| పేరు (ఆంగ్లం) | Devula Palli Krishna Shastry |
| పేరు (తెలుగు) | దేవులపల్లి కృష్ణ శాస్త్రి |
| కలం పేరు- | – |
| తల్లిపేరు | సీతమ్మ |
| తండ్రి పేరు | దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి (తమ్మన శాస్త్రి) |
| జీవిత భాగస్వామి పేరు | రాజహంస |
| పుట్టినతేదీ | 11/1/1897 |
| మరణం | 2/24/1980 |
| పుట్టిన ఊరు | రావువారి చంద్రపాలెం(పిఠాపురం) |
| విద్యార్హతలు | డిగ్రీ |
| వృత్తి | ఉపాధ్యాయులు |
| తెలిసిన ఇతర భాషలు | ఆంగ్ల భాష |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | కృష్ణపక్షం,ఊర్వశి,అమృత వీణ, శర్మిష్ఠ,మంగళకాహాళి, అమూల్య అభిప్రాయాలూ,కృష్ణశాస్త్రి వ్యాసావళి, ధనుర్దాసు,బహుకాల దర్శనం,మహతి,శ్రీవిద్యావతి,అండాళ్లు తిరుప్పావై కీర్తనలు |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | ఆంధ్రవిశ్వవిద్యాలయం వారిచే కళాప్రపూర్ణ, సాహిత్య అకాడెమి అవార్డు,పద్మభూషణ్ |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | కూచి నరసింహం,రఘుపతి వెంకటరత్నం,రవీంద్రనాథ్ టాగోర్ |
| నమూనా రచన శీర్షిక | దేవుల పల్లి కృష్ణశాస్త్రి నమూనా రచన- |
| సంగ్రహ నమూనా రచన | – |
కృష్ణశాస్త్రి భావలహరి
‘క్రౌర్య కౌటిల్య కల్పిత కఠిన దాస్య
శృంఖలములు తమంతనె చెదరిపోవ
గగనతలము మార్మోగగ కంఠమెత్తి
జగమునిండ స్వేచ్ఛాగాన ఝరులనింతు’
‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు
నా యిచ్చయేగాక నాకేటి వెరపు ‘
‘దిగిరాను దిగిరాను దివినుండి భువికి
నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు’
‘ఆకులో ఆకునై పూవులో పూవునై
కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై
ఈ యడవి దాగిపోనా’
‘తిమిర లత తారకాకుసుమములఁ దాల్చఁ
గర్కశ శిలయు నవజీవ కళలఁ దేఱ
మ్రోడు మోక చివురులెత్తి మురువు సూప
జగమునిండ స్వేచ్ఛాగాన ఝరులనింతు’
*****