| పేరు (ఆంగ్లం) | Deevee Ranganayhacharya | 
| పేరు (తెలుగు) | దీవీ రంగనాథాచార్య | 
| కలం పేరు | – | 
| తల్లిపేరు | రంగనాయకమ్మ | 
| తండ్రి పేరు | పెరుమాళ్ళాచార్యులు | 
| జీవిత భాగస్వామి పేరు | – | 
| పుట్టినతేదీ | 12/21/1914 | 
| మరణం | 06/26/2004 | 
| పుట్టిన ఊరు | గుంటూరు జిల్లా ముప్పవరం | 
| విద్యార్హతలు | – | 
| వృత్తి | – | 
| తెలిసిన ఇతర భాషలు | – | 
| చిరునామా | – | 
| ఈ-మెయిల్ | – | 
| ఫోను | – | 
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – | 
| స్వీయ రచనలు | మైడియర్ బాయ్, మైడ్రీమ్స్, నందికొండ గైడ్ ట్రూత్ అండ్ లవ్ అనే ఆంగ్ల గ్రంథా లతోపాటు విశ్వజనని ఈశ్వరమ్మ గ్రంధాన్ని కూడా రచించారు | 
| ఇతర రచనలు | – | 
| ఈ-పుస్తకాల వివరాలు | – | 
| పొందిన బిరుదులు / అవార్డులు | దేశబంధు | 
| ఇతర వివరాలు | – | 
| స్ఫూర్తి | – | 
| నమూనా రచన శీర్షిక | దీవీ రంగనాథాచార్య | 
| సంగ్రహ నమూనా రచన | – | 
దీవీ రంగనాథాచార్య
దీవీ రంగనాథాచార్య రచయిత, వైద్యుడు మరియు సంఘసేవకుడు..ఆయన వెల్దుర్తి డాక్టర్ గా సుపరిచితుడు.
దీవీ రంగనాథాచార్య పాత గుంటూరు జిల్లా ముప్పవరంలో 1914 డిసెంబరు 21 న పెరుమాళ్ళాచార్యులు, రంగనాయకమ్మ దంపతులకు రంగనాథాచార్య జన్మించారు. విజయవాడఆయుర్వేద కళాశా లలో వైద్య విద్వాన్, మద్రాసు ఆయుర్వేద కళా శాలలో ఎల్ఐఎం పట్టా పొందారు. మద్రాసు అడయార్ హాస్పటల్లో కొంతకాలం వైద్యు లుగా పనిచేశారు. గుంటూరు జిల్లా మాచెర్ల సమీపంలోని వెల్దుర్తి ప్రాథమిక వైద్యశాలలో మెడికల్ ఆఫీసర్గా చేరారు. పలనాడు ప్రాంతంలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు చేసిన సేవలకు గుర్తిం పగా నాటి ముఖ్యమంత్రి పీవీ నరసింహారావు దీవీ ఉద్యోగ కాలాన్ని రెండు సంవత్సరాలు అదనంగా పొడిగించారు. ఉన్నత ఉద్యోగాల అవకా శాలు వచ్చినా పలనాడు ప్రజలకు సేవ చేయటానికి వాటిని తిరస్కరిం చారు. దీవీ రచించిన అవర్ రిపబ్లిక్ డే గ్రంధాన్ని చదివిన ప్రధాని నెహ్రూ ఆయనను అభినందిస్తూ లేఖ రాశారు. 1957లో మాచర్ల సమితి ఉపాధ్య క్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నాటి రాష్రపతి వీవీ గిరి వెలుర్తిలోని దీవీ గృహాన్ని సందర్శించడంతోపాటు స్వయంగా తన కారులో శ్రీశైలానికి తీసుకుని వెళ్లారు. మాచర్ల ప్రజలు దీవీకి దేశబంధు బిరుదు పురస్కారం తోపాటు పౌరసన్మానం చేశారు. వెలుర్తిలో ఆసుపత్రి, హైస్కూల్, గ్రంథా లయం, పశువుల ఆస్పత్రి, ఎస్సీ కాలనీల నిర్మాణాన్ని చేపట్టారు. మైడియర్ బాయ్, మైడ్రీమ్స్, నందికొండ గైడ్ ట్రూత్ అండ్ లవ్ అనే ఆంగ్ల గ్రంథా లతోపాటు విశ్వజనని ఈశ్వరమ్మ గ్రంధాన్ని కూడా రచించారు. 2004 జూన్ 26న రంగనాథాచార్య అస్తమించారు.
———–
 
					 
																								