| పేరు (ఆంగ్లం) | Panyam Lakshminarasaiah | 
| పేరు (తెలుగు) | పాణ్యం లక్ష్మినరసయ్య | 
| కలం పేరు | – | 
| తల్లిపేరు | సుబ్బలక్ష్మమ్మ | 
| తండ్రి పేరు | పాణ్యం లక్ష్మినరసయ్య | 
| జీవిత భాగస్వామి పేరు | – | 
| పుట్టినతేదీ | 4/6/1920 | 
| మరణం | 1/1/1979 | 
| పుట్టిన ఊరు | కర్నూల్ జిల్లా – కోయిల కుంట్ల తాలూకా. ఉయ్యాలవాడ | 
| విద్యార్హతలు | – | 
| వృత్తి | – | 
| తెలిసిన ఇతర భాషలు | – | 
| చిరునామా | – | 
| ఈ-మెయిల్ | – | 
| ఫోను | – | 
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – | 
| స్వీయ రచనలు | శ్రీ గురుస్తోత్రమాల | 
| ఇతర రచనలు | – | 
| ఈ-పుస్తకాల వివరాలు | – | 
| పొందిన బిరుదులు / అవార్డులు | – | 
| ఇతర వివరాలు | – | 
| స్ఫూర్తి | – | 
| నమూనా రచన శీర్షిక | పాణ్యం లక్ష్మినరసయ్య | 
| సంగ్రహ నమూనా రచన | వీరు శ్రీ పాణ్యం లక్ష్మినరసింహయ్యగారి అన్న కుమారులు. పాణ్యం నరసరామయ్యతో కలసి ‘‘పాణ్యం సోదరులు’’గా వాసికెక్కినవారు. వెల్దుర్తి వీరి జన్మస్థలము. చిన్నతనము నుండియే, కవిత్వమల్లెడి అభ్యాసము వీరి కలవడినది. సోదరుడు నరసరామయ్యతో వీరికి కుదిరిన సఖ్యముతో, ఈ ఇద్దరి హృదయము లేకమైనవి. ‘‘వీరి భావములు పూర్తిగా తెలిసికొన లేనంతగా నైక్యమైపోయినవి.’’ అందుకు ‘‘ప్రధాత రేఖలు’’ ఖండ కావ్యమే సాక్షి. వీరి స్వతంత్ర రచన ‘‘శ్రీ గురుస్తోత్రమాల’’ ఇందు వీరి రచనా విధానమిట్లు సాగినది. | 
పాణ్యం లక్ష్మినరసయ్య
వీరు శ్రీ పాణ్యం లక్ష్మినరసింహయ్యగారి అన్న కుమారులు. పాణ్యం నరసరామయ్యతో కలసి ‘‘పాణ్యం సోదరులు’’గా వాసికెక్కినవారు. వెల్దుర్తి వీరి జన్మస్థలము. చిన్నతనము నుండియే, కవిత్వమల్లెడి అభ్యాసము వీరి కలవడినది. సోదరుడు నరసరామయ్యతో వీరికి కుదిరిన సఖ్యముతో, ఈ ఇద్దరి హృదయము లేకమైనవి. ‘‘వీరి భావములు పూర్తిగా తెలిసికొన లేనంతగా నైక్యమైపోయినవి.’’ అందుకు ‘‘ప్రధాత రేఖలు’’ ఖండ కావ్యమే సాక్షి. వీరి స్వతంత్ర రచన ‘‘శ్రీ గురుస్తోత్రమాల’’ ఇందు వీరి రచనా విధానమిట్లు సాగినది.
సందేహమ్ములు వాయుచోటు; మదులన్ సద్వాసనాదివ్యముల్
మందారమ్ములు విచ్చుచోట; తొలగన్ మాలిన్య విక్షేపముల్
దెందమ్ముల్, నిలుపొందుచోట; పరిపాటిన్నిత్యమాధుర్యమా
నందం బయ్యది పొంగుచోటు; బుధగణ్యా నీ పదధ్యానమే.
ఇంతటి చక్కని రచనను వ్రాయగలిగిన ప్రతిభాశాలురైన వీరు మరితర పొత్తములేవియు వ్రాసినట్లు లేదు. ఒక్క కండకావ్యము మాత్రమే ‘‘పాణ్యం సోదరులు’’ జంగటా కలిపి వ్రాసినది. తరువాత జంటగా రచనలు సాగించినట్లు లేదు. ఏమైననూ పాణ్యం సోదరులు తమ కవిత్వము ‘పిల్లకవిత్వము’ కాదని ‘‘మేల్ హోయల్ గల కవిత్వ విలాసము’’ని నిరూపించిరి.
రాయలసీమ రచయితల నుండి….
———–
 
					 
																								 
																								