| పేరు (ఆంగ్లం) | Chitturu Subrahmanyam Pillai |
| పేరు (తెలుగు) | చిత్తూరు సుబ్రహ్మణ్యం పిళ్లై |
| కలం పేరు | – |
| తల్లిపేరు | మొగిలమ్మ |
| తండ్రి పేరు | పేరయ్య |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 6/22/1898 |
| మరణం | 1/1/1975 |
| పుట్టిన ఊరు | పుంగనూరు, చిత్తూరు జిల్లా |
| విద్యార్హతలు | శాస్త్రీయ సంగీతాన్ని శాస్త్రీయంగా గురుకుల పద్ధతిలో 14 సంవత్సరాలు అభ్యసించారు. |
| వృత్తి | శాఖాధిపతి, సంగీత విభాగం, అన్నామళై విశ్వవిద్యాలయం, చిదంబరం (1947-55), ప్రొఫెసర్, కేంద్ర సంగీత కళాశాల, మద్రాసు. (1956-60) , వ్యవస్థాపక ప్రధానోపాధ్యాయులు, శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల, తిరుపతి. (1961-66) , ప్రధానోపాధ్యాయులు, రాజాగారి సంగీత కళాశాల, తిరువయ్యారు. (1967), ప్రధానోపాధ్యాయులు, రామనాథన్ సంగీత అకాడమి, జఫ్నా, శ్రీలంక. (1967-71) |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | మధురా నగరిలో చల్లలమ్మ బోను, కులములోన గొల్లదాన, మావల్లగాదమ్మ |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | సంగీత కళానిధి, 1954, మద్రాసు సంగీత అకాడమి, మద్రాసు సంగీత నాటక అకాడమి పురస్కారం, 1964, సంగీత నాటక అకాడమీ. గాన కళాప్రపూర్ణ, ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమి స్వర చక్రవర్తి. సంగీత సార్వభౌమ లయ బ్రహ్మ ఇసై పేరరింజర్, తమిళ ఇసై సంఘం, మద్రాసు. సంగీత విద్వన్మణి, త్యాగరాయ ఉత్సవ సమితి, తిరుపతి. ఇసైమన్నార్, శైవ సిద్ధాంత సభ, తిరునల్వేలి |
| ఇతర వివరాలు | సంగీత కళానిధి చిత్తూరు సుబ్రహ్మణ్యం పిళ్లై గా ప్రసిద్ధిచెందిన చిత్తూరు సుబ్రహ్మణ్యం సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్యాంసులు మరియు వాగ్గేయకారులు. చిత్తూరు సుబ్రహ్మణ్యం మద్రాసు నగరంలో స్థిరనివాసమేర్పరచుకున్నను భారతదేశమంతా తిరిగి సుమారు 50 సంవత్సరాలకు పైగా సంగీత కచేరీలు చేసి శ్రోతల్ని మెప్పించారు. వీరు గురుకుల పద్ధతిలో ఎందరో శిష్యులకు సంగీతవిద్యను బోధించారు. వారిలో కొందరు సుప్రసిద్ధ విద్వాంసులుగా పేరుపొందారు. |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | చిత్తూరు సుబ్రహ్మణ్యం పిళ్లై |
| సంగ్రహ నమూనా రచన | మధురానగరిలో చల్లనమ్మ బోదు దారివిడుము కృష్ణా! మాపటివేళకు తప్పక వచ్చెద మాపటివేళకు తప్పక వచ్చెద పట్టకు కొంగు గట్టిగాను కృష్ణా! కృష్ణా! మాపటివేళకు తప్పక వచ్చెద పట్టకు కొంగు గట్టిగాను కృష్ణా! |
చిత్తూరు సుబ్రహ్మణ్యం పిళ్లై
మధురానగరిలో చల్లనమ్మ బోదు
దారివిడుము కృష్ణా!
మాపటివేళకు తప్పక వచ్చెద
మాపటివేళకు తప్పక వచ్చెద
పట్టకు కొంగు గట్టిగాను కృష్ణా! కృష్ణా!
మాపటివేళకు తప్పక వచ్చెద
పట్టకు కొంగు గట్టిగాను కృష్ణా!
మధురానగరిలో చల్లనమ్మబోదు
దారివిడుము కృష్ణా!
కొసరి కొసరి నాతో సరసములాడకు,
రాజమార్గమిది కృష్ణా! కృష్ణా!
కొసరి కొసరి నాతో సరసములాడకు,
రాజమార్గమిది కృష్ణా! కృష్ణా!
వ్రజ వనితలు నను చేరవత్తురిక
వ్రజ వనితలు నను చేరవత్తురిక
విడువిడు నా చేయి కృష్ణా! కృష్ణా!
మధురానగరిలో చల్లనమ్మపోదు
దారివిడుము కృష్ణా! కృష్ణా!
———–