| పేరు (ఆంగ్లం) | Marur Lakshmi Narasappa | 
| పేరు (తెలుగు) | మరూరు లక్ష్మి నరసప్ప | 
| కలం పేరు | – | 
| తల్లిపేరు | లక్ష్మాంబ | 
| తండ్రి పేరు | కరణం మరూరు నరసింహప్ప | 
| జీవిత భాగస్వామి పేరు | – | 
| పుట్టినతేదీ | 9/8/1882 | 
| మరణం | 4/3/1956 | 
| పుట్టిన ఊరు | అనంతపురం జిల్లా మరూరు గ్రామము | 
| విద్యార్హతలు | యం.ఎ. | 
| వృత్తి | డిప్యూటీ కలెక్టర్ | 
| తెలిసిన ఇతర భాషలు | – | 
| చిరునామా | – | 
| ఈ-మెయిల్ | – | 
| ఫోను | – | 
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – | 
| స్వీయ రచనలు | – | 
| ఇతర రచనలు | – | 
| ఈ-పుస్తకాల వివరాలు | – | 
| పొందిన బిరుదులు / అవార్డులు | కవిశేఖరులు | 
| ఇతర వివరాలు | – | 
| స్ఫూర్తి | – | 
| నమూనా రచన శీర్షిక | మరూరు లక్ష్మీనరసప్ప | 
| సంగ్రహ నమూనా రచన | వీరు అతి పేదకుటుంబమున జన్మించిరి. మేనమామల సహా యముతో మద్రాను క్రిశ్చియన్ కళాశాలలో పట్టభద్రులైరి. తరువాత ఉద్యోగము చేయుచు చరిత్రలో యం. ఎ. పట్టము తీసుకొనిరి. వీరికి కీ ,శే కట్టమంచి రామలింగారెడ్డిగారు సహాధ్యాయులు. తొలుత రూ. 42 లతో ప్రభుత్వ ఉద్యోగమును ప్రారంభించి, 1937 వరకు డి ప్యూ టి కలెక్టరు పదవిని నిర్వహించిరి. 1927లో భద్రాచలమునందు ఉద్యోగము చేయునప్పడు వీరికి శ్రీ భద్రాద్రి రాముని కృప కలిగినది. | 
మరూరు లక్ష్మీనరసప్ప
వీరు అతి పేదకుటుంబమున జన్మించిరి. మేనమామల సహా యముతో మద్రాను క్రిశ్చియన్ కళాశాలలో పట్టభద్రులైరి. తరువాత ఉద్యోగము చేయుచు చరిత్రలో యం. ఎ. పట్టము తీసుకొనిరి. వీరికి కీ ,శే కట్టమంచి రామలింగారెడ్డిగారు సహాధ్యాయులు.
తొలుత రూ. 42 లతో ప్రభుత్వ ఉద్యోగమును ప్రారంభించి, 1937 వరకు డి ప్యూ టి కలెక్టరు పదవిని నిర్వహించిరి. 1927లో భద్రాచలమునందు ఉద్యోగము చేయునప్పడు వీరికి శ్రీ భద్రాద్రి రాముని కృప కలిగినది.
వీరి మాతా పితృభక్తి కడుప్రశంసింపదగినది. జీవితములో చేతనైనంతవరకు సహాయపడుటయే తమ జీవిత ధ్యేయముగా పెట్టు కొన్నవారు. వీరు రామాయణములోని పాత్రల విశిష్టతను వారు ఆదర్శముగా నుంచుకొని ఆచరణలో పెట్టెడివారు. తమకున్న యధికారమునంతయు ప్రజా సేవ కే వినియోగించి ప్రజల హృదయములను చూరగొనిరి. అప్పటి ప్రభుత్వము వారి గణనీయ సేవలను గుర్తించి ” రావు సాహేబ్ ” అను బిరుదమును ప్రసాదించి గౌరవించినది.
కవిగారికి తెనుగుభారతమన్న ప్రీతి మెండు. భారతమును క్షుణ్ణముగా చదివి గ్రహించిన మేధావులు. తెనుగు భారతమును గద్య రూపమున రచించిరి. ఇంగ్లీ షు లో బైబిల్ శైలియందు ఆసక్తి. ఎక్కువ. అందువలననే వారు ఆ శైలిలోనే ఆంగ్లమున ‘శ్రీకృష్ణ చరిత్రము”ను సులభ పోకడలో వ్రాసిరి. పై రెండు గ్రంథములు అచ్చుకాలేకపోయినవి.
భద్రాచల శ్రీరాములవారి ప్రేరణతో రామాయణగాధను సామాన్య ప్రజల కందుబాటులో నుండునటుల సులభశైలిలో తేట గీతములతో వ్రాయసంకల్పించి ‘సులభరామాయణము” ను 5885 గీతములతో ముగించిరి.
ఈ గ్రంథపు వ్రాత ప్రతీ చాలా నాళ్ళ వరకు తమ వద్దనే యున్నట్లు బళ్ళారిలోని కీ.శే. భాస్కరాచార్య రామచందస్వామిగారు వ్రాసుకొన్నారు. ఆగ్రంథమును శ్రీ ఆ దొరస్వామి నాయుడుగారు (పోలీసు సబ్ఇన్స్పెక్టరు) అనంతపురం పోలీసు క్లబ్బులో వచ్చి పోయెడివారికి తలదిండుగ నుపయోగించుచుండినట్లును. ఒకనాడు దానిని తెరచిచూచి పద్యములతో నుండుట తెలిసి రామచంద్రస్వామి గారికి సమర్పించినట్లు తెలియుచున్నది . రామచంద్రస్వామిగారు ఆ గంథకర్తను గూర్చి, గ్రంథమునుగూర్చి తెలుసుకొనవలెనని ఎంతగానో ప్రయత్నించిరి, కాని అంతు చిక్కలేదట .
గ్రంథకర్తగారు జీవించియున్నప్పడే ఆరణ్యకాండమువరకు ముద్రింపబడెననియు, కారణాంతరముల వల్ల అది ప్రజల మధ్యకు రాలేక పోయినదని కవిగారి కుమారులైన శ్రీ నరసింహభారతిగారు తెలియజేసిరి. వారు ప్రస్తుతము హైదరాబాదులోనున్నారు. సులభ రామాయణమును పునర్ముదించు ప్రయత్నములో వారున్నారు. ఆది ఆంధ్రుల భాగ్యవిశేషమే.
సులభ రామాయణమునందలి ఉపోద్ఘాతములో కవిగారిట్లు చెప్పకొన్నారు.
సంస్కృతమునేర్వ, నాంధ్ర భాషను నఖండ
పాండితి గడింప, యతిగణ ప్రాసలక్ష
ణముల శోధింప, వ్యాకరణముమధింపఁ
బదము లల్లుట నాకనభ్యస్త విద్య
పృథితిగాంచిన మాతండి రామభక్తి.
అనయమునునాదు మదినుండు హనుమకరుణ
భద్రగిరివాసుఁడగు రామభదుకృపయు
సాయపడగాత నావ్యవసాయమునకు
సులభరామాయణములో ఉత్తరకాండ కూడా చేర్చబడినది. బాలకాండలో 427 తేటగీతలు; అయ్యోదాకాండలో 1407 . అరణ్య కాండలో 507 , కిష్కింధాకాండములో 587, సుందరకాండములో 750. యుద్ధకాండలో 1278, ఉత్తరకాండలో 409, తేటగీతములు కలవు. మొత్తము 5365 . మచ్చుకు బాలకాండలోని తేటగీతము నొకదానిని పాడుకొందము. 
నిత్యజలసిక్త సుమతరు నిచయముక్త . 
మంద మారుతకవిత నమ్యగ్విభక్త 
రాజసామంత వణ్యమార్గములుఁబాంథ
వేదనావనోదన రమ్యవేదికలును.
బాలకాండములోని గద్యమున కవిగారిట్ల వ్రాసుకొన్నారు. “ఇది శ్రీమదచలాత్మ జారమణ,చరణ సేవానిరత హృదయుండును, నందవరీకవంశ, శ్రీవత్ససగోత్ర సంభవండును నగు మరూరు నరసింహప్ప కుమారుడు రావుసాహేబు మరూరు లక్మీనరసప్పచే రచింప బడిన సులభరామాయణంబున బాలకాండ’
మట్టిలోని మాణిక్యాలవలె రాయలసీమలో నిట్టి యజ్ఞాతకవులు పెక్కు-మందివున్నారు. వారి గ్రంథములు మరుగునపడి క్రిమికీట కాదుల పాలగుచున్నవి. తెరచిచూచు ఓపికయు వెలుగులోనికి దెచ్చు సామర్ధ్యములేని వారుగనున్నారు మనసీమవారు. వావిలి కొలను వారివలే వీరునూ రామభక్తి పరాయణులు. నిరాడంబరులు, నిగర్వులు. వారికిని వీరికిని దగ్గర పోలికలున్నవనుటలో అతిశయోక్తిలేదు. –
వీరికి కీ, శే ఆడిపూడి సోమ నా థ రావు, కీ,శే కాశీ కృష్ణమాచార్యుల, శ్రీ చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రీ . శ్రీపాద కృష్ణ మూర్తి శాస్త్రి గార్లతో అత్యంత సన్నిహితము కలదు. అరుణాచలంలోని గుడిపాటి వెంకటాచలంగారికి వీరు ప్రీతి పాత్రులు.
కవి శేఖరులు కర్నూలులో తమ 74 వ ఏట దివంగతులైరి .
రాయలసీమ రచయితల నుండి…
———–
 
					 
																								 
																								