| పేరు (ఆంగ్లం) | Chilakamarthi Lakshmi Narasimham |
| పేరు (తెలుగు) | చిలకమర్తి లక్ష్మీనరసింహం |
| కలం పేరు | – |
| తల్లిపేరు | రత్నమ్మ |
| తండ్రి పేరు | వెంకయ్య |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 9/26/1867 |
| మరణం | 6/17/1946 |
| పుట్టిన ఊరు | పశ్చిమ గోదావరి జిల్లా, పెరవలి మండలములోని ఖండవల్లి గ్రామము |
| విద్యార్హతలు | హైస్కూలు విద్య |
| వృత్తి | ఉపాధ్యాయుడు |
| తెలిసిన ఇతర భాషలు | తెలుగు ఇంగ్లీషు |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | కీచక వధ, ద్రౌపదీ పరిణయం, గయోపాఖ్యానం, గణపతి, |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | http://www.avkf.org/BookLink/display_author_books.php?author_id=621 |
| పొందిన బిరుదులు / అవార్డులు | “కళాప్రపూర్ణ” ఆంధ్ర విశ్వవిద్యాలయం 1943 |
| ఇతర వివరాలు | చిలకమర్తి లక్ష్మీనరసింహం ప్రముఖ కవి, రచయిత, నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది, విద్యావేత్త. 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభ కాలంలో తెలుగు సాహిత్యం అభివృద్ధికి, తెలుగు నాట ఆధునిక భావాల వికాసానికి పట్టుకొమ్మలైన మహామహులలో చిలకమర్తి ఒకరు. ఆయన రచించిన గయోపాఖ్యానం అనే నాటకం ప్రతులు లక్షకి పైబడి అమ్ముడుపోవటమనేది తెలుగు సాహిత్య చరిత్రలో కనీ వినీ ఎరగని విషయం. |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | రచనల నుండి ఉదాహరణలు |
| సంగ్రహ నమూనా రచన | రచనల నుండి ఉదాహరణలు బ్రిటిష్ పాలనను నిరసిస్తూ చిలకమర్తి లక్ష్మీనరసింహం రచించిన ప్రసిద్ధమైన పద్యం: భరతఖండంబు చక్కని పాడియావు హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ తెల్లవారను గడుసరి గొల్లవారు పితుకుచున్నారు మూతులు బిగియగట్టి గయోపాఖ్యానంలో కృష్ణార్జునుల మధ్య పోరును ఆపడానికి సుభద్ర మగని దగ్గరకూ, అన్న దగ్గరకూ వెళ్ళినపుడు వారు ఆమెను దెప్పిన విధం: ఎంతయినా ఆడువారికి పుట్టింటి పైనే అభిమానం ఉంటుందంటూ అర్జునుడిలా అన్నాడు:- మగువ మీదను పతికింత మక్కువైన మగువ మీదను పతికింత మమతయున్న పుట్టినింటికి కడుగూర్చు పొలతి యెపుడు |
చిలకమర్తి లక్ష్మీనరసింహం రచనల నుండి ఉదాహరణలు
బ్రిటిష్ పాలనను నిరసిస్తూ చిలకమర్తి లక్ష్మీనరసింహం రచించిన ప్రసిద్ధమైన పద్యం:
భరతఖండంబు చక్కని పాడియావు
హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు
పితుకుచున్నారు మూతులు బిగియగట్టి
గయోపాఖ్యానంలో కృష్ణార్జునుల మధ్య పోరును ఆపడానికి సుభద్ర మగని దగ్గరకూ, అన్న దగ్గరకూ వెళ్ళినపుడు వారు ఆమెను దెప్పిన విధం:
ఎంతయినా ఆడువారికి పుట్టింటి పైనే అభిమానం ఉంటుందంటూ
అర్జునుడిలా అన్నాడు:-
మగువ మీదను పతికింత మక్కువైన
మగువ మీదను పతికింత మమతయున్న
పుట్టినింటికి కడుగూర్చు పొలతి యెపుడు
పుట్టింటి సొమ్ములెన్ని తీసుకొన్నా ఆడువారు మెట్టింటివైపే మాట్లాడుతారంటూ కృష్ణుడు పలికిన విధం:-
సార చీరెలు నగలును చాలగొనుచు
పుట్టినిండ్ల గుల్లలు జేసిపోయి సతులు
తుదకు మగని పక్షము చేరి ఎదురగుదురు
మగనిపై కూర్మి అధికము మగువకెపుడు
చతుర చంద్రహాసం నాటకంలో – పాండవులను వారణావతానికి పంపమని దుర్యోధనుడు పట్టుబట్టినపుడు ధృతరాష్ట్రుడు పడిన ఆవేదన:-
కొడుకు నుడువులు వింటినా కులము సెడును
కులము మేలెంచుకొంటినా కొడుకు సెడును
కొడుకు కులమును జెడకుండ నడువ వలయు
లేనిచో వంశమున కెల్ల హాని గల్గు
“పకోడి” గురించి
ఓ సాయంకాలం స్నేహితులంతా కూర్చున్నాక పకోడీలు తెప్పించారు. అక్కడే వున్న చిలకమర్తివారిని వారి స్నేహితులు పద్యాలు చెప్పమని కోరారు. “కవులకు అక్షర లక్షలిచ్చెడి కాలము గతించినది. పద్యమునకు పకోడినిచ్చెడి దుర్దినములు వచ్చినవి” అని హాస్యోక్తులు విసరి ఆయన
పకోడిపై చెప్పిన పద్యాలలో కొన్ని:
వనితల పలుకుల యందున
ననిమిష లోకమున నున్న దమృత మటంచున్
జనులనుటె గాని లేదట
కనుగొన నీయందమృతము గలదు పకోడీ!
ఆ కమ్మదనము నారుచి
యా కరకర యా ఘుమఘుమ మా పొంకములా
రాకలు పోకలు వడుపులు
నీకే దగు నెందు లేవు నిజము పకోడీ!
కోడిని దినుటకు సెలవున్
వేడిరి మును బ్రాహ్మణులును వేధ నతండున్
కోడి వలదా బదులుగ ప
కోడిం దినుమనుచు జెప్పె కూర్మి పకోడీ!
“గీత మంజరి” లోని నీతి పద్యం
సరి యయిన మార్గమును బట్టి సంచరించు
నతడు చేరు గమ్యస్థానమశ్రమమున
ఇనుప పట్టీలపై నుండి యేగునట్టి
ధూమ శకటంబు వలె శ్రేణి దొలగకుండ
———–