| పేరు (ఆంగ్లం) | Raavi Kondalarao | 
| పేరు (తెలుగు) | రావి కొండలరావు | 
| కలం పేరు | – | 
| తల్లిపేరు | – | 
| తండ్రి పేరు | – | 
| జీవిత భాగస్వామి పేరు | – | 
| పుట్టినతేదీ | – | 
| మరణం | – | 
| పుట్టిన ఊరు | సామర్లకోట | 
| విద్యార్హతలు | – | 
| వృత్తి | – | 
| తెలిసిన ఇతర భాషలు | – | 
| చిరునామా | – | 
| ఈ-మెయిల్ | – | 
| ఫోను | – | 
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – | 
| స్వీయ రచనలు | అనురాగం, అభిప్రాయం, అభిమాన పుస్తకం, అసంభవామి యుగేయుగే, ఆడదిక్కు, ఆత్మహత్య, ఆవు పులి, ఇదీ ఓ కథే, ఎదురుచూడని వరుడు | 
| ఇతర రచనలు | – | 
| ఈ-పుస్తకాల వివరాలు | – | 
| పొందిన బిరుదులు / అవార్డులు | – | 
| ఇతర వివరాలు | – | 
| స్ఫూర్తి | – | 
| నమూనా రచన శీర్షిక | రావి కొండలరావు | 
| సంగ్రహ నమూనా రచన | – | 
రావి కొండలరావు
రావి కొండలరావు నటుడు, దర్శకుడు, రచయిత, నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలి. 1932, ఫిబ్రవరి 11న సామర్లకోటలో జన్మించారు. తండ్రి పోస్టుమాస్టరు పదవీ విరమణ తర్వాత శ్రీకాకుళంలో స్థిరపడ్డారు. వీరి పూర్వీకులు శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు కావడంతో వీరు తండ్రి పదవీ విరమణ తర్వాత స్థిరపడ్డారు. ఈతనికి ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ ఇచ్చి గౌరవించింది. 1958లో ‘శోభ’ చిత్రంతో ఆయన సినీ నటన మొదలైంది. పాఠశాల చదువు కాకినాడలో. మద్రాసు ఆనందవాణి పత్రికలో సబ్ఎడిటర్ గా చేశారు. కొన్నాళ్ళు రమణగారింట్లో ఉన్నారు. కొన్నాళ్ళు కేరళ వెళ్ళి, ఒక మలయాళం సినిమాకు డబ్బింగ్ డైలాగులు రాశారు. నరసరాజుగారి సిఫార్సు ద్వారా కొండలరావుకు పొన్నలూరి బ్రదర్స్‌వారి సినీ సంస్థలో స్టోరీ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చింది. కామేశ్వరరావు సిఫార్సుతో శోభ సినిమాలో కొండలరావు సినీనటుడుగా తొలిసారి కనబడ్డాడు. ఆయనకు రాధాకుమారితో వివాహం అయింది. ఇద్దరూ తమిళ సినిమాలకు డబ్బింగ్ చెప్పేవారు. సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవస్థలు పడేకంటే వేషాలే వెయ్యరాదా అని ముళ్ళపూడి వెంకటరమణ అనేవారట. ఆదుర్తి సుబ్బారావు తీసిన ‘దాగుడుమూతలు’ సినిమాలో డాక్టరు వేషం లభించింది. విజయచిత్ర సినీ మాసపత్రికలో ఎడిటర్‌గా చేశారు. రాధాకుమారి గారు జన్మించినది విజయనగరంలో. ముందు ‘ముగ్గురు వీరులు’ సినిమాలో ఆమె డబ్బింగ్ చెప్పింది. కొండలరావు ఇంట్లోనే ఆమె తన తండ్రిగారితో వుండేది. అభిరుచులూ, వ్యాపకాలూ ఒకటే కావడంతో కొండలరావు, రాధాకుమారి ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. ఆమె తొలి చిత్రం తేనె మనసులు.
———–
 
					 
																								