| పేరు (ఆంగ్లం) | Manchana | 
| పేరు (తెలుగు) | మంచన | 
| కలం పేరు | – | 
| తల్లిపేరు | – | 
| తండ్రి పేరు | – | 
| జీవిత భాగస్వామి పేరు | – | 
| పుట్టినతేదీ | క్రీ శ. 1300 | 
| మరణం | – | 
| పుట్టిన ఊరు | గుంటూరు జిల్లా రేపల్లె తాలూకాలోని చందవోలు | 
| విద్యార్హతలు | – | 
| వృత్తి | – | 
| తెలిసిన ఇతర భాషలు | – | 
| చిరునామా | – | 
| ఈ-మెయిల్ | – | 
| ఫోను | – | 
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – | 
| స్వీయ రచనలు | కేయూరబాహు చరిత్ర | 
| ఇతర రచనలు | – | 
| ఈ-పుస్తకాల వివరాలు | – | 
| పొందిన బిరుదులు / అవార్డులు | – | 
| ఇతర వివరాలు | – | 
| స్ఫూర్తి | – | 
| నమూనా రచన శీర్షిక | మంచన | 
| సంగ్రహ నమూనా రచన | క. తన యిష్టసఖుని విద్య జ్జన మాన్యుని నుభయకావ సరణిజ్ఞని మం చన నామదేయు నన్నుం గనుగొని యిట్లనిఎ వినయ, గౌరవ మెసగల్. | 
మంచన
కేయూర బాహుచరిత్రము ఒక రసవత్తరమైన ప్రబంధము. నాలుగశ్వాసములతో నున్న ఈ గ్రంథాన్ని మంచన అను కవి రచించి నండూరి గుండమత్రి అంకిత మిచ్చెను. మంచన తన గ్రంథంలో తన గురుంచి ఏమియును చెప్పుకొన లేదు. కనుక అతని కులము, గోత్రము, ఎక్కడ నివసించిన వాడో తెలుసుకొనుట కష్టము. సాధారణంగా కవులందరూ తమ గ్రంథ అవతారికలో గాని, ఆశ్వాసాంతములో గాని తమ గురించి, తమ కుల గోత్రాల గురించి చెప్పుకొనుట సాంప్రదాయం. దాని వలన అయా కవుల వివరాలు తెలుస్తాయి. కానీ మంచన మాత్రము, కారణమేమైనా… అటువంటి వివరాలను పూర్తిగా విస్మరించారు. ఈ కావ్యంలో తన పేరును మాత్రము ప్రస్తావించిన రెండుసందర్భాలు మాత్రము ఉన్నాయి.
క. తన యిష్టసఖుని విద్య
జ్జన మాన్యుని నుభయకావ సరణిజ్ఞని మం
చన నామదేయు నన్నుం
గనుగొని యిట్లనిఎ వినయ, గౌరవ మెసగల్.
మరియు అశ్వాసాంతములో….. ఇది సకలజన విధేయ ప్రణీతంబైన కేయూరబాహుచరిత్రం బను మహా ప్రబంధము నందు ……….. అని మాత్రమే వ్రాసుకొన్నాడు.
కనుక ఈ కవి పేరు తప్ప తక్కిన వివరాలు తెలియకున్నవి. కృతి భర్త యగు గుండన మంత్రి ధనద పుర నివాసి యగుట వలన…. మంచన కీతడు యిష్ట సఖుడగుటను బట్టి మంచన కూడా ఆ ప్రాంతము వాడై వుండును. మంచన, తన కృతి భర్థ గురుంచి మాత్రము చాల విషయాలను చర్చించారు. వాటి ఆధారముగా కవి కాలాదులను నిర్ణయించడానికి చాల మంది లాక్షనికులు పలు విధాల ప్రయత్నించారు.
———–
 
					 
																								 
																								