| పేరు (ఆంగ్లం) | Pydi Lakshmayya | 
| పేరు (తెలుగు) | పైడి లక్ష్మయ్య | 
| కలం పేరు | – | 
| తల్లిపేరు | వెంకటాంబ | 
| తండ్రి పేరు | పైడి ముసలప్ప | 
| జీవిత భాగస్వామి పేరు | – | 
| పుట్టినతేదీ | 6/24/1904 | 
| మరణం | – | 
| పుట్టిన ఊరు | అచ్చంపల్లి-కళ్యాణదుర్గం తాII అనంతపురం జిల్లా | 
| విద్యార్హతలు | ఆంగ్ల భాషా పట్టభద్రుడు | 
| వృత్తి | న్యాయవాది | 
| తెలిసిన ఇతర భాషలు | సంస్కృతం, ఆంగ్లము | 
| చిరునామా | – | 
| ఈ-మెయిల్ | – | 
| ఫోను | – | 
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – | 
| స్వీయ రచనలు | మార్కండేయ విజయము, మహాత్మ కబీరు, శ్రీ రామాశ్వమేధము (లవ, కుశ) , లుబ్దాగ్రేసర, తారాశశాంక, హేమారెడ్డి మల్లమ్మ (లేక) మల్లికార్జున మాహాత్మ్యము. సంసారనౌక , సాయిలీల , శ్రీశైలీయము అముద్రిత నాటకములు . | 
| ఇతర రచనలు | – | 
| ఈ-పుస్తకాల వివరాలు | – | 
| పొందిన బిరుదులు / అవార్డులు | కలియుగ ఆంజనేయులు | 
| ఇతర వివరాలు | శ్రీ లక్ష్మయ్యగారు ఆంగ్ల భాషా పట్టభద్రు లగుటకుఁ దోడు. సంస్కృతాంద్రాది భాషలయందును పట్టభద్రులె పాశ్చాత్య దేశము లందుఁ గూడఁబర్యటించి, తత్రత్య ప్రాజ్ఞలచే సంభావితులై , బహు దేళ దేశీయ విజ్ఞానము నవగతము గావించుకొని, న్యాయవాదులై అనంతపురము జిల్లా బోర్డు అధ్యక్షులై, పార్లమెంటు సభ్యులై, దేవదాయ ధర్మాదాయ శాఖల కమీషనరై , సలిపిన ప్రజా సేవ , దేవతా సేవ దేవాలయముల పునరుద్ధరణ సేవ, మరవ రానిది. వారు పిన్ననాటనే ‘దేశబాసలందు- తెలుగులెస్స” అను ఆంధ్రభోజుని నుడి చక్కగా పాటించి, ఆంధ్ర భాషలో ప్రత్యేక కృషి యొనర్చి పండితుల మన్ననల గాంచిన ప్రాజ్ఞలు. | 
| స్ఫూర్తి | – | 
| నమూనా రచన శీర్షిక | పైడి లక్ష్మయ్య | 
| సంగ్రహ నమూనా రచన | శ్రీ లక్ష్మయ్యగారు ఆంగ్ల భాషా పట్టభద్రు లగుటకుఁ దోడు. సంస్కృతాంద్రాది భాషలయందును పట్టభద్రులె పాశ్చాత్య దేశము లందుఁ గూడఁబర్యటించి, తత్రత్య ప్రాజ్ఞలచే సంభావితులై , బహు దేళ దేశీయ విజ్ఞానము నవగతము గావించుకొని, న్యాయవాదులై అనంతపురము జిల్లా బోర్డు అధ్యక్షులై, పార్లమెంటు సభ్యులై, దేవదాయ ధర్మాదాయ శాఖల కమీషనరై , సలిపిన ప్రజా సేవ , దేవతా సేవ దేవాలయముల పునరుద్ధరణ సేవ, మరవ రానిది. వారు పిన్ననాటనే ‘దేశబాసలందు- తెలుగులెస్స” అను ఆంధ్రభోజుని నుడి చక్కగా పాటించి, ఆంధ్ర భాషలో ప్రత్యేక కృషి యొనర్చి పండితుల మన్ననల గాంచిన ప్రాజ్ఞలు. | 
పైడి లక్ష్మయ్య
శ్రీ లక్ష్మయ్యగారు ఆంగ్ల భాషా పట్టభద్రు లగుటకుఁ దోడు. సంస్కృతాంద్రాది భాషలయందును పట్టభద్రులె పాశ్చాత్య దేశము లందుఁ గూడఁబర్యటించి, తత్రత్య ప్రాజ్ఞలచే సంభావితులై , బహు దేళ దేశీయ విజ్ఞానము నవగతము గావించుకొని, న్యాయవాదులై అనంతపురము జిల్లా బోర్డు అధ్యక్షులై, పార్లమెంటు సభ్యులై, దేవదాయ ధర్మాదాయ శాఖల కమీషనరై , సలిపిన ప్రజా సేవ , దేవతా సేవ దేవాలయముల పునరుద్ధరణ సేవ, మరవ రానిది. వారు పిన్ననాటనే ‘దేశబాసలందు- తెలుగులెస్స” అను ఆంధ్రభోజుని నుడి చక్కగా పాటించి, ఆంధ్ర భాషలో ప్రత్యేక కృషి యొనర్చి పండితుల మన్ననల గాంచిన ప్రాజ్ఞలు.
పసిడికి తావి అబ్సినరీతి పూర్వజన్మ సుకృత విశేషమున, వారికి పాండిత్యమునకు తోడుగా కవితాకళ అబ్చినది వారికి నాటకములన్న మిక్కిలి మక్కువ. ఆంధ్ర నాటక పితామహులగు స్వర్గీయ ధర్మవరము కృష్ణమాచార్యులవారి, అడుగు జాడల వర్తించి శ్రీ లక్ష్మయ్యగారు, విద్యార్థి దశ యందే, నాటక రచన ముపకమించి ‘మార్కండేయ’ నాటకము రచించిరి.
ఈ నాటకమును 1926వ సం|| అనంతపురమున-“కలియుగ ఆంజనేయ బిరుదాంకితులగు శ్రీ సి. యన్ -. నటేశం గారి నాటక మండలి వారు మనోహరముగ ప్రదర్శించి, ప్రజలను మెప్పించి, ప్రఖ్యాతి గాంచిరి. 1960 లో , కర్నూలు నాటక మండలి వారి చే శ్రీ శైల క్షేత్రములో, మాజీ రాష్ట్రపతి డాక్టరు రాజేంద్రప్రసాదు గారి సమక్షమున కూడా ఈ నాటకము ప్రదర్శింపబడెను.
వీరు వ్రాసిన నాటకములు 1) మార్కండేయ విజయము 2) మహాత్మ కబీరు 3) శ్రీ రామాశ్వమేధము (లవ, కుళ) 4) లుబ్దాగ్రేసర, 5) తారాశశాంక 6 ) హేమారెడ్డి మల్లమ్మ లేక మల్లికార్జున మాహాత్మ్యము ముద్రితములు . సంసారనౌక , సాయిలీల , శ్రీశైలీయము అముద్రిత నాటకములు .
‘సంసారనౌక’ అను నాటకమును బళ్ళారిపురమున 1943లో, నాటి మద్రాసు గవర్నరు “సర్ ఆర్తర్ హోప్” గారి సమక్షమున ప్రదర్శింపబడెను, *సాయిలీల” అను నాటకమును అనంతపురము జిల్లాలో పలు తావులయందు ప్రదర్శించిరి. 1963 లో, శ్రీశైలములో, కర్నూలు నాటక పరిషత్తవారు కూడ ఈ నాటకమును, ప్రదర్శించిరి. ‘మల్లికార్జున మాహాత్మ్యము” అను నాటకమును, బెజవాడ శ్రీరాజ రాజేశ్వరి నాటక మండలివారు, “శ్రీ శైలీయము అను నాటకమును భ్రమరాంబా మల్లికార్జున కళా సమితివారు ప్రదర్శించిరి. వీరి నాటకములు నిర్దుష్టమై, నిరుపమానమై, సరళపద శోభితమై, నవరస భరితమై అలరారు చుండు ననుటలో అత్యుక్తియుండదు .
శ్రీ మల్లి కార్డున మాహాత్మ్యము (హేమారెడ్డి మల్లమ్మ)
ఇది ఐదంకముల నాటకము. ఇందలి కథ, భక్తురాలగు మల్లమాంబ, పాండురంగ భక్తురాలగు సక్కు బాయివలె, తన భర్త చేతను, మామచేతను, నెంతయో యాదృతయయ్యు, సక్కుబాయి వలెనే తన యత్తయగు పద్మమ్మ వలన, తోడి కోడలగు నాగమ్మవలన, నానా కష్టములకు లోనై , వాటి నన్నిటిని నిశ్చలయై సహించి, మల్లి కార్జున సేవాతత్పరయగుట, నిత్యమును జంగమయ్య వేషమున నామెకు మల్లికార్జునుడు సాక్షాత్కరించుట, వరముల వేడుకొమ్మన నత్తకును. దోడి కోడలికిని గల మహావ్యాధుల బోకార్చి వారిని నిజ భక్తరాండ్రగా గావించు కొమ్మని ప్రార్ధించుట. తుదక అత్తయగు పద్మమ్మయ, తోడి కోడలగు నాగమ్మయు బుద్ధి తెచ్చుకొని భక్తరాంధ్రయి, మల్ల మాంబకు శరణాగతులయి, మల్లికార్జునుని సేవించుట.
సోమిరెడ్డి కూతురై న మల్లమ్మను, ఆ త్తగారింటికి పంపునప్పడు,
సీ. పతిని, దైవంబుగా – భావించి సతతంబు 
నింపు సొంపెలయఁ బూజింపు మమ్మ! 
అత్త మామలను, బ్రత్యక్ష దేవతలని 
తలఁచి భక్తిని సేవ నలుపు మమ్మ! 
తోడికోడండ్రు, నీతోడ బుట్టువు లంచు 
నెంచి, యూదరమునఁ గాంచు మమ్మ! 
సేవకులను, నిరసింపక కన్నబి 
డ్డలవోలె బోషించి యలరు మమ్మ !
గీ : శ్రీగిరి క్షేత్ర మందు – రాజిల్లు నట్టి
జనని భ్రమరాంబ, మల్లికార్డునుఁడు మనకు
నిష్ట దెవములని, యాత్మనెంచు మమ! .
పోయి రావమ్మ ! శుభములు-పొందు మమ్మ!
శ్రీ పైడి లక్ష్మయ్యగారు. భక్తి , జ్ఞాన, కర్మయోగములలో భక్తి మార్గము రాచబాట యన్నారు. మనస్సనెడి కోతిని బంతి చుటకు భక్తిపాశము సులభమన్నారు. ఈ పద్యమును చూడుడు.
అనిశము, మోహకాననము-నందు, సతీకుచ పర్వతమ్ములన్ 
కొన, మొన లేని యాశలను-కొమ్మల స్వేచ్చఁజరించు నట్టి, యా 
మనసను క్రోతి నెట్టులొ, నమంచిత భక్తిని గట్టి, నీ వశం 
బునఁ గొను మాదిభిక్ష! భవ! ముక్తిఫలప్రద! మల్లికార్డునా!
కవిగారు మాయ సంసారము నిట్ల కీర్తించిరి.
మాయ సంసార మిది తమ్ముడా! ఈ 
మాయలోఁబడబోకు తమ్ముడా! 
కన్నబిడ్డలు భార్య తమ్ముడా – నీ 
కంఠాన కురిత్రాళ్లు తమ్ముడా! 
చెన్న మల్లేశు పూజ తమ్ముడా- నీకు 
చేకూర్చు మోక్షంబు తమ్ముడా!
శంభో ! శివా యని తమ్ముడా ! సలుపు
శివపూజ లెప్పడు తమ్ముడా!
శ్రీ లక్ష్మయ్యగారు, శ్రీ పట్టపర్తి శ్రీనివాసా చార్ల వద్దను, శ్రీ పేరరాజుగారి వద్దను, ఛందో వ్యాకరణాది లక్షణముల నేర్చు కొన్నారు. వీరి కుమారులు శ్రీ పి. యల్ సంజీవరెడ్డిగారు ప్రస్తుతము కడప జిల్లాకలెక్టరుగా పని చేయుచున్నారు.
“బాబా సద్గురు సోమనాథ మహారాజుగారు వీరి ఆధ్యాత్మిక గురువు . వారిపై ‘సద్గురు శ్రీ సోమనాథ శతకము” వ్రాసినారు. గురుపుగారు, బెంగళూరు-కెంగేరిలో ‘సావన్ దర్బారు ఆశ్ర ము”లో యున్నారు.
“సూరి వందిత సద్గురు – సోమనాథ’ అను మకుటముతో గీత పద్యములను వ్రాసినారు. అందులో మూడు చదువుడు.
గీ. ధనము గడియింప, నీచ వర్తన మదేల? 
జనుల వంచించి, మోసంబు సలుపనేల?
వచ్చునే వెంట పచ్చిన వక్క తుదకు? Iసూరి!
గీ, నంతులు, నరోవరములు, వర్గంబు, తరులు 
జనుల కొనరించు చుండు నిస్వార్ణ సేవ 
స్వార్ధరాహిత్యసేవయే – సత్య పథము IIసూరి|
గీ: సద్గురూత్తము మూలాన – నలుపు పూజ 
చెందు తనకని పరమాత్మ – చెప్ప చుండు
సద్గురువు లేని పూజ, నిష్ఫలము గాదె ? ||సూరి ||
ప్రస్తుతము, శ్రీ పైడి లక్ష్మయ్యగారు ఆన్ని పదవుల నుండి, రిటైరై, సుఖశాంతులతో కాలము గడుపుచున్నారు. అనంతపురములో, కోర్టురోడ్డులో వీరి విశాల భవనము కలదు. వీరి సలహాల కొఱకు, దివ్యమైన సందేశముల కొఱకు, కవులు, పండితులు ఆన్ని సంస్థల ఉద్యోగులు, రైతుజనులు అశ్రాంతము వీరి గృహము నలంకరించుచుందురు. కవి పండితులయందు వీరి కవ్యాజమైన ప్రేమ కలదు. ప్రస్తుతము వీరు అనంతపురము జిల్లా రచయితల సంఘమున కధ్యక్షులై , సారస్వత సేవ లొనరించు చున్నారు. వీరు స్వయముగా కవులేకాక, కవుల నాదరించు స్వభావము కలవారు. గ్రంథమాలకు రూ 116 విరాళము చెల్లించిన ధన్యులు. అచిరకాలములోనే, వీరి అముద్రిత నాటకములు ముద్రింపబడునని నమ్ముచున్నాము. వీరి చిత్ర పటము ఈ గ్రంథ ములో దాతల ఫోటోలలో ముద్రింపబడినది. గమనింపడు. భగ వంతు డాయురారోగ్య భాగ్యముల నిచ్చి వీరిని కాపాడు గాత:
రాయలసీమ రచయితల నుండి…..
———–
 
					 
																								