| పేరు (ఆంగ్లం) | Nannechodudu |
| పేరు (తెలుగు) | నన్నెచోడుడు |
| కలం పేరు | – |
| తల్లిపేరు | శ్రీ సతి |
| తండ్రి పేరు | చోడబల్లి |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | కన్నడ, తమిళ |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | కుమారసంభవం |
| ఇతర రచనలు | కళావిలాసము |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | కవిరాజశిఖామణి |
| ఇతర వివరాలు | నన్నెచోడుడు 12 వ శతాబ్దానికి చెందిన కవి. ఎంతో ప్రసిద్ధి గాంచిన కుమార సంభవమును రచించిన మహా కవి. తద్వారా ఈయన మొదటి శైవ కవి అయినాడు. సంస్కృతంతో పాటు కన్నడ, తమిళ పదాలను తెలుగు సాహిత్యంలో చేర్చి అనేక పద ప్రయోగాలను చేసాడు. |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | నన్నెచోడుడు |
| సంగ్రహ నమూనా రచన | – |
నన్నెచోడుడు
నన్నెచోడుడు 12 వ శతాబ్దానికి
చెందిన కవి. ఎంతో ప్రసిద్ధి గాంచిన
కుమార సంభవమును రచించిన
మహా కవి. తద్వారా ఈయన మొదటి
శైవ కవి అయినాడు. సంస్కృతం తో
పాటు కన్నడ, తమిళ పదాలను
తెలుగు సాహిత్యంలో చేర్చి అనేక
పద ప్రయోగాలను చేసాడు.
కాలం
తెలుగు సాహిత్యరంగంలో
నన్నెచోడుని కాలనిర్ణయం చాలా
వివాదాస్పదమైంది. చిలుకూరి
వీరభద్రరావు క్రీ.శ.925-40
మధ్యకాలంలోని వారని వ్రాశారు.
ఆయన పద్యాన్నొకదాన్ని
ఆధారం చేసుకుని నన్నయకు
వందయేళ్ళ మునుపే ఆంధ్రకవిత
వర్ధిల్లుతోందని వ్రాశారు. ఐతే
నన్నెచోడుడు నన్నయకన్నా
ప్రాచీనుడు అనేందుకు వీలుచిక్కే
పద్యానికి పలు పాఠాంతరాలు
ఉండడం, వాటికి మూలమైన ప్రతి
యేదో దాని ప్రామాణ్యమేదో
తెలియరాకపోవడంతో నన్నయకన్నా
ప్రాచీనుడనే వాదనలు నిలువట్లేదని
వేటూరి ప్రభాకరశాస్త్రి
నిర్ధారించారు. 12వ శతాబ్దికి చెందిన
సోమనాథుని కవిత్వం,
కుమారసంభవాలలో చాలా దగ్గర
పోలికలున్న పద్యాలు
కనిపిస్తున్నాయి.
———–