| పేరు (ఆంగ్లం) | Vedantam Narasimhareddy | 
| పేరు (తెలుగు) | వేదాంతం నరసింహారెడ్డి | 
| కలం పేరు | – | 
| తల్లిపేరు | సుబ్బమ్మ | 
| తండ్రి పేరు | నంజుదరెడ్డి | 
| జీవిత భాగస్వామి పేరు | – | 
| పుట్టినతేదీ | 5/1/1911 | 
| మరణం | – | 
| పుట్టిన ఊరు | తలమర్ల – సత్యసాయి తా. అనంతపురం జిల్లా | 
| విద్యార్హతలు | – | 
| వృత్తి | – | 
| తెలిసిన ఇతర భాషలు | – | 
| చిరునామా | – | 
| ఈ-మెయిల్ | – | 
| ఫోను | – | 
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – | 
| స్వీయ రచనలు | పల్లెజీవితము, వసంతకానుక | 
| ఇతర రచనలు | – | 
| ఈ-పుస్తకాల వివరాలు | – | 
| పొందిన బిరుదులు / అవార్డులు | – | 
| ఇతర వివరాలు | – | 
| స్ఫూర్తి | – | 
| నమూనా రచన శీర్షిక | వేదాంతం నరసింహారెడ్డి | 
| సంగ్రహ నమూనా రచన | అనంతపురం జిల్లాలోని తలమర్ల గ్రామములో పుట్టిన కవికుమారు లందరూ ప్రకృతిమాత ఒడిలో పెరిగి పెద్దవారైనవారే. మధురకవి బెళ్ళూరి తలమర్ల కళానిధి వేదాంతం నరసింహారెడ్డి మువ్వూరూ ఆ ప్రకృతిమాత అనుంగుబిడ్డలే. మధురకవి బెళ్ళూరి వారి స్నేహమువల్ల వేదాంతం నరసింహారెడ్డి కవితా కన్య వలపునబడి, స్వయం కృషితో కవిత్వము నభ్యసించి కృతకృత్యులైరి. | 
వేదాంతం నరసింహారెడ్డి
అనంతపురం జిల్లాలోని తలమర్ల గ్రామములో పుట్టిన కవికుమారు లందరూ ప్రకృతిమాత ఒడిలో పెరిగి పెద్దవారైనవారే. మధురకవి బెళ్ళూరి తలమర్ల కళానిధి వేదాంతం నరసింహారెడ్డి మువ్వూరూ ఆ ప్రకృతిమాత అనుంగుబిడ్డలే. మధురకవి బెళ్ళూరి వారి స్నేహమువల్ల వేదాంతం నరసింహారెడ్డి కవితా కన్య వలపునబడి, స్వయం కృషితో కవిత్వము నభ్యసించి కృతకృత్యులైరి.
పుట్టింది రెడ్ల వంశములో, పెరిగింది జనపదములో, చేపట్టింది కర్షకవృత్తి. అట్టి వాతావరణములో పెరిగిన మన నరసింహారెడ్డి కవిత్వం కూడా అదే వాతావరణంలోనే చొచ్చుకొనిపోయింది. ‘‘ఉదయిని’’ అనుపేర ఐదు భాగములుగా వీరు వ్రాసిన చిన్న ఖండకావ్యములలోని ప్రతి పద్యము ప్రకృతి సౌందర్యంతో నిండివుంది. ‘‘సనాతన, ఆధునాతన వల్ల సమీకరణలో సారము దీయగల నేర్పరులు వీరు.’’
వీరి ఉదయిని చతుర్థ గుచ్ఛమునందు ‘‘పల్లెజీవితము’’ అను ఖండికలో – పల్లెలందు సాయం సంధ్యాకాల మెట్లుండునో కనులకు కట్టినట్లు వర్ణించినారు. దానిని కొంత ఈ క్రింది పద్యములో చూచెదముగాక.
చెరగుబిగించి, వెండ్రుకలుజీరగ పైటదొలంగి పోయినన్
నెఱుగని పల్లెటూరి పనికేగిన ప్రాయపు టందకత్తెలే
యరిగిరి సాంధ్యకాంతు లలమన్ గృహకృత్యముదీర్చు కాంక్షతో
కరము ప్రియోక్తులాడుచు వికావిక నవ్వుచు సౌరుగుల్కుచున్
రెడ్డిగారి పెక్కురచనలు సుబోధిని, సాధన, ఆంధ్రప్రభ, గృహలక్ష్మి, రేనాడు, ఆంధ్రపత్రిక మొదలైన పత్రికలందు వెలుగుచూచినవి. తమకున్న సాహిత్యాభిమానంకొద్ది తలమర్ల లోనే సారస్వత సమితిని స్థాపించి, దానికి అధ్యక్షులైరి. ప్రతి సంవత్సరం ఉగాది – దసరా – సంక్రాంతి కానుకలుగా చిన్న పుస్తకములను ప్రచురింపబూనిరి. 1948లో ‘‘వసంతకానుక’’ యను చిన్ని సంకలనము మాత్రము విడుదల చేసిరి.
1) ముక్తికావ్యము, 2) శ్రీసుందరుని ఆత్మబోధామృతము, 3) అన్నపూర్ణకుమారి, 4) నరసింహయోగి శతకము, 5) హృదయార్పణము, 6) పరిపూర్ణానందము (వచనము), 7) బ్రహ్మజ్ఞాని (వచనాకావ్యము) వీరి అముద్రితకృతులు.
రెడ్డిగారు ‘‘శ్రీసాయి స్మరణామృతము’’ నందు శ్రీసాయి బాబాగారిని గూర్చి యిట్లు ప్రార్థించిరి.
నిన్నుధ్యానింతు నీలోన నిమిడిపోవ
ఆత్మ తత్త్వంబు నందేల ననుదినంబు
ప్రేమరాజ్యంబు నేలంగ పెడకుదోని
బుద్ధి దయచేయు శ్రీసాయి పొంగి తలతు.
కవిగారికి శ్రీసాయినాథుని కరుణాకటాక్షములు ప్రాప్తించుగాక.
రాయలసీమ రచయితల నుండి…
———–
 
					