| పేరు (ఆంగ్లం) | Kakarla Kondalarao | 
| పేరు (తెలుగు) | కాకర్ల కొండలరావు | 
| కలం పేరు | – | 
| తల్లిపేరు | – | 
| తండ్రి పేరు | – | 
| జీవిత భాగస్వామి పేరు | – | 
| పుట్టినతేదీ | 01/01/1907 | 
| మరణం | – | 
| పుట్టిన ఊరు | పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం | 
| విద్యార్హతలు | – | 
| వృత్తి | – | 
| తెలిసిన ఇతర భాషలు | – | 
| చిరునామా | – | 
| ఈ-మెయిల్ | – | 
| ఫోను | – | 
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – | 
| స్వీయ రచనలు | తపతీసంవరణము (ఆరు అంకాల నాటకము), ప్రసన్నరాఘవము, అభిజ్ఞాన శాకుంతలము, బ్రహ్మవైవర్తమహాపురాణము | 
| ఇతర రచనలు | – | 
| ఈ-పుస్తకాల వివరాలు | – | 
| పొందిన బిరుదులు / అవార్డులు | – | 
| ఇతర వివరాలు | – | 
| స్ఫూర్తి | – | 
| నమూనా రచన శీర్షిక | కాకర్ల కొండలరావు | 
| సంగ్రహ నమూనా రచన | – | 
కాకర్ల కొండలరావు
కాకర్ల కొండలరావు ప్రసిద్ధుడైన శతావధాని, రచయిత, ఆశుకవి. ఇతడు చిలకమర్తి లక్ష్మీనరసింహం గారికి చూపు సన్నగిల్లినప్పుడు ఆయనకు లేఖకుడుగా పనిచేశాడు.
ఇతడు 1907వ సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురంలో జన్మించాడు. స్వయంకృషితో సంస్కృతాంధ్రాలలోని కావ్యాలు, నాటకాలు అధ్యయనం చేశాడు. ఇతను 200లకు పైగా అష్టావధానాలు, శతావధానాలు చేశాడు. కాని 1930లో చేసిన ఏలూరు శతావధానము, 1936లో చేసిన సంపూర్ణ శతావధానము మాత్రమే రికార్డు అయ్యాయి.
సమస్య: మరణముఁ గోర వచ్చినది మానిని నీ వెటు లాదరింతువో
పూరణ:
సరసుడ వంచు సూనశరశాస్త్రవరిష్ఠుడవంచు పండితా
భరణుఁడ వంచు సన్మధుర వాక్చతురత్వయుతుండవంచు భా
సుర నవయౌవన స్ఫురిత సుందరగాత్రుడవం చెఱింగి కా
మ రణముఁ గోర వచ్చినది మానిని నీ వెటు లాదరింతువో
సమస్య: తల చేతులలోననుండు దలప జగంబుల్
పూరణ:
కలస్థావర జంగమ జం
తులఁబుట్టింపంగఁ బెంప ద్రుంపంగ సమ
ర్థులగుట ముగురమ్మల నే
తల చేతులలోననుండు దలప జగంబుల్
సమస్య: పాలను దునియలుగజేసె బటు భల్లమునన్
పూరణ:
చాలగద్రావి యొకండమి
మిత్రాళి వధింపంగ నేగి యా సదనముల
న్వ్రేలెడు ఛాయాపటరూ
పాలను దునియలుగజేసె బటు భల్లమునన్
దత్తపది: హర్షము – కర్షక – శీర్షము – వర్ష అనే పదాలతో ఋతువర్ణన.
పూరణ:
హర్షముతోడ బర్హి నిచయంబులు నాట్యములం బొనర్పగా
గర్షక బృందముల్ గెరలి క్రన్నన నాగలులం గ్రహింపగా
శీర్షములెత్తి యధ్వగుల చేడెలు మేఘునిగాంచి పొంగగా
వర్ష ఘటిల్లి మేదినికిఁబందువుఁగూర్చె నికేమి చెప్పుదున్
వర్ణన: శతావధానము వలన ప్రయోజనములు
పూరణ:
విద్యాతత్వము గొంతయైన దెలియున్ బెంపౌ ముదంబబ్బు వి
ద్వద్యోధ ప్రజ శక్తియిట్టిదని సంభావింప నొప్పున సమ
గ్రోద్యోగంబు కళావిబోధ కొఱకై యొప్పారు గేళీరమాం
చద్యోగంబు శతావధానకలనన్ సంధిల్లు శ్రోతాళికిన్
———–
 
					 
																								 
																								