| పేరు (ఆంగ్లం) | Uppala Lakshmanarao | 
| పేరు (తెలుగు) | ఉప్పల లక్ష్మణరావు | 
| కలం పేరు | – | 
| తల్లిపేరు | – | 
| తండ్రి పేరు | – | 
| జీవిత భాగస్వామి పేరు | మెల్లీ | 
| పుట్టినతేదీ | 1/1/1898 | 
| మరణం | 1/1/1985 | 
| పుట్టిన ఊరు | ఒడిషా రాష్ట్రంలోని బరంపురం | 
| విద్యార్హతలు | – | 
| వృత్తి | – | 
| తెలిసిన ఇతర భాషలు | – | 
| చిరునామా | – | 
| ఈ-మెయిల్ | – | 
| ఫోను | – | 
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – | 
| స్వీయ రచనలు | బతుకు పుస్తకం, అతడు-ఆమె | 
| ఇతర రచనలు | – | 
| ఈ-పుస్తకాల వివరాలు | – | 
| పొందిన బిరుదులు / అవార్డులు | – | 
| ఇతర వివరాలు | – | 
| స్ఫూర్తి | – | 
| నమూనా రచన శీర్షిక | ఉప్పల లక్ష్మణరావు | 
| సంగ్రహ నమూనా రచన | ఉప్పల లక్ష్మణరావు నవల రచయితగా, అనువాదకునిగా సుప్రసిద్ధుడు. ఆయన నేటి ఒడిషా రాష్ట్రంలోని బరంపురంలో 1898లో జన్మించారు.  ఉప్పల లక్ష్మణరావు కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని వ్యక్తిగతంగా నమ్మి తదనుగుణమైన కృషి సాగించారు.  | 
ఉప్పల లక్ష్మణరావు
ఉప్పల లక్ష్మణరావు నవల రచయితగా, అనువాదకునిగా సుప్రసిద్ధుడు. ఆయన నేటి ఒడిషా రాష్ట్రంలోని బరంపురంలో 1898లో జన్మించారు.
ఉప్పల లక్ష్మణరావు కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని వ్యక్తిగతంగా నమ్మి తదనుగుణమైన కృషి సాగించారు. మాస్కోలో ప్రగతి ప్రచురణాలయంలో రష్యన్ సారస్వాన్ని అనువదించారు. రష్యన్-తెలుగు నిఘంటువు తయారుచేశారు. వీరు స్విట్జర్లాండ్ కు చెందిన మహిళ మెల్లీని వివాహం చేసుకున్నారు. రష్యా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చాకా బరంపురంలో “వికాసం” అనే సాహిత్యసంస్థతో అనుబంధాన్ని కొనసాగిస్తూ 1985లో మరణించారు.
లక్ష్మణరావు “అతడు-ఆమె” నవల రచన ద్వారా తెలుగు నవల రంగంలో కీర్తిని ఆర్జించారు. మూడు భాగాలుగా ఉండే ఈ నవల భారతస్వాతంత్ర్య పోరాటాన్ని చిత్రీకరించే చారిత్రిక నవల. ఈ నవల పాఠకుల ఆదరణతో పాటుగా విమర్శకుల ప్రశంసలు కూడా పొంది లక్ష్మణరావును రచయితగా సుపరిచితుల్ని చేసింది.
లక్ష్మణరావు “బతుకు పుస్తకం” పేరిట తన ఆత్మకథను రచించారు. ఉద్యోగబాధ్యతల్లో భాగంగా రష్యాలో దాదాపు 40 రష్యన్ గ్రంథాలను సరళమైన తెలుగులోకి అనువాదం చేశారు
ఉప్పల లక్ష్మణరావు రచించిన “అతడు-ఆమె” నవలను పలు సాహితీసంస్థలు, పత్రికలు విడుదల చేసిన “చదవవలసిన తెలుగు పుస్తకాల జాబితా”ల్లో చోటుచేసుకుంది. మాలతీచందూర్ వంటి సాహితీవేత్తలు వివిధ శీర్షికల్లో ఈ పుస్తకాన్ని పాఠకులకు పరిచయం చేశారు. చారిత్రిక నవలగా, నవలగా తెలుగు నవలా వికాసంలో కీలకమైన రచనగా “అతడు-ఆమె” తద్వారా గ్రంథకర్త ఉప్పల లక్ష్మణరావు సాహిత్యచరిత్రలో స్థానం సంపాదించారు.
———–