| పేరు (ఆంగ్లం) | Kotikalapudi Seetamma | 
| పేరు (తెలుగు) | కొటికలపూడి సీతమ్మ | 
| కలం పేరు | – | 
| తల్లిపేరు | – | 
| తండ్రి పేరు | అబ్బూరి సుబ్బారావు | 
| జీవిత భాగస్వామి పేరు | కొటికలపూడి రామారావు | 
| పుట్టినతేదీ | 1/1/1874 | 
| మరణం | 1/1/1936 | 
| పుట్టిన ఊరు | – | 
| విద్యార్హతలు | – | 
| వృత్తి | – | 
| తెలిసిన ఇతర భాషలు | – | 
| చిరునామా | – | 
| ఈ-మెయిల్ | – | 
| ఫోను | – | 
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – | 
| స్వీయ రచనలు | అహల్యాబాయి చరిత్ర, సాధురక్షక శతకము, గీతాసారము (పద్యకావ్యము), సతీధర్మములు, ఉపన్యాసమాలిక, ఉన్నత స్త్రీవిద్య, కందుకూరి వీరేశలింగం చరిత్ర | 
| ఇతర రచనలు | – | 
| ఈ-పుస్తకాల వివరాలు | – | 
| పొందిన బిరుదులు / అవార్డులు | – | 
| ఇతర వివరాలు | ప్రముఖ రచయిత్రి. సంఘ సంస్కర్త. వీరేశలింగం పంతులుగారి సమకాలీనురాలు. ఈమె సావిత్రి అనే పత్రికను కొంతకాలం నిర్వహించారు. ఈమె కుమార్తె కానుకొల్లు చంద్రమతి కూడా మంచి రచయిత్రి. ఆమె 1961లో గృహలక్ష్మి స్వర్ణకంకణం గైకొంది. 1913లో బాపట్లలో జరిగిన మొదటి ఆంధ్ర మహాసభ యందలి మహిళా శాఖకు అధ్యక్షత వహించారు.[1] అందులొ పాల్గొన్నవారి ఉపన్యాసములన్నింటిని వచన గ్రంథముగా సంపుటీకరించారు. చివరిదశలో పిఠాపురం మహారాణి గారికి విద్యనేర్చే గురువుగా పనిచేశారు. | 
| స్ఫూర్తి | కందుకూరి వీరేశలింగం | 
| నమూనా రచన శీర్షిక | కొటికలపూడి సీతమ్మ సత్య ప్రవర్తనము | 
| సంగ్రహ నమూనా రచన | మనుష్య నామమున కలంకార భూతమగు సత్య ప్రవర్తనము గల మహానుభావు లీలోకమున బ్రతికి యున్నంత కాలము సర్వజన సమ్మతతులు గానుండుటయే కాక పరమ పద ప్రాప్తులైన వెనుక సహితము మృతజీవులన బ్రఖ్యాతి నొంద గలరు . ఇట్టి శాశ్వత కీర్తి సంధాయిని యగు సత్య ప్రవర్తన లేని వారీ జగత్తులో నెన్ని యుగములు జీవించియుండి యెన్ని భోగభాగ్యములనను భావించిన వారైనను వారి నామముల శాశ్వతములగు వారి దేశములతోనే నశించిపోవును సమస్త శుభం లొన గూర్చి నిత్య సంతుష్టి గలిగింప గల సత్య వర్తన మెల్లరకు సుసాధ్యముగా లభించునది యేయైనను నామా న్యజనులు జ్ఞాన నేత్రము తెరచి చూచి మంచి చెడుగులను విమర్శింపజాలక చెడు దారిని పోయిక డు నిడుమల బడుచుందురు నిక్క మయిన మార్గమును గల్గి సంచరించు నారొక్కరు మాత్రమే యుభయలోక ములయందును సుఖ సంతోషములననుభవింప నర్హుడై సాటిలేని యాత్మ శాంతి గల వారలైయొ ప్పారుదురు . ఇందునకుదాహరణము నిటనొక చిన్న కథ వ్రాయదలచితిని ఈ కథమీ రెల్ల రీవరకే చదివి యుందురు . | 
కొటికలపూడి సీతమ్మ
సత్య ప్రవర్తనము
మనుష్య నామమున కలంకార భూతమగు సత్య ప్రవర్తనము గల మహానుభావు లీలోకమున బ్రతికి యున్నంత కాలము సర్వజన సమ్మతతులు గానుండుటయే కాక పరమ పద ప్రాప్తులైన వెనుక సహితము మృతజీవులన బ్రఖ్యాతి నొంద గలరు . ఇట్టి శాశ్వత కీర్తి సంధాయిని యగు సత్య ప్రవర్తన లేని వారీ జగత్తులో నెన్ని యుగములు జీవించియుండి యెన్ని భోగభాగ్యములనను భావించిన వారైనను వారి నామముల శాశ్వతములగు వారి దేశములతోనే నశించిపోవును సమస్త శుభం లొన గూర్చి నిత్య సంతుష్టి గలిగింప గల సత్య వర్తన మెల్లరకు సుసాధ్యముగా లభించునది యేయైనను నామా న్యజనులు జ్ఞాన నేత్రము తెరచి చూచి మంచి చెడుగులను విమర్శింపజాలక చెడు దారిని పోయిక డు నిడుమల బడుచుందురు నిక్క మయిన మార్గమును గల్గి సంచరించు నారొక్కరు మాత్రమే యుభయలోక ములయందును సుఖ సంతోషములననుభవింప నర్హుడై సాటిలేని యాత్మ శాంతి గల వారలైయొ ప్పారుదురు . ఇందునకుదాహరణము నిటనొక చిన్న కథ వ్రాయదలచితిని ఈ కథమీ రెల్ల రీవరకే చదివి యుందురు .
అయినను పవిత్రకరమగు సత్య ప్రవర్తన ప్రధానాంశముగా గల కథ లెన్ని సారూ లెందరీ వాక్యములతో విన్నాను విసుగు కలుగక నూతనోత్సాహము జనించుట స్వానుభవముచే నెరిగిన దాననగుట చేత నిది చదువరులకు బోధ ప్రధముగా నుండు నని యెంచి వ్రాయబూనితిని.
పూర్వము ఫ్రాన్సు దేశములో రాజ్య కలహములు జరుగుచున్న కాలములో జర్మనియా దేశములో మేను నదీ తీరమున గల ఫ్రాంకు పోర్టు పట్టణము నందు యూది యా దేశీయుడైన మోసెన్ రాత్ చైల్డు అనునొక సాహుకారు నివాససము చేయుచుండెను .
ఆయన విశేష ధనవంతుడు కాడు కాని మంచి యోగ్యుడనిమాత్రము ప్రఖ్యాతి జెంది యుండెను . ఆ కాలములో ఫ్రాన్సు సేవలు జర్మని యా దేశము మీదికి దండెత్తి పోవుట వలన ఆ దేశములోని హెస్సి కాసెలు ప్రభువు తన రాష్ట్రమును విడిచి పారి పోవలసిన వాడయ్యెను . ఆ ప్రభువట్లు శత్రు భయముచే ఫ్రాంకు పోర్టు పట్టణము దారిని బోవుచు దన ధనమును విలువగల యాభరణములును నెవరి కడనైన దాచియుంచవలయునను తలంపు గలిగిన వాడై మార్గ మధ్యమున సుగుణవంతుడగు మోసెస్ రాత్ చైల్డు కనబడినందున అతనితో నిట్లు ప్రసంగించెను ,ఓయి ‘ విధివశముననేను శత్రువులకు జడిసి నారాష్ట్రమును విడిచి పారి పోవలసివచ్చినది నేనిట్లు పోవు సమయమున నాయోడ్డ గల ధనమును ఆభరణములును శత్రువుల చేత జిక్కునే మోయని భయమగుచున్నది . కావున నాయీ పెద్ద మొత్తమంతయు నీ యెద్ద దాచి యుంచ గోరుచున్నాను . నీవు దాచియుంచ నిష్ఠపడకున్న నా సొత్తు దక్కించుకొను మార్గమిక నేదియు గాన రాకున్నది కావున నీవుప్పుడీ సాయము చేయక తప్పదు ఇట్లనెడు ప్రభువు వాక్య ములను సత్య శీలుడగు మోసెస్ విని జాలిపడి అయ్యా ! తాము కోరిన ప్రకారము తమద్రద్యాభరణములను నా యెద్దదాచి యుంచుట నాకు పరమ సమ్మతమేయగును కాని రాజ్య కలహములు జరుగుచున్న యీ యుప్రధవ సమయంలో ఇంత గొప్ప ధనము నా యెద్ద నుంచుకొని ఎట్లు కాపాడు. నాయని మాత్రము మిగుల భయపడుచున్న వాడను అయినను తమరు ధనము భద్రము చేసికొనుట కింత కంటే వేరోకొండు మార్గము లేదని నుడువు చున్నందున నేనీభారము వహింపనియ్య కొంటిని ఈ ధనము మరలమికు నప్పగింప జాల నేమోయను భయమునన్ను బట్టి బాధించుచుండుట చేత మీ సోమ్మునాకు ముట్టి నట్టు వ్రాసి యియ్య జాలను ఈ ప్రకారముగా నాకు ధనమప్పగించుట మీకు సమ్మత మైన యెడల నిచ్చి పొండు యిష్టము లేని పక్షమున నియ్య వలదు అని విన్నవించెను మోసెస్ పలికిన వినయ వాక్యములకా ప్రభువు మిగుల సంతోషించి యాతడు కోరిన ప్రకారము సొమ్ము ముట్టినట్టు కాగితము వ్రాయించి పుచ్చు కొనకుండనే తన సొత్తంతయు నాతని కప్పగించి తన దారినిపోయేను . అప్పుడు మోసెస్ అనేక లక్షల పౌండ్లవెలగల యా భరణములును ధనమును తన యింటికి ఫ్రాంకు పోర్టు పట్టణమునకు గొని పోయెను .
ఇంతలో ప్రాన్సు వారు ఫ్రాంకు పోర్టు పట్టణము ప్రవేశించిరి . ఆ మాట విని మోసెసు తత్తరపడి , అయ్యో ! ఈశ్వరా ! నా సొత్తు పోయినాను నాకు పరమ సమ్మతమే కాని నా యెద్ద గల వెలగల యీ పరధనమును నేనెట్లు కాపాడుదును యేమి సేయుదును ‘ ఈ సమయమున నాకేదేని యుపాయము తోపించి యీ ధనాభరణములను సంరక్షింపగల మార్గము జూపుమా “ అని పరమేశ్వరుని బహు విధముల బ్రార్ధించి తుదకొక యుపాయమారసి యా ధనమును భూషణములును దన తోటలో ఒకమూల పాతి పెట్టెను .
అప్పుడతని యెద్ద సొంత ధనము ఆరు వేల పౌండ్ల వెల కలదిమాత్రమే యుండెను . ఆ సమయమున సొంత ధనము మాత్రమెచటను దాచి యుంచక నిర్భయుడై యుండెను . ప్రాంన్సు వారప్పుడాతని గృహము లోబ్రవేశించియున్న సొత్తంతయు దామ నాయాసముగానే కను గోన గలిగినందున నిక నతని యెద్ద ధనముండునను సంశయము విడిచి యంతటితో దృప్తిగనిపోయిరి . మోసెస్ సొంత ధనము కూడా దాచి , తన యెద్ద నేమియు లేనట్టు నటించిన పక్షమున ఫ్రాన్సు వారు తక్కిన వారి యిండ్లనలెనే యాతని ఇల్లు కూడ త్రవ్వి యందెమియు గానక తోటయు , దొడ్డియు ద్రవ్వి వెదకి ధనమంతయు దోచుకొని పోవుటచే నెంతయో లాభమొన గూడెను . అంత నాప్రాన్సు వారా పట్టణము నుండి వెడలిన వెనుక మోసెస్ నంతుష్టాతరంగుడై యాప్రభువు సొమ్ము త్రవ్వి తీసి తన యెద్ద నొక కాసైన లేకుండుట చేత ఆ ధనములో గొంత తీసి వాడుకొనుచుండెను తాను తీసుకోనిన ధనములో గొంత వర్తకము నకుపయోగ పరచెను . ఆ వ్యాపారములో నాతనికపరిమిత లాభము కలిగి కొలది కాలములోనే పోయిన ధనము కంటే నధికధనము సంపాదింపగలిగెను . ఇట్లు కొన్ని సంవత్సరములు గడిచిన పిదప కలహములడగి దేశము నేమ్మిది పడినందున హిస్సి కాసెలు ప్రభువు మరల తనరా మునకు వచ్చి చేరెను . అప్పుడా ప్రభువు మిగులు చింతిల్లి అయ్యో “ఈశ్వరయను గ్రహము వలననే యపాయము నొందక యిల్లు చేరితిని గాని యింట నొక రూక యైన లేకపోయేగాగదా ‘ ఇప్పుడేమి చేయుదును ? నా సొమ్ము పుచ్చుకొన్న నిప్పుడా ధనమంతం డిచ్చునా ? ఒక వేళ ప్రాన్సు వారాధనము విడిచి పోయినాను వారా ధనము దోచుకొని పోయిరని బొంకి యాతడది యాపహరించునే కాని నాకియ్యదలపడు . అయినను అడిగి లేదనిపించుకోనిన వచ్చేద ,, నని తలచి సొమ్ము పోయిన దనియే దృఢ నిశ్చయము చేసికొని మోసెస్ కడకు వచ్చి నిలచెను . సత్య సంధుడగు మోసెసు ధనము నతడడుగాక పూర్వమే ,” అయ్యా ! తమ సోమ్మంతయు సురక్షితము గానున్నది ఫ్రాన్సు వారు నాగృహమును చోరకమును పేతమ ధనమంతయు నా తోటలో బాతి పెట్టి యుంచి వారిల్లు ముట్టడి వేసి నతక్షమే నా ధనమంతయు వారికగ పరిచితిని అందువలన వారు నాసోత్తు మాత్రమే తీసుకొని పోయి మీ సొత్తు విడిచి పోవ తటస్థించెను .
ఈశ్వరాను గ్రహముచే మీ స్ప్త్తు మీకియ్య గలిగి ధన్యుడ నైతిని కాని తమ యెడనే నొకయపరాధము చేసి వాడ నైతిని అది యేదవ అట్లు నాధనము గోలు పోయినందున నట్టి తరిని తమ ధనములో గొంత తీసికొని వాడు కొంటిని దానితో గొంత వర్తకము చేసితిని ఈశ్వర సాహాయ్యమున నా వ్యాపారములో మిగుల లాభము కలిగెను . కాబట్టి మీ సొత్తు లోనేను దీసి కొనిన ధనమునకు సూటికయిదు రూపాయల చొప్పున వద్దీయి య్య సిద్దముగానున్న వాడను . ఈనాతప్పితనము క్షమించి మీ సొత్తు వెంటనే తీసుకొని పొండు అని యత్యంత వినయ విధేయతతో విన్నవించెను . ఆహా ! సత్య ప్రవర్తన మననిట్టిదిదియే కదా ! బొంకుటకను కూలముయిన సమయములో సహితము బొంక బ్రయత్నింపక సత్య సంరక్షణ మొనర్చి ఈ పుణ్య శీలునిన వార్తన మెంతయు శ్లాఘా పాత్రము గానున్నది . మోసెస్ పలికిన వినయ వాక్యముల కా ప్రభువు నివ్వెర పాటుతో నత్యంతా శ్చర్య మగ్న మానసుడై సత్య శీలుడా ! నీయుకత ప్రవర్తనము మగననా కచ్చెరువయ్యెను . అనుపమేయమగు ణీ సుశీలత గొని యాడ నాతారము కాదు ఈ ధనమంతయు నీ యెద్ద నేయొండనిమ్ము .
అని చెప్పి మిక్కిలి తక్కువ వడ్డీకి తన సోత్తులో జాల భాగ మతని యెద్ద నుంచి వెడలిపోయెను . అటు వెనుక ప్రభువు మోసెస్ తనకు చేసిన గొప్ప మేలు మఱవక యాతని కేదేని ప్రత్యుపకారము చేయ నెంచి మోసెస్ పరమ యోగ్యుడనియు అప్పు తీసుకొనదలచిన వారలాతని యెద్ద దీసి కొనుట యుత్తమ మనియునైరో పా రాజులక నేకులకు దెలిపెను . ఇట్లీతని న్యాయ వర్తన మెల్లెడల వ్యాపించినందున న నేనక గొప్ప వ్యాపారములో చాలా మంది రాజులీతని కడ నప్పు పుచ్చుకొనుట తటస్థించినందున నీతడు కొలది కాలములోనే విశేష ధనవంతుడై యుండెను . అతడు తన ముగ్గురు పుత్రులను పారీసు లండను వియానా అను మూడు ప్రసిద్ది రాజధానుల లో నుంచి వారి చేత గూడ వర్తకము చేయించెను వారు మువ్వురును శీఘ్రమే యభివృద్ధి నొంది స్వయముగా వ్యాపారము చేసిన వారిలో వారి యంత ధనికు లెక్కడను లేరను నంతటి కోటీశ్వరులై యుండిరి . వారిలో లండనులో నున్న వాడు మృతి నొందునపుడు డెబ్బది లక్షల పౌండ్ల వెలగల ధనము గల వాడై యుండెను . పారీసు వియనాలోనున్న యిరువురును గూడ నింత కంటె దక్కువ ధనము గల వారు కాక యుండిరట . మోసెస్ కుటుంబములో నప్పు దొరకినప్పుడు మాత్రమే రాజులు యుద్ధము చేయుటయు లేనప్పుడు యుద్ధములు మాని సఖ్య పడవలసిన వచ్చుట నప్పుడప్పుడు తటస్థించుచుండెను ఆహా ! ఈకధ ధనా శాపి శాచా వేశులగు వారిని అనుతాపాబ్ది లో ముంపదగియున్నది . సత్యము పలుకుట సులభామనియు నందు వలన ననంతములగు మెళ్ళోనగూడుటయే కాక సత్య వంతులగు వారికి కీర్తి యా చంద్ర తార్కాముగా నుండుననియు నీక ధానాయకుడగు మోసెస్ తన ప్రవర్తన మూలమున లోకమునకు పదేశించెను . కావున మన మెల్ల రాము నిట్టి నీతి బోధక ములగు కథల నత్యంత శ్రద్ధా భక్తులతో జదువుచు నూరక చదువుటయేగాక యట్లు ప్రవర్తింప బ్రయత్నింపుచు సత్య కాంక్షతో గాలము గడపి యీశ్వరాజ్ఞాను వర్తినులమై వెలయ యత్నింతము ఇందునకు దావ లోక పాలుడగు జగత్పతి మునకు సాయ పడు ; గావుత .
రచన : కొటికల పూడి సీతమ్మ 
———–
 
					 
																								 
																								