| పేరు (ఆంగ్లం) | Vasili Ramakrishna Sharma | 
| పేరు (తెలుగు) | వాసిలి రామకృష్ణశర్మ | 
| కలం పేరు | శార్వరి | 
| తల్లిపేరు | – | 
| తండ్రి పేరు | – | 
| జీవిత భాగస్వామి పేరు | యామినీదేవి | 
| పుట్టినతేదీ | 11/7/1929 | 
| మరణం | 12/12/2015 | 
| పుట్టిన ఊరు | గుంటూరు జిల్లా తెనాలి మండలం కోపల్లె గ్రామం | 
| విద్యార్హతలు | – | 
| వృత్తి | – | 
| తెలిసిన ఇతర భాషలు | – | 
| చిరునామా | – | 
| ఈ-మెయిల్ | – | 
| ఫోను | – | 
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – | 
| స్వీయ రచనలు | స్వర్గసీమ, ఎర్రభూతం, మమకారం | 
| ఇతర రచనలు | – | 
| ఈ-పుస్తకాల వివరాలు | – | 
| పొందిన బిరుదులు / అవార్డులు | – | 
| ఇతర వివరాలు | – | 
| స్ఫూర్తి | – | 
| నమూనా రచన శీర్షిక | వాసిలి రామకృష్ణశర్మ | 
| సంగ్రహ నమూనా రచన | – | 
వాసిలి రామకృష్ణశర్మ
శార్వరి (వాసిలి రామకృష్ణశర్మ) ప్రముఖ పాత్రికేయుడు. బహుముఖ ప్రజ్ఞాశాలి. కవిగా, పండితునిగా, కథారచయితగా, నవలాకారునిగా, వ్యాసకర్తగా, నాటకరచయితగా, అనువాదకుడిగా, బాలసాహితీవేత్తగా వెలుగొందాడు. శతాధిక గ్రంథకర్త.
వాసిలి రామకృష్ణశర్మ గుంటూరు జిల్లా తెనాలి మండలం కోపల్లె గ్రామంలో 1929, నవంబరు 7న పార్వతీశ్వరాచారి, ఈశ్వరమ్మ దంపతులకు జన్మించాడు[1]. విశ్వబ్రాహ్మణ కులస్తుడు. ఇతడు ప్రాథమిక విద్యను కోపల్లెలో పూర్తి చేసుకుని తెనాలిలో ఉన్నత పాఠశాల చదువు ముగించాడు. ఇంటర్మీడియట్, బి.ఎ.లను గుంటూరులోని ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో చదివాడు. 1952లో బి.ఎ.పట్టాను పొందాడు. ఆంగ్లభాషాసాహిత్యాలు బి.ఎ.లో ఇతని ఐచ్ఛికాంశాలు.
ఇతడు 1955లో యామినీదేవిని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు వసంతకుమార్, శ్యామ్‌సుందర్, రమణ అనే ముగ్గురు కుమారులు, పద్మప్రియ అనే కుమార్తె జన్మించారు.
బి.ఎ. పూర్తి అయిన తర్వాత ఇతడు 1952లో తెనాలిలోని వి.ఎన్.ఆర్ కళాశాలలో ఇంగ్లీషు ట్యూటర్‌గా చేరి 1958 వరకు పనిచేశాడు. ఇతని గంభీరోపన్యాసాలను విని అక్కడి విద్యార్థులు ఉత్తేజితులయ్యేవారు. అక్కడ పనిచేసే రోజుల్లో రావూరి భరద్వాజ, రాంషా, జి.వి.కృష్ణారావు, శారద మొదలైనవారు ఇతని మిత్రబృందంలో ఉన్నారు. కళాశాల విడిచిన తర్వాత జర్నలిజంలో ప్రవేశించాడు. 1958లో మద్రాసులోని ఆంధ్రప్రభలో చేరి దిన వార పత్రికలలో వివిధ హోదాలలో 30 సంవత్సరాలు పనిచేసి హైదరాబాదులో రిటైర్ అయ్యాడు. ఆంధ్రప్రభలో పనిచేసే రోజుల్లో విద్వాన్ విశ్వం, పిలకా గణపతిశాస్త్రి, కె.సభా, తిరుమల రామచంద్ర, తులికా భూషణ్, నండూరి పార్థసారథి మొదలైనవారు ఇతని సహోద్యోగులు.
ఇతడు ఆంధ్రప్రభ దినపత్రిక, ఆంధ్రప్రభ సచిత్రవారపత్రికల సంపాదకవర్గంలో వివిధ హోదాలలో పనిచేశాడు. దినపత్రికలో ఆదివారం అనుభంధాన్ని నిర్వహించాడు. కొంతకాలం చిత్రప్రభ శీర్షికను నడిపాడు. “వింతలు-విడ్డూరాలు” శీర్షిక ఇతనికి మంచిపేరు తెచ్చిపెట్టింది. ఉద్యోగ ధర్మంగా వేలకొలది రాజకీయ, శాస్త్ర సంబంధ, చలనచిత్ర వ్యాసాలను వ్రాసి ప్రకటించాడు. శార్వరి అనే కలంపేరుతోపాటుగా గురూజీ, కృష్ణ, శర్మ అనే పేర్లతో ఎన్నో గ్రంథసమీక్షలు, సినిమాసమీక్షలు చేశాడు. ఆంధ్రప్రభతో పాటుగా చిత్రప్రగతి, మహిళ, యోగమార్గం, యోగదర్శిని మొదలైన పత్రికలకు అడ్వైజరీ ఎడిటర్‌గా సేవలను అందించాడు. కొన్నినాళ్లు నెలవంక అనే పత్రికను నడిపాడు. సత్యసంహిత అనే పత్రికను కూడా నిర్వహించాడు.
———–
 
					 
																								 
																								