| పేరు (ఆంగ్లం) | Chakrala Nrusimha Kavi |
| పేరు (తెలుగు) | చక్రాల నృసింహ కవి |
| కలం పేరు | – |
| తల్లిపేరు | వెంకమాంబ |
| తండ్రి పేరు | భాస్కరప్ప |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 1/1/1885 |
| మరణం | – |
| పుట్టిన ఊరు | గుత్తి పట్టణము – అనంతపురం జిల్లా |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | సింహావలోకనము, సౌందర్య చక్రధరీయమను, శ్రీమయూరధ్వజోపాఖ్యానము |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | చక్రాల నృసింహ కవి |
| సంగ్రహ నమూనా రచన | చక్రాల వంశస్థులు కవులేగాక వైద్య జ్యోతిష్కములందు ఘటికులు చాకర్ల నరసింహకవిగారి ముత్తాత గారైన శ్రీ శేషాద్రి రామప్పగారు సకల విద్యా పారంగతులై, “ఆకా శ పంచాంగ “ బిరుదు వహించిరి శేషాద్రి రామప్ప గారికి వెంకప్ప శాస్త్రీ – శేషాద్రి శాస్త్రి అను ఇరువురు పుత్రులు వీరిలో రెండవ వారెన శేషాద్రి శాస్త్రి కుమారులు భాస్కరప్ప గారు. |
చక్రాల నృసింహ కవి
చక్రాల వంశస్థులు కవులేగాక వైద్య జ్యోతిష్కములందు ఘటికులు చాకర్ల నరసింహకవిగారి ముత్తాత గారైన శ్రీ శేషాద్రి రామప్పగారు సకల విద్యా పారంగతులై, “ఆకా శ పంచాంగ “ బిరుదు వహించిరి శేషాద్రి రామప్ప గారికి వెంకప్ప శాస్త్రీ – శేషాద్రి శాస్త్రి అను ఇరువురు పుత్రులు వీరిలో రెండవ వారెన శేషాద్రి శాస్త్రి కుమారులు భాస్కరప్ప గారు.
శ్రీ చక్రాల భాస్కరప్పగారు వేదాంత శాస్త్ర కోవిదులు. ధర్మప్రకాశీ కాది కృతికర్తలు, సాధుత్పరులు, వైద్యోత్తములు, వీరి కుమారులే మన చాకర్ల నృసింహ కవిగారు.
కవిగారు తమ పన్నెండవ ఏటనే కవిత్వము చేబట్టి తొలుత సింహావలోకన’మను శతకమును రచించిరి. తరువాత 1920వ సంవత్సరమున సౌందర్య చక్రధరీయమను” నీతిదాయక సాంఘిక నాటకమును రచించిరి . దీనిని శ్రీ శారదా విలాస గ్రంధమాల ద్వారా తొలి కుసుమముగా వెలువరించిరి .
వార కాంతల మాయోపాయ మాటలవలలో దగులుకొని ఎంచరు ధన, బలమానములను నశింప జేసుకొనుచున్నారో తేటతెల్లముగా ఈ నాటకమందు తెలిపిరి.
ఇందు రెండు అంకములు మాత్రమే కలవు చక్రధరరావు ఇందు కథానాయకుడు అతడు కులస్త్రీని విడిచికులటల ఇండ్లు తిరుగు వేశ్యాలోలుడు పేరుకు తగినట్లు సౌందర్యమైన వేశ్య “నిపుణ చక్రధరరావు ఇంటిదాసి ఆమె చక్రధరరావును మార్చుటకు యత్నించి, ఒక చిన్న నాటకమును చిత్రించెను. తుదకు చక్రధరరావు వేశ్యల ప్రేమలు క్షణికములని తెలుసుకొని ధర్మపత్నివి ఏలుకొనెను ఇది సౌందర్య చక్రధరీయ మందలి కధ.
సౌందర్య చక్రధరీయము” ప్రదానముగా నీతిని బోధించుటకే వ్రాయ బడినది . నాటక ప్రదర్శనమును కావలసిన బలమైన సంఘటనలు కాని సంభాషణా చాతుర్యముకాని ఇందు కచిపించదు . అందిందు పద్యములు కూడ చేర్చిరి పద్యనడక చక్కగా నున్నది . ఈ నాటకమును పరిష్కరించి పంపునపుడు బ్రహ్మశ్రీ శతావధాని వేలూరి శివరామశాస్త్రిగారు ప్రహసనముల కన్నను పద్యకావ్యంబు వ్రాయట శ్రేయంబని కవిగారికి సలహా కొసంగిరి ఆఅట్లే కవిగారి చెలికాడు సమకాలికురు గ్రంధకర్తియైన శ్రీ చెన్నే కొత్తపల్లి వేంకటకృష్ణశర్మగారు కూడా అదే అభిప్రాయమును వెలిబుచ్చిరి వారి అభిప్రాయములను కవిగారు ఆచరణలోనుంచిరి . అప్పటి ప్రసిద్ధ నాటక కర్తల నాటక ప్రదర్శనలతో కవి గారు ప్రభావితులైనట్లు తోచుచున్నది కాని ఒంట బట్టిన పద్యరచన ముందది కుంటుబడెడిదే నని ఎరింగిని గుణగ్రాహులు వీరు రాయలసిమ కవు లందరియందును కనిపించు సహజ గుణ సంపద ఇదియే మనవారికి మొండి పట్టుదలతో అవసరములేదు.
వీరి తదుపరి కావ్యము ” శ్రీమయూరధ్వజోపాఖ్యానము’ దీనికి పిన వీరభద్రుని జైమినీ భారత కథ ఆధారము ఇందు ప్రాచీన కావ్యధోరణి గలదు. పద్యములన్నియు ఎక్కువగా వృత్తములలో సాగినవి అందొక పద్యమ చూతము,
ఉ: మారులు రూపసంపద కుమారులు శక్తిధరప్రభూతి నం
చారులు, సత్ప ధంబున విచారులు, నైతిక తత్వమందు మం
దారులు ప్రార్టితార్డుల కుదారులు, భూతియ తత్వమందు కౌ
మారులు దృప్త శాత్రవ కుమారులు రాజకుమారు లా పరిన్.
వీరిని గురించిన వివరము లెక్కువగా తెవిసి రాలేదు. వీరి వంశీకుల ప్రస్తుతము గుత్తిలో పున్నారు ఈ కవులు తపసు గురించి ఎక్కువగా ప్రచారము చేసుకొనలేదు అంత మాత్రమున మనము వారిని పరిగణింప కుండుట భావ్యమా! ఉన్నంతలో వారి చరిత్రలు వ్రాయవలసినదేకదా వీరి కృషి రాయలసీమ సాహిత్య చరిత్రలో ఎన్నదగినది వీరందరూ స్వాతంత్ర్య మనకు పూర్వమున్న నాటకకర్తలు, స్వాతంత్ర్యానంతరము కొందరు వ్రాసిన నాటకముల తీరు పేరుగా నున్నది.
రాయలసీమ రచయితల నుండి….
———–