నాగసూరి వేణుగోపాల్ (Nagasuri Venugopal)

Share
పేరు (ఆంగ్లం)Nagasuri Venugopal
పేరు (తెలుగు)నాగసూరి వేణుగోపాల్
కలం పేరు
తల్లిపేరునాగసూరి గౌరమ్మ
తండ్రి పేరుసంజీవయ్య
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ2/1/1961
మరణం
పుట్టిన ఊరుఅనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం,కొనతట్టుపల్లి
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుసైన్స్ వైతాళికులు
టీవీ ముచ్చట్లు
చానళ్ళ హోరు – భాష తీరు
చానళ్ల సందడి-టెక్నాలజీ హడావుడి
వార్తామాధ్యమాల విశ్వసనీయత
పర్యావరణం – సమాజం
ప్రకృతి – పర్యావరణం
ద్రావిడ శాస్త్రవేత్తలు
సైన్స్ వైతాళికులు
పాత్రికేయ పాళి
నార్లబాట
సమాచారం బాట – సంచలనాలవేట
మీడియానాడి
మీడియాస్కాన్
మీడియా వాచ్
సైన్స్ వాచ్
సాహితీవీక్షణం
నవతరానికి నార్ల
శాస్త్రం-సమాజం
అత్యున్నతకళారూపం సైన్స్
శ్రీపాద ప్రబుద్ధాంధ్ర పోరాటాలు (రెండు భాగాలు)(సంపాదకత్వం)
సైన్స్ ధృవతారలు
ప్రసారభాషగా తెలుగు(సంపాదకత్వం)
బుల్లితెర విశ్వరూపం
సామాజిక మార్పుకోసం విద్య(అనువాదం)
రేడియో-ఎఫ్.ఎమ్‌.రేడియో
సైన్స్ దృక్పథం
ఇండియా 2020(ఎ.పి.జె.అబ్దుల్ కలాం రచనకు అనువాదం)
విద్వాన్ విశ్వం (కేంద్రసాహిత్య అకాడెమీకి వ్రాసిన మోనోగ్రాఫ్)
శతవసంతసాహితీమంజీరాలు (సంపాదకత్వం)
వెలుగుజాడ(సంపాదకత్వం)
నేటికీ శ్రీపాద(సంపాదకత్వం)
పర్యావరణ శాస్త్రం
సాహితీవిరూపాక్షుడు విద్వాన్ విశ్వం (సంపాదకత్వం)
జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు (సంపాదకత్వం)
సాహితీస్పర్శ
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులునార్ల మెమోరియల్ అవార్డు
పరుచూరి రాజారాం అవార్డు
తాపీ ధర్మారావు స్మారక పురస్కారం 10.10.2009.
ఇతర వివరాలుడాక్టర్‌ నాగసూరి వేణుగోపాల్‌ 1961 ఫిబ్రవరి 1వ తేదీన అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం కొనతట్టుపల్లిలో జన్మించారు. ఆకావవాణి ఉన్నతాధికారిగా మూడు దశాబ్దాలుగా వివిధ కేంద్రాలలో పనిచేసిన వీరు ప్రస్తుతం తిరుపతి కేంద్రానికి సంచాలకులు. ప్రసిద్ధ రచయిత, ప్రముఖ మేధావి, మానవతావాది. ప్రజల నాడి తెలిసిన ఆకాశవాణి ప్రయోక్త.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికమన తెలుగు
సంగ్రహ నమూనా రచనఒక జాతి వ్యక్తిత్వాన్ని, అస్తిత్వాన్ని తెలిపేవి ఆ జాతి మాట్లాడే భాష, అనుసరించే సంప్రదాయం, సంస్కృతి. ఆ రకంగా మన తెలుగు జాతికి ప్రాచీనమైన, విశిష్టమైన భాషాసాంస్కృతిక చరిత్ర ఉంది. తెలుగు జాతి మూడువేల సంవత్సరాల నాటిదని, భాష రెండున్నర వేల సంవత్సరాల నాటిదని, దేశం రెండు వేల సంవత్సరాల నాటిదని, సాహిత్యం వేయి సంవత్సరాల నాటిదని విజ్ఞులు చెపుతున్నారు. ఇంతటి మహోన్నతమైన మన తెలుగు జాతి భాషా సంస్కృతులు కాలగతిలో అనేక చారిత్రిక సందర్భాలలో ఎన్నో ఆటుపోటులకు గురి అయింది.

మన తెలుగు

 -నాగసూరి వేణుగోపాల్

ఒక జాతి వ్యక్తిత్వాన్ని, అస్తిత్వాన్ని తెలిపేవి ఆ జాతి మాట్లాడే భాష, అనుసరించే సంప్రదాయం, సంస్కృతి. ఆ రకంగా మన తెలుగు జాతికి ప్రాచీనమైన, విశిష్టమైన భాషాసాంస్కృతిక చరిత్ర ఉంది. తెలుగు జాతి మూడువేల సంవత్సరాల నాటిదని, భాష రెండున్నర వేల సంవత్సరాల నాటిదని, దేశం రెండు వేల సంవత్సరాల నాటిదని, సాహిత్యం వేయి సంవత్సరాల నాటిదని విజ్ఞులు చెపుతున్నారు. ఇంతటి మ¬న్నతమైన మన తెలుగు జాతి భాషా సంస్కృతులు కాలగతిలో అనేక చారిత్రక సందర్భాలలో ఎన్నో ఆటుపోటులకు గురి అయింది.

 ఆధునిక కాలంలో పాశ్చాత్య సాహిత్య, సాంస్కృతిక ప్రభావంతో భారతదేశంలోని మిగతా భాషల మాదిరిగానే మన తెలుగు భాషలో కూడా అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. అందుకే భాష ప్రవహించే ఒక నదివంటిదన్నారు. పాత నీరు కొట్టుకొని పోయి, కొత్త నీరు వచ్చి చేరినట్లుగా, భాషలో పాత పదాలు మార్పుకు లోనై, కొత్త పదాలు వచ్చి చేరుతుంటాయి. ఇది ఒక రకంగా భాషాపదజాలాన్ని సుసంపన్నం చేస్తుంది.

 రేడియో మాధ్యమం చదువురాని వారికి కూడా విజ్ఞానాన్ని అందించే ఏకైక సాధనం. ఇది అందరికీ అందుబాటులో ఉండేది. దీని ద్వారా ప్రయోజనాత్మకమైన కార్యక్రమాలను రూపొందించి ప్రజలకు అందించాలనే సత్సంకల్పంతో అప్పట్లో హైదరాబాదు కేంద్రంలో పనిచేసిన డా. నాగసూరి వేణుగోపాల్‌, కె.పి. శ్రీనివాసన్‌ గార్లు ఈ మహత్తర కార్యక్రమాన్ని నిర్వహించారు. పరమ ప్రామాణికము, ప్రజోపయోగమైన ఈ ప్రసంగాలు సంకలన పరచి వెలువరిస్తే ఎంతో ఉపయుక్తమని ప్రస్తుత ఆకాశవాణి చెన్నై కేంద్రం ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌ డా.నాగసూరి వేణుగోపాల్‌ వీటిని పంపుతూ సూచించారు. భాషకు సంబంధించిన ఈ ప్రసంగాలు విషయ ప్రాధాన్యంతోపాటు విలువను కూడా కలిగి ఉన్నాయి.

———–

You may also like...