| పేరు (ఆంగ్లం) | Bommakanti Venkata Singaracharyulu | 
| పేరు (తెలుగు) | బొమ్మకంటి వేంకట సింగరాచార్య | 
| కలం పేరు | – | 
| తల్లిపేరు | – | 
| తండ్రి పేరు | – | 
| జీవిత భాగస్వామి పేరు | – | 
| పుట్టినతేదీ | – | 
| మరణం | – | 
| పుట్టిన ఊరు | – | 
| విద్యార్హతలు | – | 
| వృత్తి | – | 
| తెలిసిన ఇతర భాషలు | – | 
| చిరునామా | – | 
| ఈ-మెయిల్ | – | 
| ఫోను | – | 
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – | 
| స్వీయ రచనలు | విశ్వకవి రవీంద్రుని విశ్వమానవ మతం, గీతాంజలి గోపీ హృదయం, రచయితల స్వాతంత్ర్యం, తెనాలి రామకృష్ణుని పాండురంగం మహత్యం (పరిష్కరణ), క్రీడాభిరామము (పరిష్కరణ), బిల్హణీయము (సంపాదకత్వం – బాలాంత్రపు నళినీకాంతారావుతో కలిసి), సారంగు తమ్మయ్య వైజయంతీ విలాసము (సంపాదకత్వం – బాలాంత్రపు నళినీకాంతారావుతో కలిసి), ముద్దుపళని రాధికాస్వాంతనము (సంపాదకత్వం – బాలాంత్రపు నళినీకాంతారావుతో కలిసి) | 
| ఇతర రచనలు | – | 
| ఈ-పుస్తకాల వివరాలు | – | 
| పొందిన బిరుదులు / అవార్డులు | – | 
| ఇతర వివరాలు | – | 
| స్ఫూర్తి | – | 
| నమూనా రచన శీర్షిక | బొమ్మకంటి వేంకట సింగరాచార్య | 
| సంగ్రహ నమూనా రచన | – | 
బొమ్మకంటి వేంకట సింగరాచార్య
ఇతడు 1917, జనవరి 16వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా, ద్వారకా తిరుమలలో అళహా సింగరాచార్యులు మరియు సుభద్రమ్మ దంపతులకు జన్మించాడు. ఇతడు 16 యేళ్ల వయసులోనే పెంటపాడు గ్రామంలో ఒక గ్రంథాలయాన్ని, సాహిత్య సంస్థను స్థాపించి రాష్ట్రస్థాయి సాహితీ సమావేశాలను నిర్వహించాడు. తూర్పుగోదావరి జిల్లాలో భక్తి సిద్ధాంతాన్ని ప్రచారం చేసేందుకు 1934లో ఎక్కిరాల జగన్నాథాచార్యులతో కలిసి ఒక ఆశ్రమాన్ని నెలకొల్పాడు. 1940-50ల మధ్య ఏలూరులో సాహిత్య మండలి వ్యవస్థాపక కార్యదర్శిగా రాష్ట్రస్థాయిలో పెక్కు సాహిత్యసదస్సులను నిర్వహించాడు. మహాభాగవతాన్ని సమగ్ర వ్యాఖ్యానంతో 12 భాగాలుగా ఆంధ్రప్రజలకు అందించాలనే సదుద్దేశంతో ఒక సాహిత్యపీఠాన్ని స్థాపించాడు. ఇతడు అనేక గ్రంథాలను రచించాడు. కొన్ని గ్రంథాలను తెలుగులోనికి అనువదించాడు. కేంద్రప్రభుత్వం ఇతడిని చలనచిత్ర పురస్కార ప్రదాన నిర్ణాయకమండలిలో సభ్యునిగా నియమించి గౌరవించింది. ఇతడు సినిమా రంగంలో కూడా ప్రవేశించాడు. ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వం వహించిన సంసారం చిత్రానికి పాక్షికంగా సంభాషణలు వ్రాశాడు. అలాగే 1942లో ప్రారంభమై నిర్మాణం పూర్తి కాలేక పోయిన కష్టజీవి అనే సినిమాకు పూర్తిగా సంభాషణలు వ్రాశాడు. ఇతని సోదరుడు బొమ్మకంటి శ్రీనివాసాచార్యులుకూడా రచయితగా సుప్రసిద్ధుడు.
———–
 
					 
																								 
																								