| పేరు (ఆంగ్లం) | G. Nagayya | 
| పేరు (తెలుగు) | జి.నాగయ్య | 
| కలం పేరు | – | 
| తల్లిపేరు | – | 
| తండ్రి పేరు | – | 
| జీవిత భాగస్వామి పేరు | – | 
| పుట్టినతేదీ | – | 
| మరణం | – | 
| పుట్టిన ఊరు | – | 
| విద్యార్హతలు | – | 
| వృత్తి | – | 
| తెలిసిన ఇతర భాషలు | – | 
| చిరునామా | – | 
| ఈ-మెయిల్ | – | 
| ఫోను | – | 
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – | 
| స్వీయ రచనలు | ద్విపద వాఙ్మయము, తెలుగు కావ్యావతారికలు, ఎర్రన శ్రీనాథుల సూక్తి వైచిత్రి | 
| ఇతర రచనలు | – | 
| ఈ-పుస్తకాల వివరాలు | – | 
| పొందిన బిరుదులు / అవార్డులు | – | 
| ఇతర వివరాలు | – | 
| స్ఫూర్తి | – | 
| నమూనా రచన శీర్షిక | జి.నాగయ్య | 
| సంగ్రహ నమూనా రచన | – | 
జి.నాగయ్య
ఆచార్య జి.నాగయ్య (గూడూరు నాగయ్య) విశిష్ట పరిశోధకుడు, ఉత్తమ ఉపాధ్యాయుడు, ఆదర్శ ఆచార్యుడు. ఇతడు రచించిన తెలుగు సాహిత్య సమీక్ష గ్రంథం సాహిత్య చరిత్రలలో సమగ్రమైనదిగా, ప్రత్యేకమైనదిగా పేరు సంపాదించింది.ఇతడు 1936, జూలై 30వ తేదీన కడప జిల్లా, లింగాల మండలం, తాతిరెడ్డి పల్లె గ్రామంలో నారమ్మ, నాగప్ప దంపతులకు జన్మించాడు. ఇంటర్మీడియట్ విద్యను అనంతపురం ప్రభుత్వకళాశాలలో పూర్తిచేసి 1959-61లో తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. తెలుగు చదివాడు. ఎం.ఎ పూర్తి అయిన తర్వాత కడప ప్రభుత్వ కళాశాలలో రెండు సంవత్సరాలు అధ్యాపకుడిగా పనిచేశాడు. తర్వాత ఆచార్య పింగళి లక్ష్మీకాంతం పర్యవేక్షణలో ద్విపద వాజ్మయము అనే అంశంపై పరిశోధన చేశాడు. అనంతరం శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా, ఆచార్యుడిగా పనిచేశాడు. ఇతని పర్యవేక్షణలో అనేకమంది విద్యార్థులు పరిశోధనలు గావించి ఎం.ఫిల్., పి.హెచ్.డి పట్టాలు సంపాదించారు. ఇతని పర్యవేక్షణలో జరిగిన పరిశోధనలలో ఆంధ్ర మహాభారతంలో ధృతరాష్ట్రుని పాత్ర పరిశీలన (డి.రంగారెడ్డి), ఆంధ్ర మహాభారతంలో భీష్ముని పాత్ర చిత్రణము (పి.లలితావాణి), మహా భారతంలో విద్యావిధానం(ఆర్.మల్లేశుడు) మొదలైనవి ఉన్నాయి
———–
 
					