లు కనిపించదు. నేను చూసినంతలో దీనికి గల అనువాదాలు కూడా కథాతత్పరాలుగానే సాగాయి.
మహాభారతం సుప్రసిద్ధం. జైమిని భారతం ఎక్కడిది? అని మనం కొంచెం తెలుసుకోవలసి వున్నది.
జైమిని వ్యాసశిష్యుడైన మహాతపస్వి, మహామేధావి, మహాపండితుడు. ఎంతటి మహాత్ముడంటే, తన గురువైన వేదవ్యాసులవారే ఈయన్ని విష్ణుపురాణంలో – ”సామగోజైమిని: కవి:” అని మెచ్చుకున్నారు. అంటే సామవేదాధ్యయనం చేసిన మా జైమిని మంచి కవి అని గురువుగారే ఈయనకు మంచి సర్టిఫికెట్ ఇచ్చారు. ఈయన కేవలం సామవేదం ఒక్కటే చదువుకున్నాడని అనుకోకూడదు. ఆయన చతుర్వేదాలు, శిక్షాదిశాస్త్రాలు, సమస్తవిద్యలు ఆపోశనం పట్టిన మహామేధావి.
అయితే, జైమిని మహర్షి పేరు వినంగానే శాస్త్రాలు చదువుకున్న పండితులకి మీమాంసాశాస్త్రమే గుర్తు వస్తూవుంటుంది. ఎందుకంటే వేదోక్తమైన కర్మలను ఆచరించడం మాత్రమే మోక్షానికి ప్రధానమార్గమని ప్రబోధం చేసిన మీమాంసా శాస్త్రానికి మూలసూత్రాలను రచించిన మహానుభావుడు జైమిని మహర్షే.
ఆయన రాసిన జైమినీయ మీమాంసాసూత్రాలు ఎంత పవిత్రమైనవి, ఎంత గంభీరమైనవి అంటే, కుమారిలభట్టు అంతటివాడు వీరి సూత్రాలకు వ్యాఖ్యానం వ్రాశాడు. కుమారిల భట్టులవారు అంటే – శంకరాచార్యులవారు అద్వైతస్థాపన చేయడం కోసం ప్రపంచంలోకి వచ్చిన తరువాత, మొట్టమొదటగా కుమారిల భట్టువారు ఎక్కడ వున్నారో తెలుసుకొని, వారి దగ్గరికి వెళ్లి, వారితో వాదం చేసి, వారిచేత ఔను అనిపించుకొంటే గాని తన సిద్ధాంతానికి విలువ రాదు – అని ఎవరిని గురించైతే భావన చేశారో, అటువంటి విలువైన మహర్షి ఆయన. ఆ కుమారిలభట్టుల వారు ఈ జైమినీయ మీమాంసాసూత్రాల మీద అద్భుతమైన వ్యాఖ్యానం వ్రాశారు. దాన్నే శ్లోక వార్తికమని లేక తంత్రవార్తికమని అంటారు.
———–
 
					