| పేరు (ఆంగ్లం) | Kondapi Muralikrishna | 
| పేరు (తెలుగు) | కొండపి మురళీకృష్ణ | 
| కలం పేరు | – | 
| తల్లిపేరు | వరలక్ష్మమ్మ | 
| తండ్రి పేరు | వెంకటప్పయ్య | 
| జీవిత భాగస్వామి పేరు | – | 
| పుట్టినతేదీ | 7/23/1963 | 
| మరణం | – | 
| పుట్టిన ఊరు | ప్రకాశం జిల్లా తాటాకులపాలెం | 
| విద్యార్హతలు | ఎమ్మెస్సీ డిగ్రీ | 
| వృత్తి | జీవిత భీమా సంస్థలో అసిస్టెంటుగా | 
| తెలిసిన ఇతర భాషలు | – | 
| చిరునామా | – | 
| ఈ-మెయిల్ | – | 
| ఫోను | – | 
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – | 
| స్వీయ రచనలు | ప్రతీక్ష ఏకలవ్య ఆనందభారతి సారస్వత మహేంద్రం వసంత విజయం | 
| ఇతర రచనలు | – | 
| ఈ-పుస్తకాల వివరాలు | – | 
| పొందిన బిరుదులు / అవార్డులు | అవధాన శిల్పి అవధాన కిరీటి | 
| ఇతర వివరాలు | కొండపి మురళీకృష్ణ కవి, గ్రంథరచయిత మరియు శతాధిక అవధానాలను ప్రదర్శించిన వ్యక్తి | 
| స్ఫూర్తి | – | 
| నమూనా రచన శీర్షిక | కొండపి మురళీకృష్ణ అవధానాలు | 
| సంగ్రహ నమూనా రచన | పూరణ: దివినీ భూస్థలి పైకిదింప తన పాతివ్రత్య మి మ్మవనిన్ బోధయొనర్పనెంచి యనసూయామాత చూపింప వై భవ విన్యాసము, శ్రీ రమాధవునితో వాగీశుతో గూడి శై శవమై పోయెను శివుండు పాడగ ప్రశంసాగీతముల్ దేవతల్ సమస్య: ముండాకోరు వసంతమున్ గనగ నిప్పుల్ గ్రక్కు చిత్తమ్మునన్ | 
కొండపి మురళీకృష్ణ అవధానాలు
ఇతడు అవధానాలలో పూరించిన పద్యాలు కొన్ని మచ్చుకు:
సమస్య:శవమై పోయెను శివుండు పాడగ ప్రశంసాగీతముల్ దేవతల్
పూరణ:
దివినీ భూస్థలి పైకిదింప తన పాతివ్రత్య మి
మ్మవనిన్ బోధయొనర్పనెంచి యనసూయామాత చూపింప వై
భవ విన్యాసము, శ్రీ రమాధవునితో వాగీశుతో గూడి శై
శవమై పోయెను శివుండు పాడగ ప్రశంసాగీతముల్ దేవతల్
సమస్య: ముండాకోరు వసంతమున్ గనగ నిప్పుల్ గ్రక్కు చిత్తమ్మునన్
పూరణ:
చండాంశు ప్రతిభా సమాన విలసత్ చంద్రుండు తా దాచె హృ
ద్భాండమ్మందు విషాద పావక మహాజ్వాలన్ సతిన్ బాసి పా
షండీ భూతము గాగ నీ ప్రకృతి, వాసంతంబ! రాబోకు రా
ముండా కోరు వసంతమున్ గనగ నిప్పుల్ గ్రక్కు చిత్తమ్మునన్
దత్తపది: సారా – కల్లు – చికెను – మటను అనే పదాలతో వాణీ స్తుతి.
పూరణ:
ఇంతి! నిన్ మనసార నుతింతునమ్మ
పూలకల్లును బోలు పదాలనిమ్మ
తలచి కెందమ్మి పూల పూజల నొనర్తు
చిమ్మటను నేను, కాంతులనిమ్మ వాణి
న్యస్తాక్షరి: మొదటి పాదము మొదటి అక్షరము కా రెండవ పాదము రెండవ అక్షరము ళీ మూడవ పాదము మూడవ అక్షరము దా నాలుగవ పాదము నాలుగవ అక్షరము సు.
పూరణ:
కాళీమాతయె విగ్రహాకృతిని ఆకాశమ్మునే డిగ్గుచున్
నాళీకంబులబోలు హస్తములతో నందించె నాశీస్సు నా
కాళీదాసుని బోలు సత్కవియె భక్తశ్రేష్ఠుడై యుంట నే
లీలన్ భాసుర రమ్యదృశ్యమును వర్ణింతున్ వధానమ్మునన్
———–
 
					 
																								 
																								